PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ginger-juic552d2537-4d96-40ac-8839-ec6998093064-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ginger-juic552d2537-4d96-40ac-8839-ec6998093064-415x250-IndiaHerald.jpgఅల్లం ఆరోగ్యాయానికి మంచి అని అందరికి తెలిసిన విషయమే. అయితే అల్లం రసాన్ని తాగడం వలన చాల ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో చూద్దామా. ఇక ఉదయం లేవగానే కొందరికి వికారంగా, వాంతికి వచ్చినట్లుగా ఉంటుంది. అలాంటి వారు పరగడుపునే అల్లం రసం తాగాలి. ఇలా రోజూ చేయడం వల్ల పైత్యం పోతుంది.ginger juic;nithya new;rasam;heart;ginger;sugar;aqua;letter;acidity;insulin;chris lynnఅల్లం రసం తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే..!?అల్లం రసం తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే..!?ginger juic;nithya new;rasam;heart;ginger;sugar;aqua;letter;acidity;insulin;chris lynnMon, 15 Feb 2021 06:00:00 GMTఆరోగ్యానికి చాలా మంచిదని అందరికి తెలిసిన విషయమే. అయితే అల్లం రసాన్ని తాగడం వలన చాల ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో చూద్దామా. ఇక ఉదయం లేవగానే కొందరికి వికారంగా, వాంతికి వచ్చినట్లుగా ఉంటుంది. అలాంటి వారు పరగడుపునే అల్లం రసం తాగాలి. ఇలా రోజూ చేయడం వల్ల పైత్యం పోతుంది. వికారం సమస్య తగ్గుతుంది. పీరియడ్స్ ప్రారంభం అయ్యే ముందు స్త్రీలు అల్లం రసం సేవిస్తుంటే రుతు సమయంలో వచ్చే నొప్పి కొంత వరకు తగ్గుతుంది.

ఇక ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పి, వాపులను తగ్గించడంలో అల్లం సమర్థవంతంగా పనిచేస్తుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 3 నుంచి 30 నెలల పాటు 56 మంది పేషెంట్లకు నిత్యం అల్లం రసం ఇచ్చి వారిలో ఉన్న ఆర్థరైటిస్ లక్షణాలను పరిశీలించగా.. కొద్ది వారాల అనంతరమే చాలా మందిలో నొప్పులు, వాపులు తగ్గినట్లు సైంటిస్టులు గుర్తించారు. అందువల్ల నిత్యం అల్లంను తీసుకుంటే ఆర్థరైటిస్ నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం పొందవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.

అయితే రక్తాన్ని పలుచగా చేయడంలోనూ అల్లం బాగా పనిచేస్తుంది. ఇది గుండెపోటు వచ్చే వారికి, వస్తుందనుకున్న వారికి ఉపయోగపడే విషయం. వారు అల్లం రసంను నిత్యం సేవిస్తే రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు నిత్యం అల్లం రసం సేవిస్తుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. దీంతో శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా గ్రహిస్తుంది. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి.

ఇక జీర్ణసమస్యలు ఉన్నవారు నిత్యం అల్లం రసం సేవిస్తే ఫలితం ఉంటుంది. అల్లం రసం మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. గ్యాస్, అసిడిటీ రాకుండా చూస్తుంది. మలబద్దకం ఉండదు. తలనొప్పి, దగ్గు, జలుబు వంటి సాధారణ అనారోగ్య సమస్యలకు కూడా అల్లం అమోఘంగా పనిచేస్తుంది. అల్లం రసం లేదా అల్లం కషాయం సేవిస్తే ఆయా సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు.


ఫిబ్ర‌వ‌రి 15వ విశిష్ఠ‌త అదే...అందుకే ఈరోజుకు అంత ప్ర‌త్యేక‌త‌..

స్టార్ హీరో అయ్యాక అబ్బాస్ పెట్రోల్ బంక్ లో ఎందుకు పని చేయాల్సి వచ్చింది

మూడు వారాల గ్యాప్ లో ... మూడు సునామీలు ....బాక్సాఫీస్ రచ్చ రచ్చే .... ??

RC15 కి మ్యూజిక్ డైరెక్టర్ అతనేనా?

హమ్మా.. మళ్లీ మెగాస్టార్ సరసన ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందిగా..

జగడ్డ: కృష్ణా జిల్లాలో రగడ దేనికి సంకేతం...?

హీరోయిన్ కాబోతున్న తెలుగు టిక్ టాక్ స్టార్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>