SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news8ec5eba0-17fe-42ff-9ca7-4b07cc2bee7a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news8ec5eba0-17fe-42ff-9ca7-4b07cc2bee7a-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టీమిండియాలో యువ సంచలనం రిషబ్ పంత్ తనదైన శైలిలో దూసుకుపోతూ ప్రతి మ్యాచ్ లోనూ మంచి స్కోర్ రాబడుతూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆస్ట్రేలియా పర్యటన మొదలుకొని తాజాగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ వరకు ప్రతి మ్యాచ్ లోనూ తనదైన ముద్ర చేస్తున్నాడు. దీంతో పంత్ ప్రదర్శనపై సర్వత్ర ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ పంత్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. రిషబ్ పంత్ భారత్ కు దొరికిన ఆస్తి అంటూ కొనియాడాడు. sports news;gautham new;gautham;varsha;india;australia;england;gautam gambhir;rishabh pant;yuva;chepauk;paruguపంత్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన గంభీర్..!!పంత్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన గంభీర్..!!sports news;gautham new;gautham;varsha;india;australia;england;gautam gambhir;rishabh pant;yuva;chepauk;paruguMon, 15 Feb 2021 07:05:05 GMTయువ సంచలనం రిషబ్ పంత్ తనదైన శైలిలో దూసుకుపోతూ ప్రతి మ్యాచ్ లోనూ మంచి స్కోర్ రాబడుతూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆస్ట్రేలియా పర్యటన మొదలుకొని తాజాగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ వరకు ప్రతి మ్యాచ్ లోనూ తనదైన ముద్ర చేస్తున్నాడు. దీంతో పంత్ ప్రదర్శనపై సర్వత్ర ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ పంత్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. రిషబ్ పంత్ భారత్ కు దొరికిన ఆస్తి అంటూ కొనియాడాడు. తాజాగా చెపాక్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పంత్‌ (58*; 77 బంతుల్లో, 7×4, 3×6) అజేయ అర్ధశతకం సాధించిన సంగతి తెలిసిందే. అంతేగాక రెండు అద్భుతమైన క్యాచ్‌లతో ఇంగ్లాండ్‌ను తక్కువ స్కోరుకు ఆలౌట్‌ చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు.

పంత్ ఎంతో ఆత్మ విశ్వాసంతో బ్యాటింగ్ చేస్తున్నాడని, అందువల్లే ప్రతి మ్యాచ్లోనూ మంచి ప్రదర్శన కనబరుస్తున్నారని గంభీర్ అన్నాడు. బ్యాటింగ్‌లో నమ్మకంతో చేసే ప్రదర్శన ఫలితం వికెట్‌కీపింగ్‌లోనూ ప్రతిబింబిస్తుందని, చెపాక్‌ లో స్పిన్నర్ల బౌలింగ్ లో వికెట్ కీపింగ్ చేయడం కఠినతరమని, అయినప్పటికీ పంత్ చక్కగా వికెట్‌కీపింగ్ చేస్తున్నాడని గంబీర్ కొనియాడాడు. గతంతో పోలిస్తే పంత్ కీపింగ్‌లో ఎంతో పరిణితి సాధిస్తున్నాడని తెలిపాడు.

 ఇలానే పరుగులు సాధిస్తూ.. వికెట్‌కీపింగ్‌లో మరింత మెరుగైతే టీమిండియాకు గొప్ప ప్యాకేజ్‌లా మారతాడు’’ అని గంభీర్ అన్నాడు. టెస్టుల్లో పంత్‌ తన ప్రదర్శన ఇలానే కొనసాగిస్తే అతడు భారత క్రికెట్‌కు దొరికిన గొప్ప ఆస్తి అవుతాడని గౌతమ్ గంభీర్ ప్రశంశలు కురిపించాడు. కాగా, టీమిండియా- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఆదివారం ఆట ముగిసేసరికి ఇంగ్లాండ్‌పై భారత్‌ 249 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 329 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ 134 పరుగులకే ఆలౌటైంది.


ప్రపంచంలోనే అత్యంత చవకైన బైక్ బైక్.. ధర ఎంతో తెలిస్తే షాక్..?

జగడ్డ: ఉన్న కాస్త పరువూ పోగొట్టుకుంటున్న చంద్రబాబు..!?

ఏంటీ.. పవన్ కళ్యాణ్ ను.. ఆ హీరోయిన్ ప్రేమిస్తుందా..?

స్టార్ హీరో అయ్యాక అబ్బాస్ పెట్రోల్ బంక్ లో ఎందుకు పని చేయాల్సి వచ్చింది

మూడు వారాల గ్యాప్ లో ... మూడు సునామీలు ....బాక్సాఫీస్ రచ్చ రచ్చే .... ??

RC15 కి మ్యూజిక్ డైరెక్టర్ అతనేనా?

హమ్మా.. మళ్లీ మెగాస్టార్ సరసన ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందిగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>