MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sumadcf50a0e-0657-41b4-ba3c-49b043934c3c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sumadcf50a0e-0657-41b4-ba3c-49b043934c3c-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన షోలతో, మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది సుమ. తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది యాంకర్స్ వచ్చినా కూడా సుమ తర్వాతే. ఆమెను దాటి ఎవరూ ముందుకు వెళ్లలేరు అనేది ఒప్పుకుని తీరాల్సిన సత్యం. క్లీన్ ఇమేజ్‌ తో ముందుకు వెళ్లిపోతుంది యాంకర్ సుమ.suma;chanti;satya;suma;suma kanakala;geum;jabardasth;comedy;comedian;unnaoకత్తిలా ఉన్నావ్ అంటూ.. యాంకర్ సుమపై జబర్దస్త్ కమెడియన్ కామెంట్..!?కత్తిలా ఉన్నావ్ అంటూ.. యాంకర్ సుమపై జబర్దస్త్ కమెడియన్ కామెంట్..!?suma;chanti;satya;suma;suma kanakala;geum;jabardasth;comedy;comedian;unnaoMon, 15 Feb 2021 11:00:00 GMTసుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన షోలతో, మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది సుమ. తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది యాంకర్స్ వచ్చినా కూడా సుమ తర్వాతే. ఆమెను దాటి ఎవరూ ముందుకు వెళ్లలేరు అనేది ఒప్పుకుని తీరాల్సిన సత్యం. క్లీన్ ఇమేజ్‌ తో ముందుకు వెళ్లిపోతుంది యాంకర్ సుమ. ఈమెపై ఎవరైనా ఏదైనా కామెంట్ చేయాలంటే కూడా ఒక్కక్షణం ఆలోచిస్తుంటారు. అంత మర్యాదగా.. పద్దతిగా ఉంటుంది సుమ.

ఇక తన యాంకరింగ్‌లో కూడా నవ్వుతూ.. నవ్విస్తూ దూసుకుపోతుంది ఈ సీనియర్ యాంకర్. ఇదిలా ఉంటే తాజాగా ఈమెపై ఓ జబర్దస్త్ కమెడియన్ కామెంట్ చేశాడు. అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఈ కామెంట్‌పై సుమ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. సీనియర్ యాంకర్‌ ను పట్టుకుని ఏం మాటలవి అంటూ మండిపడుతున్నారు. అంతగా అనకూడని మాట ఏమన్నాడబ్బా అనుకుంటున్నారా..? ఇది తెలియాలంటే క్యాష్ ప్రోగ్రామ్‌కు వెళ్లాల్సిందే మరి.

ఇక వచ్చే వారం ప్రోమోలో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ చలాకీ చంటి, అదిరే అభి కనిపించారు. అందులో కామెడీగా నవ్వుకుంటూనే సుమను కామెంట్ చేశాడు చంటి. వచ్చిన కంటెస్టెంట్స్‌తో అదిరిపోయే గేమ్స్ ఆడిస్తుంటుంది సుమ. అందులో భాగంగానే చంటితో కూడా గేమ్ ఆడిస్తుంది. అలా నడుస్తుండగానే ఏదో ప్రశ్నకు సమాధానంగా సుమను పట్టుకుని కత్తిలా ఉన్నావ్ అంటూ కామెంట్ చేసాడు. ఒక్కసారిగా అక్కడున్న వాళ్లే కాకుండా సుమ మొహంలో కూడా తేడా వచ్చేసింది. ఎంత కామెడీ కోసమే అయినా కూడా సుమను అలా అనడం తప్పే కదా బ్రదర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు కొందరు. ఇక మరికొందరు మాత్రం చంటిని విమర్శిస్తున్నారు. ఏదేమైనా కూడా నవ్వించడం కోసమే ఏం చేసినా కాబట్టి అంతా చల్తా అంటున్నారు ఇంకొందరు.




హిమ‌ల‌యాలు క‌ర‌గ‌కుండా క‌ట్ట‌డి... క‌శ్మీర్ ప్ర‌జ‌లు ఏం చేస్తున్నారంటే..

బిగ్ బ్రేకింగ్: ఏపీలో మరో ఎన్నికల సమరానికి షెడ్యూల్

ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ సినిమా... ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్ వ‌చ్చేసింది..!

సౌందర్య బయోపిక్ పై రష్మిక ఆకస్మిక ప్రకటన !

ఉప్పెన మీద వివాదం.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం !

మంత్రి కొడాలిని బాగానే ఇరికించారు..

ఉప్పెన కు సమస్యగా తయారైన నెట్ ఫ్లిక్స్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>