PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanthreddy-vs-kcr81820979-0e3e-416e-9b84-7a585c8d54af-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanthreddy-vs-kcr81820979-0e3e-416e-9b84-7a585c8d54af-415x250-IndiaHerald.jpgఢిల్లీలో ఏం జరిగిందో తెలియదు కానీ ... అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం... కేసీఆర్ కు చలిజ్వరం వచ్చి ఫాంహౌస్ నుంచి బయటకు రావడంలేదని ..రెస్ట్ తీసుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రం రైతుల కోసం తెచ్చిన చట్టాలతో వారికి ఉపయోగం లేకపోగా పూర్తిగా ముంచేస్తుంది అన్నారు. revanthreddy vs kcr;modi;amit shah;kcr;ktr;revanth;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;revanth reddy;congress;minister;central government;house;reddyకేసీఆర్ రహస్యం బయటపెట్టిన రేవంత్ రెడ్డి...?కేసీఆర్ రహస్యం బయటపెట్టిన రేవంత్ రెడ్డి...?revanthreddy vs kcr;modi;amit shah;kcr;ktr;revanth;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;revanth reddy;congress;minister;central government;house;reddyMon, 15 Feb 2021 09:00:00 GMTరేవంత్ రెడ్డి ఇప్పుడు మరోసారి తెలంగాణ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. రైతు నేతల నిరసన కంటిన్యూ అవుతున్నా కేంద్రం స్పందించడం లేదు, వ్యవసాయ చట్టాల గురించి ఊసు ఎత్తడం లేదు... ఇదంతా చూస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రేక్షక పాత్ర పోషిస్తుందే తప్ప... రైతుల కోసం నోరు కూడా మెదపడం లేదు అని ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పాదయాత్రలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.... అయితే ఆయన పాదయాత్రకు పెద్దగా ప్రచారం లేక రగిలిపోతున్నారు. ఇంత చేస్తున్నా ప్రత్యేక గుర్తింపు దక్కడం లేదంటూ ఫీల్ అవుతున్నారట రేవంత్.

అసలే ఇంత కాక మీద ఉన్న ఈయన కేసిఆర్ , కేటీఆర్ లపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాడు. తాజాగా పాదయాత్ర చేస్తూ .. శనివారం నాటికి అమన్ గల్ కు చేరుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం , ఆయన కుమారుడు కేటీఆర్ పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. మోడీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు... రైతుల కోసమే అన్నట్టుగా కేంద్రం కలరింగ్ ఇస్తోంది. రైతు లేమో మమ్మల్ని దోచుకునే ఈ చట్టాలు మాకొద్దు బాబోయ్ అంటూ నిరసనలు చేపడుతున్నారు. కానీ రైతులకు అండగా నిలబడాల్సిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అంటీ అంటనట్టు వ్యవహరిస్తోంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పోరాడినట్లు డ్రామాలు చేస్తోందన్నారు రేవంత్. వాస్తవానికి ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ వణికిపోతున్నారు అన్నారు.

 ఢిల్లీలో ఏం జరిగిందో తెలియదు కానీ ... అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం... కేసీఆర్ కు చలిజ్వరం వచ్చి ఫాంహౌస్ నుంచి బయటకు రావడంలేదని ..రెస్ట్ తీసుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రం రైతుల కోసం తెచ్చిన చట్టాలతో వారికి ఉపయోగం లేకపోగా పూర్తిగా ముంచేస్తుంది అన్నారు. మోడీ సర్కారు తీసుకొచ్చిన నల్ల చట్టాలతో బహుళ జాతి సంస్థలకు రైతులు బానిసలుగా  మారబోతున్నారు అంటూ, అందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు పలుకుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎక్కడో అమెరికాలో చిన్న ఉద్యోగం చేసుకునే కేటీఆర్... ఇప్పుడు తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని అప్పనంగా  అనుభవిస్తున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్.. బీజేపీ రెండు పార్టీల గద్దెలు కూలి... దిమ్మ తిరగాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు చూస్తూ నమ్మడానికి ప్రజలు ఏమి అమాయకులు కాదంటూ... త్వరలోనే టిఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం నేర్పుతారన్నారు.


ఖమ్మం జిల్లాలో కొత్త వైరస్

మంత్రి కొడాలిని బాగానే ఇరికించారు..

ఉప్పెన కు సమస్యగా తయారైన నెట్ ఫ్లిక్స్ !

జగడ్డ : నిమ్మగడ్డా.. ప్లీజ్‌.. అది కూడా కానిచ్చేయండీ..!

జగడ్డ: బాబు దెబ్బకి వైసీపీలో వణుకు..

జగడ్డ: ఉన్న కాస్త పరువూ పోగొట్టుకుంటున్న చంద్రబాబు..!?

ఏంటీ.. పవన్ కళ్యాణ్ ను.. ఆ హీరోయిన్ ప్రేమిస్తుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>