PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mlc-kavitha-tgbks4b3ada64-71f8-47a0-945d-4436b2cab041-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mlc-kavitha-tgbks4b3ada64-71f8-47a0-945d-4436b2cab041-415x250-IndiaHerald.jpgఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత... రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఆమెకు కొత్త పదవి వస్తుందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అది తాజాగా రుజువైంది. ఎమ్మెల్సీ కవిత కొత్త పదవి చేపట్టారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. mlc kavitha tgbks;kavitha;prabhakar;bharatiya janata party;telangana;రాజీనామా;chintamaneni prabhakar;assembly;mla;minister;letter;paritala sriram;parakala prabhakar;kalvakuntla kavitha;mancherialకవితకు కొత్త పదవికవితకు కొత్త పదవిmlc kavitha tgbks;kavitha;prabhakar;bharatiya janata party;telangana;రాజీనామా;chintamaneni prabhakar;assembly;mla;minister;letter;paritala sriram;parakala prabhakar;kalvakuntla kavitha;mancherialMon, 15 Feb 2021 08:47:19 GMTతెలంగాణ రాజకీయాల్లో ఊహించినట్లే మార్పులు జరుగుతున్నాయి. ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత... రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఆమెకు కొత్త పదవి వస్తుందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అది తాజాగా రుజువైంది. ఎమ్మెల్సీ కవిత కొత్త పదవి చేపట్టారు.

       తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సింగరేణిలో గుర్తింపు సంఘమైన టీబీజీకేఎస్‌కు అధ్యక్షుడిగా బి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శిగా మిర్యాల రాజిరెడ్డి మరోమారు ఎన్నికయ్యారు.శ్రీరాంపూర్ డివిజన్ సింగరేణి ఆఫీసర్స్ క్లబ్‌లో కంపెనీ స్థాయి యూనియన్ ప్రతినిధుల సమావేశం జరిగింది. అనంతరం ఎన్నికలు నిర్వహించారు. చర్చల అనంతరం పూర్తిస్థాయి కమిటీని ప్రకటించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, నస్పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఈసంపల్లి ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు.

        గతంలోనూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షురాలిగా పని చేశారు. చివరి సారి జరిగిన సింగరేణి ఎన్నికల్లో ఆమె ఆధ్వర్యంలోనే టీబీజీకేఎస్ విజయం సాధించింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పదవికి కవిత రాజీనామా చేశారు. తర్వాత ఆ సంఘంలోనూ చాలా మార్పులు జరిగాయి. టీబీజీకేఎస్ లో కీలక నేతగా ఉన్న నేత.. బీజేపీ అనుబంధ సంఘంలో చేరారు. ఇప్పుడు కవిత మళ్లీ యాక్టివ్ కావడంతో.. టీబీజీకేఎస్ కు దూరమైన నేతలను మళ్లీ ఆహ్వానించే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాదు ఆర్టీసీలో బలమైన యూనియన్ గా ఉన్న టీఎంయూ బాధ్యతలు కూడా కవితే తీసుకోవచ్చనే చర్చ జరుగుతోంది. గతంలో ఈ సంఘానికి మంత్రి హరీష్ రావు గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారు. టీఎంయూ నేతలు కూడా ఇప్పటికే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. 


మంత్రి కొడాలిని బాగానే ఇరికించారు..

ఉప్పెన కు సమస్యగా తయారైన నెట్ ఫ్లిక్స్ !

జగడ్డ : నిమ్మగడ్డా.. ప్లీజ్‌.. అది కూడా కానిచ్చేయండీ..!

జగడ్డ: బాబు దెబ్బకి వైసీపీలో వణుకు..

జగడ్డ: ఉన్న కాస్త పరువూ పోగొట్టుకుంటున్న చంద్రబాబు..!?

ఏంటీ.. పవన్ కళ్యాణ్ ను.. ఆ హీరోయిన్ ప్రేమిస్తుందా..?

స్టార్ హీరో అయ్యాక అబ్బాస్ పెట్రోల్ బంక్ లో ఎందుకు పని చేయాల్సి వచ్చింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>