MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akkinenib3e7d714-7a5f-43b9-8c41-5e2aeefcb821-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akkinenib3e7d714-7a5f-43b9-8c41-5e2aeefcb821-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర సీమలో ప్రతీ హీరోకూ ఒక ఐడెంటిటీ ఉంటుంది. గతంలో అయితే ఎన్టీయార్ పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరుగా ఉండేవారు. ఏయన్నార్ చూస్తే ప్రేమ కధలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే వారు. సూపర్ స్టార్ క్రిష్ణ క్రైమ్ మూవీస్ చేస్తే శోభన్ బాబు ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నారు. akkineni;ntr;naga chaitanya;nagarjuna akkineni;pooja hegde;akhil akkineni;bhaskar;naga;nageshwara rao akkineni;prema;sekhar;kamma;cinema;baba bhaskar;rajani kanth;naga aswin;genre;love;audience;director;heroine;june;chaitanya 1;mass;sai pallavi;adhurs;love story;fidaaఅక్కినేని బ్రదర్స్ ప్రేమలు అదుర్స్...?అక్కినేని బ్రదర్స్ ప్రేమలు అదుర్స్...?akkineni;ntr;naga chaitanya;nagarjuna akkineni;pooja hegde;akhil akkineni;bhaskar;naga;nageshwara rao akkineni;prema;sekhar;kamma;cinema;baba bhaskar;rajani kanth;naga aswin;genre;love;audience;director;heroine;june;chaitanya 1;mass;sai pallavi;adhurs;love story;fidaaMon, 15 Feb 2021 11:00:00 GMTఎన్టీయార్ పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరుగా ఉండేవారు. ఏయన్నార్ చూస్తే ప్రేమ కధలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే వారు. సూపర్ స్టార్ క్రిష్ణ క్రైమ్  మూవీస్ చేస్తే శోభన్ బాబు ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నారు.

కాలాలు ఎన్ని మారినా కూడా ఇపుడు కూడా అదే ఒరవడి సాగుతోంది. అక్కినేని వారసుడిగా తెరంగ్రేట్రం చేసిన నాగార్జున అన్ని జోనర్లను టచ్ చేసి శభాష్ అనిపించుకున్నారు. అయితే నాగార్జున ప్రేమ కధా చిత్రాలకు అతికినట్లుగా సరిపోతాడని పేరు. ఇపుడు ఆయన నట వారసులుగా ముందుకు వచ్చిన ఇద్దరు కొడుకులూ కూడా లవ్ జోనర్ లోనే మూవీస్ చేస్తున్నారు.

మొదటి సినిమాతో పక్కా మాస్ యాక్షన్ హీరోగా ఎస్టాబ్లిష్ కావాలని అటు నాగ చైతన్య, ఇటు అఖిల్ చూసినా కూడా ఆడియన్స్ మాత్రం వారి నుంచి మంచి లవ్ స్టోరీస్ నే కోరుకుంటున్నారని తెలుస్తోంది. దాంతో కరెక్ట్ రూట్ లోకి వచ్చిన అక్కినేని బ్రదర్స్ ఆడియన్స్ మనసు నచ్చేలా అందరూ మెచ్చేలా లవ్ స్టోరీస్ ని ఎంచుకున్నారు. ముందుగా నాగ చైతన్య లవ్ స్టోరీ గురించి చెప్పాలి.

దీనిని ఫిదా డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్నారు. హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తోంది. దాంతో ఈ మూవీ మీద అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఫిదాతో సాఫ్ట్ మూవీస్ కూడా బాక్సాఫీస్ ని బద్దలు కొడతాయని నిరూపించిన శేఖర్ కమ్ముల లవ్ స్టోరీతో అదే ప్రయోగం చేస్తున్నారు. ఈ మూవీని ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నారు.

ఇక ఇదే ఏడాది జూన్ 18న అక్కినేని అఖిల్ మూవీ మోస్ట్ ఎలిబిబుల్ బ్యాచలర్ మూవీ వస్తోంది. ఈ మూవీకి అన్నీ బాగా కుదిరాయని అంటున్నారు. హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజా హెగ్డే జోడీ కడుతోంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్, వెనక మంచి బ్యానర్ ఉండడంతో అన్నీ ఈ మూవీకి బాగా సెట్ అయ్యారని అంటున్నారు. మొత్తానికి ఈ రెండు సినిమాలతో అక్కినేని బ్రదర్స్ చెప్పే ప్రేమ కధలు ఏంటి అన్నది ఆడియన్స్ కి తెలుస్తుంది అంటున్నారు.




హిమ‌ల‌యాలు క‌ర‌గ‌కుండా క‌ట్ట‌డి... క‌శ్మీర్ ప్ర‌జ‌లు ఏం చేస్తున్నారంటే..

బిగ్ బ్రేకింగ్: ఏపీలో మరో ఎన్నికల సమరానికి షెడ్యూల్

ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ సినిమా... ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్ వ‌చ్చేసింది..!

సౌందర్య బయోపిక్ పై రష్మిక ఆకస్మిక ప్రకటన !

ఉప్పెన మీద వివాదం.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం !

కత్తిలా ఉన్నావ్ అంటూ.. యాంకర్ సుమపై జబర్దస్త్ కమెడియన్ కామెంట్..!?

మంత్రి కొడాలిని బాగానే ఇరికించారు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>