PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/teachers-problems7af76c41-3583-43df-865a-a8e9f462eb38-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/teachers-problems7af76c41-3583-43df-865a-a8e9f462eb38-415x250-IndiaHerald.jpgకరోనా దెబ్బతో ప్రైవేటు టీచర్ల జీవితాలు అల్లకల్లోలంగా మారాయి. ఏళ్ల తరబడి వీళ్లతో గొడ్డు చాకిరీ చేయించుకుని కోట్ల సంపాదించుకున్న పాఠశాలల యాజమాన్యాలు కష్టకాలంలో వీరిని రోడ్డున పడేస్తున్నాయి. నెలల తరబడి జీతాలు రాక ప్రైవేటు ఉద్యోగుల బతుకులు దారుణంగా మారుతున్నాయి. ఒకరిద్దరు బలహీన మనస్కులు ఆత్మహత్యలకు సైతం సిద్ధమవుతున్నారు. చేతిలో చిల్లిగవ్వలేక.. అవమానాలపాలు కాలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాలనుteachers-problems;technology;amala akkineni;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;jagan;school;mandalam;degreeటీచర్ల వెతలు: చదువు చెప్పే గురువుకు అవమానాలు.. ఆత్మహత్యలేనా..?టీచర్ల వెతలు: చదువు చెప్పే గురువుకు అవమానాలు.. ఆత్మహత్యలేనా..?teachers-problems;technology;amala akkineni;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;jagan;school;mandalam;degreeMon, 15 Feb 2021 07:57:30 GMT

ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాలను కోరినా పట్టించుకున్న వారే లేరు.ఈ ప్రైవేటు ఉపాధ్యాయులకు ఇంతవరకు ఎటువంటి సహాయం అందలేదు. ఏపీలో జగన్ సర్కారు అందిస్తున్న నవరత్నాల పథకంలో లో భాగంగా ప్రైవేటు ఉపాధ్యాయులకు కూడా ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్రంలో ప్రైవేటు ఉపాధ్యాయులందరూ కోరుకుంటున్నారు.


ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రైవేటు ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించేలా డిఇఓ లు, ఎంఇఓ లు చూడాలని పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ ఇటీవల జారీ చేసిన ఒక ఉత్తర్వులో పేర్కొన్నారు. కానీ ఏపీలోని ఏ మండలంలోను, ఏ జిల్లాలోను ఈ ఉత్తర్వులు అమలు జరగలేదు. ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు వేలాది మంది అధ్యాపకులను ఉద్యోగాల నుండి తొలగించి, కరోనా తగ్గిన తరువాత విద్యార్థులు చేరితే, అప్పుడు మళ్లీ చేర్చుకుంటామని చెబుతున్నాయి. మొత్తం ప్రైవేటు విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు రక్షణ లేకుండా పోయింది.


ఏ తరహా విద్యా వ్యవస్థలోనైనా ఉపాధ్యాయులే ప్రముఖ పాత్ర వహిస్తారు. విద్యా రంగంలో పెరిగిన టెక్నాలజీ వినియోగం కూడా ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం కాదని అనేక పరిశోధనలు, పరిశీలనలు తెలియ జేస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఆన్‌లైన్‌ బోధన కూడా విద్యార్థులను విశేషంగా ఆకర్షించడం లేదని అనేక మంది విద్యావేత్తలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులను జాతి సంపదగాను గుర్తించాలి. వారిని.. వారి కుటుంబాలను ఆదు కోవాల్సిన అవసరం ఉంది.




ప్రపంచంలోనే అత్యంత చవకైన బైక్ బైక్.. ధర ఎంతో తెలిస్తే షాక్..?

జగడ్డ: ఉన్న కాస్త పరువూ పోగొట్టుకుంటున్న చంద్రబాబు..!?

ఏంటీ.. పవన్ కళ్యాణ్ ను.. ఆ హీరోయిన్ ప్రేమిస్తుందా..?

స్టార్ హీరో అయ్యాక అబ్బాస్ పెట్రోల్ బంక్ లో ఎందుకు పని చేయాల్సి వచ్చింది

మూడు వారాల గ్యాప్ లో ... మూడు సునామీలు ....బాక్సాఫీస్ రచ్చ రచ్చే .... ??

RC15 కి మ్యూజిక్ డైరెక్టర్ అతనేనా?

హమ్మా.. మళ్లీ మెగాస్టార్ సరసన ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందిగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>