PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/steel-plant6152d527-5784-4f79-a4fa-5001f8f5c7b8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/steel-plant6152d527-5784-4f79-a4fa-5001f8f5c7b8-415x250-IndiaHerald.jpgవిశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు కేంద్రం చేసిన ప్రతిపాదనకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్న తరుణంలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఏపీ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ మాధవ్‌, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు.బ్యాంకుల విలీనం తరహాలోనే స్టీల్‌ప్లాంట్‌ విలీనం ప్రతిపాదనలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారుvizag steel plant;amit shah;venkatesh;dharmendra;vishnu;visakhapatnam;bharatiya janata party;andhra pradesh;amith shah;rbi;industries;steel plant;vishakapatnam;twitter;mla;minister;daggubati venkateswara rao;daggubati purandeswari;central governmentకేంద్ర మంత్రికి "వైజాగ్ స్టీల్" విలీన ప్రతిపాదనలను సూచించిన ఏపీ బీజేపీ నేతలు...కేంద్ర మంత్రికి "వైజాగ్ స్టీల్" విలీన ప్రతిపాదనలను సూచించిన ఏపీ బీజేపీ నేతలు...vizag steel plant;amit shah;venkatesh;dharmendra;vishnu;visakhapatnam;bharatiya janata party;andhra pradesh;amith shah;rbi;industries;steel plant;vishakapatnam;twitter;mla;minister;daggubati venkateswara rao;daggubati purandeswari;central governmentMon, 15 Feb 2021 23:00:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద పరిశ్రమగా పేరుగాంచిన విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు కేంద్రం ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్న తరుణంలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఏపీ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ మాధవ్‌, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచన చేయాలని ఈ సందర్భంగా బీజేపీ నేతలు ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందజేశారు.




అనంతరం సోము వీర్రాజు, పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఆంధ్రులు వ్యతిరేకిస్తున్నారని.. ప్రజల మనోభావాలను పరిరక్షించాల్సిన అవసరముందని కేంద్ర మంత్రికి తెలిపినట్లు సోమువీర్రాజు చెప్పారు. అలాగే ఉక్కు కర్మాగారం పరిరక్షణకు ఉన్న ప్రత్యామ్నాయ అంశాలను కేంద్ర మంత్రికి వివరించినట్లు తెలిపారు. బ్యాంకుల విలీనం తరహాలోనే స్టీల్‌ప్లాంట్‌ విలీనం ప్రతిపాదనలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు. అలాగే రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీల ఆందోళనలను కేంద్రానికి వివరించినట్లు సోము వీర్రాజు పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు ముఖ్య నేతలను కలిసి ఉక్కు కర్మాగారం విషయంలో ప్రజల మనోభావాలను వివరిస్తామని తెలిపారు.



పురందేశ్వరి మాట్లాడుతూ... విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు పలు ప్రత్యామ్నాయాలు సూచించామన్నారు. సెయిల్‌, ఎన్‌ఎండీసీలో విలీన ప్రతిపాదనలు చేశామని చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఉక్కు కర్మాగారం ఉద్యోగుల శ్రేయస్సును పరిరక్షించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు పురందేశ్వరి తెలిపారు. కాగా, విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై అన్ని వైపుల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఏపీ బీజేపీ కొత్త ప్రతిపాదన తీసుకురావడం గమనార్హం. బ్యాంకుల తరహాలో మరో కేంద్ర ప్రభుత్వ సంస్థలో విశాఖ ఉక్కు పరిశ్రమను విలీనం చేయాలని కోరారు.



" style="height: 502px;">




అఖిల్ కోసం సమంత అంత పని చేస్తోందా .... వర్కౌట్ అయితే అదుర్స్ ..... ??

దుమ్ముదులిపేస్తున్న దీపిక పిల్లి.. ఢీ 13వ యాంకర్ మిలియన్ ఫాలోవర్స్..!

మరో ఎన్నికలకు తెర తీసిన ఎస్ఈసి..!!

ఒక్క సినిమాతో సూపర్ స్టార్ డమ్ ..?

RRR కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఆలియా భట్..షాక్ లో రాజమౌళి..??

'ఉప్పెన' పై మహేష్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ .....!!

వైసీపీకి రివ‌ర్స్ షాక్‌.. మామూలు దెబ్బ కాదుగా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>