Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/first-time-in-50-years-history-prime-minister-photo-sent-into-spacecc54f26c-d324-44a3-a7cd-8be7e148a9dc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/first-time-in-50-years-history-prime-minister-photo-sent-into-spacecc54f26c-d324-44a3-a7cd-8be7e148a9dc-415x250-IndiaHerald.jpgభారత అంతరిక్ష పరిశోధన సంస్థ చరిత్రలో తొలిసారి ఓ అరుదైన ఘటన చోటు చేసుకోబోతోంది. 50 ఏళ్ల ఇస్రో చరిత్రలో తొలిసారిగా ప్రధాని ఫోటోను అంతరిక్షంలోకి పంపించబోతోంది. దీని కోసం ఈ ఏడాదిలో చేయబోయే తొలి అంతరిక్ష ప్రయోగంతోనే ఈ ఘనత సాధించబోతోంది. అంతేకాకుండా 50 ఏళ్ల ఇస్రో చరిత్రలో తొలిసారిగా దేశీయ ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి..prime minister modi;delhi;india;narendra modi;school;prime minister;bengaluru 1;isro;february;doctor;central government;narendraఅంతరిక్షంలోకి ప్రధాని ఫోటో, భగవద్గీత.. 50 ఏళ్ల చరిత్రలో తొలిసారి..అంతరిక్షంలోకి ప్రధాని ఫోటో, భగవద్గీత.. 50 ఏళ్ల చరిత్రలో తొలిసారి..prime minister modi;delhi;india;narendra modi;school;prime minister;bengaluru 1;isro;february;doctor;central government;narendraMon, 15 Feb 2021 12:24:38 GMTన్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చరిత్రలో తొలిసారి ఓ అరుదైన ఘటన చోటు చేసుకోబోతోంది. 50 ఏళ్ల ఇస్రో చరిత్రలో తొలిసారిగా ప్రధాని ఫోటోను అంతరిక్షంలోకి పంపించబోతోంది. దీని కోసం ఈ ఏడాదిలో చేయబోయే తొలి అంతరిక్ష ప్రయోగంతోనే ఈ ఘనత సాధించబోతోంది. అంతేకాకుండా 50 ఏళ్ల ఇస్రో చరిత్రలో తొలిసారిగా దేశీయ ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది. ఇందులోని ఒక శాటిలైట్‌లో భగవద్గీత కాపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో, అలాగే 25,000 మంది పౌరుల పేర్లను కూడా అంతరిక్షంలోకి పంపించనుంది. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఫిబ్రవరి 28న ఉదయం 10.24 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-51 వాహకనౌకను ప్రయోగించనున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు.

ఈ ప్రయోగం ద్వారా ఇస్రో.. పీఎస్‌ఎల్‌వీ సీ-51 ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమెజానియా-1, భారత ప్రైవేటు సంస్థలు రూపొందించిన ‘ఆనంద్‌’, ‘సతీశ్‌ ధావన్‌’, ‘యునిటీశాట్‌’ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించనుంది. భారతీయ ఉపగ్రహాల్లో ‘ఆనంద్‌’ను బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ ‘పిక్సెల్‌’ రూపొందించగా, ‘సతీశ్‌ ధావన్‌’ను చెన్నైకు చెందిన ‘స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా’, ‘యునిటీశాట్’‌ను జిట్‌శాట్‌(శ్రీపెరంబుదూర్‌), జీహెచ్‌ఆర్‌సీఈ శాట్‌(నాగ్‌పుర్‌), శ్రీశక్తి శాట్‌ (కోయంబత్తూరు) కళాశాలల విద్యార్థులు రూపొందించటం విశేషం.

స్సేస్‌ కిడ్జ్‌ ఇండియా ‘సతీశ్‌ ధావన్‌(ఎస్‌డీ శాట్‌)’ ఉపగ్రహాన్ని ప్రముఖ భారత అంతరిక్ష శాస్త్రవేత్త సతీశ్‌ ధావన్‌ పేరు మీదుగా రూపొందించింది. తమ సంస్థ నుంచి నింగిలోకి వెళ్తున్న తొలి ఉపగ్రహం‌ కావడంతో ఈ ప్రయోగానికి మరింత ప్రత్యేక తీసుకురావాలని స్పేస్‌కిడ్జ్‌ ఇండియా భావించింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ చిత్రపటాన్ని ఉపగ్రహంలో పంపనున్నట్లు సంస్థ సీఈవో డాక్టర్‌ శ్రీమతి కేసన్‌ వెల్లడించారు. మోదీ పేరు, ఫొటో.. దాని కింద ‘ఆత్మనిర్భర్‌ మిషన్’‌ అనే పదాలతో పాటు, భగవద్గీత కాపీని ఉంచి, అలాగే మరో 25000 మంది పేర్లను కూడా తమ ఉపగ్రహం ద్వారా నింగిలోకి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.

‘‘స్పేస్‌ సైన్స్‌, మా ప్రయోగం పట్ల ప్రజల్లో మరింత ఆసక్తి కలిగించాలనే ఉద్దేశంతోనే అంతరిక్షంలోకి పంపేందుకు పేర్లు కావాలని అడిగాం.. వారం రోజుల్లోనే 25వేల ఎంట్రీలు వచ్చాయి. వీటిలో 1000 పేర్లు విదేశీయులవి కాగా.. చెన్నైకి చెందిన ఓ పాఠశాల తమ విద్యార్థుల అందరి పేర్లు పంపింది. ఈ పేర్లతో పాటు మోదీ ఫొటోను పంపనున్నాం. ఇక విదేశాలకు చెందిన కొన్ని ప్రయోగాల్లో ఆయా దేశాలు బైబిల్‌ను అంతరిక్షంలోకి పంపాయి. అందుకే, మేం మన పవిత్ర గ్రంథమైన భగవద్గీతను పంపించాలనుకుంటున్నాం’’ అని డాక్టర్ శ్రీమతి వెల్లడించారు.




ధర్మపురి అరవింద్ కేబినేట్ బెర్త్ ఖరారు

షూటింగ్ స్పాట్ కి లేట్ గా వచ్చాడని ఒక సీనియర్ నటుడిని మెగాస్టార్ ఏమి చేసాడంటే..?

జగడ్డ : విశాఖ బ్యాడ్ సెంటిమెంట్ షాక్ ?

రమ్యకృష్ణ కొడుకు ఎలా ఉన్నాడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

బిగ్ బ్రేకింగ్: ఏపీలో మరో ఎన్నికల సమరానికి షెడ్యూల్

ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ సినిమా... ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్ వ‌చ్చేసింది..!

సౌందర్య బయోపిక్ పై రష్మిక ఆకస్మిక ప్రకటన !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>