PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/lokesh-jaganc92c0113-2840-4f82-b517-3037c41924cd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/lokesh-jaganc92c0113-2840-4f82-b517-3037c41924cd-415x250-IndiaHerald.jpgటిడిపి కార్యకర్తలకు ముందు నుంచి నారా లోకేష్ అంటే సరైన అభిప్రాయం ఉండేది కాదు. తమ అధినేత చంద్రబాబు పుత్ర వాత్సల్యంతో లోకేష్ ని తెచ్చి నెత్తి మీద పెట్టాడు అనే ఉద్దేశంతో వారంతా ఉండే వారు. దీనికి తగ్గట్టు లోకేష్ మాట తీరు, తెలుగు స్పష్టంగా మాట్లాడలేక పోవడం లాంటి అనేక కారణాలతో జగన్ అండ్ కో ఆయనకు పప్పు అనే పేరుని బలవంతంగా రుద్దేశారు.. అయితే క్రమక్రమంగా నారా లోకేష్ తెలుగులో, అలాగే మాట్లాడే విషయంలో పట్టు పెంచుకుంటూ వెళుతున్నాడు. ఎలాగో అధికారంలో లేరు కాబట్టి ఇప్పుడు ప్రజలతో మమేకం అయ్యే అవకాశాలు ఎక్కువగా దొnimmagadda jagan elections;lokesh;kushi;raj;jagan;nara lokesh;telugu;vishakapatnam;panchayati;car;tdp;yuva;lokesh kanagaraj;massగన్ డైలాగ్స్ తో చినబాబు మాస్...ఖుషీ అవుతున్న తెలుగు తమ్ముళ్ళు !గన్ డైలాగ్స్ తో చినబాబు మాస్...ఖుషీ అవుతున్న తెలుగు తమ్ముళ్ళు !nimmagadda jagan elections;lokesh;kushi;raj;jagan;nara lokesh;telugu;vishakapatnam;panchayati;car;tdp;yuva;lokesh kanagaraj;massMon, 15 Feb 2021 14:00:00 GMTటిడిపి కార్యకర్తలకు ముందు నుంచి నారా లోకేష్ అంటే సరైన అభిప్రాయం ఉండేది కాదు. తమ అధినేత చంద్రబాబు పుత్ర వాత్సల్యంతో లోకేష్ ని తెచ్చి నెత్తి మీద పెట్టాడు అనే ఉద్దేశంతో వారంతా ఉండే వారు. దీనికి తగ్గట్టు లోకేష్ మాట తీరు, తెలుగు స్పష్టంగా మాట్లాడలేక పోవడం లాంటి అనేక కారణాలతో జగన్ అండ్ కో ఆయనకు పప్పు అనే పేరుని బలవంతంగా రుద్దేశారు.. అయితే క్రమక్రమంగా నారా లోకేష్ తెలుగులో, అలాగే మాట్లాడే విషయంలో పట్టు పెంచుకుంటూ వెళుతున్నాడు. ఎలాగో అధికారంలో లేరు కాబట్టి ఇప్పుడు ప్రజలతో మమేకం అయ్యే అవకాశాలు ఎక్కువగా దొరుకుతున్నాయి. చాలా కాలం పాటు కరోనా సెలవులు తీసుకున్న తరువాత ఇప్పుడు లోకేష్ అన్ని విషయాలలో దూకుడు చూపిస్తూ తెలుగు తమ్ముళ్లులో ఉత్సాహంగా రేపుతున్నాడు. 

నిన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశం మీద టిడిపి నేత పల్లా శ్రీనివాసరావు చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతు తెలిపేందుకు నారా లోకేష్ విశాఖపట్నం వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ను ఉద్దేశించి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుల్లెట్ లేని గన్ జగన్ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఈ గన్ నొక్కితే నీళ్లు వస్తాయని అంతకు మించి ఏమీ రావు అని ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు. 

అలాగే మోడీని చూస్తే జగన్ కు ఉచ్చ కారుతున్నాయి అని అంటూ ఒక రేంజ్ లో రెచ్చి పోయారు. అయితే ఇన్నాళ్లు పద్ధతిగా మాట్లాడుతూ రాజకీయం చేసిన నారా లోకేష్ ఇలా ఒక్కసారిగా జగన్ మీద మాటల దాడి పెంచటం తెలుగు తమ్ముళ్లకు బాగా నచ్చేసింది. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల ముందుకు వెళితే ఓడించి పంపారని జనానికి కావాల్సింది ఇలాంటి బూతుల రాజకీయమే అని వారు లోకేష్ కు సపోర్ట్ చేస్తున్నారు. అలా మొత్తం మీద నారా లోకేష్ ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులకు నచ్చేస్తున్నాడు. చాలామంది యువ నేతలు సైతం లోకేష్ నాయకత్వంలో పని చేయడానికి ఇప్పటికే సం సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే నారా లోకేష్ నెమ్మది నెమ్మదిగా నాయకుడిగా మారుతున్నాడని చెప్పొచ్చు.




3 రోజుల‌కే ఉప్పెన బాక్సాఫీస్‌ను వ‌సూళ్ల‌తో ముంచేసిందిగా... థియేట‌ర్లు హౌస్ ఫుల్‌

అఖిల్.. మోనాల్.. బిగ్ బాస్ కపుల్ క్రేజీ వెబ్ సీరీస్..!

జగడ్డ : ఉక్కే అని ఊరుకుంటే లెక్క తేల్చేస్తుందా.. ?

షూటింగ్ స్పాట్ కి లేట్ గా వచ్చాడని ఒక సీనియర్ నటుడిని మెగాస్టార్ ఏమి చేసాడంటే..?

జగడ్డ : విశాఖ బ్యాడ్ సెంటిమెంట్ షాక్ ?

రమ్యకృష్ణ కొడుకు ఎలా ఉన్నాడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

బిగ్ బ్రేకింగ్: ఏపీలో మరో ఎన్నికల సమరానికి షెడ్యూల్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>