PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections6c514195-e6dc-4299-b694-bc2adec2417e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections6c514195-e6dc-4299-b694-bc2adec2417e-415x250-IndiaHerald.jpgఒకపక్క ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు అలాగే ప్రజలు అందరూ ఎన్నికల హడవుడిలో ఉక్కిరిబిక్కిరి అవుతువుంటే ఈ ఎన్నికలు నిర్వహించే ముఖ్య అధికారి అయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ప్రశాంతంగా వెకేషన్ 3 లోకి వెళ్ళిపోయారు. ఆయన కొద్ది రోజులుగా తిరుమలలో ప్రశాంతంగా సేదతీరుతున్నారు. ఏకంగా మూడు రోజులుగా తిరుమలలోనే మకాం వేసి స్వామివారిని దర్శించుకుంటు కుటుంభసభ్యులుతో కాలక్షేపం చేస్తూన్నారు. అయితే ఆయన గత వారంలో కూడా తిరుమల దర్శనానికి వెళ్లడం గమనార్హం. ఒకపక్క పంచాయతీ ఎన్నికలు ఇంకోపక్క ప్రభుత్వానికి ఆదేశాలు జnimmagadda jagan elections;darshana;kumaar;tiru;high court;tirupati;panchayatiజగడ్డ : అందరిలో ఎన్నికల టెన్షన్... నిమ్మగడ్డ మాత్రం రిలాక్స్ మోడ్ లో !జగడ్డ : అందరిలో ఎన్నికల టెన్షన్... నిమ్మగడ్డ మాత్రం రిలాక్స్ మోడ్ లో !nimmagadda jagan elections;darshana;kumaar;tiru;high court;tirupati;panchayatiMon, 15 Feb 2021 17:00:00 GMTకుమార్ మాత్రం ప్రశాంతంగా వెకేషన్ 3 లోకి వెళ్ళిపోయారు. ఆయన కొద్ది రోజులుగా తిరుమలలో ప్రశాంతంగా సేదతీరుతున్నారు. ఏకంగా మూడు రోజులుగా తిరుమలలోనే మకాం వేసి స్వామివారిని దర్శించుకుంటు కుటుంభసభ్యులుతో కాలక్షేపం చేస్తూన్నారు. అయితే ఆయన గత వారంలో కూడా తిరుమల దర్శనానికి వెళ్లడం గమనార్హం.


ఒకపక్క పంచాయతీ ఎన్నికలు ఇంకోపక్క ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ, హైకోర్టును ఆశ్రయిస్తూ, ఇంకో వైపు ఫలితాల ప్రకటన చేస్తూ ఇలా ఒక రకంగా బిజీ బిజీగా గడుపుతున్న ఆయన పని ఒత్తిడి వల్లనో లేక రిటైర్మెంట్ దగ్గరపడుతున్న కారణంగా ఆ తరువాత ఎంత అధికారిక దర్శనాలు దొరకవు అనే భావనతోనో  తెలియదు కానీ రమేష్ కుమార్ అన్నింటికి దూరంగా.... కుటుంభసభ్యులుతో తిరుమలలో ప్రశాంతంగా గడుపుతున్నారు. మొన్నటి రాత్రి తిరుమల చేరుకున్న రమేష్ కుమార్ నిన్న ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.


తరువాత గదికే పరిమితం అయ్యారు. ఈరోజు ఉదయం మరోసారి శ్రీవారిని దర్శించుకున్న రమేష్ కుమార్ అనంతరం అటు  కుటుంభసభ్యులుతో కలసి శనకనందతీర్దం, పాపవినాశనం డ్యాంలను సందర్శించారు. తిరిగి రేపు ఉదయం కూడా మరో సారి శ్రీవారిని దర్శించుకోనున్నారని చెబుతున్నారు. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పర్యటనకు టిటిడి అధికారులు దూరంగా ఉండడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే సుమారుగా పది రోజులు క్రితం శ్రీవారి దర్శనం కోసం ఆయన వచ్చిన సమయంలో అప్పటి  టిటిడి జేఇఓ బసంత్ కుమార్ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ వ్యవహారం ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్ళగానే బసంత్ కుమార్ పై బదిలి వేటు పడింది. ఈ దెబ్బకు ఈ సారి పర్యటనలో టిటిడి తరపున ఒక్క వ్యక్తి కూడా  నిమ్మగడ్డ పర్యటనలో కనిపించడం లేదు. 


అశ్విన్ వీర విహారం..భారీ స్కోర్ నమోదు చేసిన భారత్..!!

డప్పు కొడుతున్న అనసూయ.. కుర్రాళ్ల గుండెల్లో నిప్పు రాజేస్తుంది..!

వైష్ణవ్ తేజ్ హిట్.. అఖిల్ కు తలనొప్పిగా మారిందా..?

ఉప్పెన 3 డేస్ లోనే ప్రాఫిట్స్.. మెగా హీరో మొదటి సినిమానే రికార్డ్..!

స‌జ్జ‌ల వారి దౌత్యం కుద‌ర‌లేదు.. ఎమ్మెల్యే వ‌ర్సెస్ కీల‌క నేత ర‌గ‌డ ?

ర‌వి రాజ‌కీయం.. టీడీపీకి కొత్త ఉద‌యం..!

అఖిల్.. మోనాల్.. బిగ్ బాస్ కపుల్ క్రేజీ వెబ్ సీరీస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>