Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/whats-app9a6200aa-f363-4e8a-9475-63bb5201d0a3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/whats-app9a6200aa-f363-4e8a-9475-63bb5201d0a3-415x250-IndiaHerald.jpgఫేస్‌బుక్, వాట్సాప్‌లకు సుప్రీంకోర్టు భారీ షాకిచ్చింది. కొత్తగా తెచ్చిన ప్రైవసీ పాలసీపై ఫేస్ బుక్ విధానాలను తప్పు పట్టింది. వేల కోట్ల విలువైన కంపెనీ అయితే ఏంటి.. ఆ వేల కోట్లకంటే ప్రజల గోప్యతే ముఖ్యం అని తేల్చి చెప్పేసింది. ఈ మేరకు..whats app;delhi;india;kapil sibal;whatsapp;facebook;court;february;supreme court;supremeమీ దగ్గర కోట్లుంటే మాకేంటి..?.. వాట్సాప్ కు షాకిచ్చిన సుప్రీంమీ దగ్గర కోట్లుంటే మాకేంటి..?.. వాట్సాప్ కు షాకిచ్చిన సుప్రీంwhats app;delhi;india;kapil sibal;whatsapp;facebook;court;february;supreme court;supremeMon, 15 Feb 2021 21:59:03 GMT
వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీని సవాలు చేస్తూ ఇటీవల సుప్రీం కోర్టులో అనేక పిటీషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ను స్వీకారించిన సుప్రీమ్ కోర్టు సోమవారం విచారణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే సదరు పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ఫేస్ బుక్ ను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. నాలుగు వారాల్లోగా సమాధానం తెలియజేయాలని, లేకుంటే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.

వాట్సాప్ ప్రతినిధిగా కపిల్ సిబల్ కోర్టులో వాదనలు వినిపించారు. నూతన విధానం వల్ల యూజర్ల సమాచారం బయటకు పోతుందన్న వాదన నిజం కాదని చెప్పారు. ప్రైవసీపై యూరప్‌లో ప్రత్యేక చట్టం ఉందని, ఇండియా కూడా అలాంటి చట్టానే తీసుకు వస్తే దానినే అనుసరించడం జరుగుతుందని చెప్పుకొచ్చారు.


అయితే దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే.. 'మీది 2 నుంచి 3 ట్రిలియన్ డాలర్ల కంపెనీ కావచ్చు. కానీ దేశ ప్రజలకు గోప్యత అనేది అన్నింటికంటే చాలా విలువైనది. వారి గోప్యతను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది' అని ఫేస్‌బుక్, వాట్సాప్‌లకు స్పష్టం చేశారు. గోప్యత కోల్పోతామనే భయాందోళన ప్రజల్లో ఉందని ఆయన పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే గత నెల ప్రారంభంలో తాము అందిస్తున్న సేవలు, ప్రైవసీ పాలసీలో ఫేస్‌బుక్‌ సొంత యాప్ వాట్సాప్ మార్పులు చేసింది. ఫిబ్రవరి 8 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని పేర్కొంది. అయితే, దీనిపై భారత్ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత  రావడంతో ఆ గడవును మే 15 వరకూ పొడిగించింది.




జె డి చక్రవర్తి భార్య సైతం స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా..?

మరో ఎన్నికలకు తెర తీసిన ఎస్ఈసి..!!

ఒక్క సినిమాతో సూపర్ స్టార్ డమ్ ..?

RRR కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఆలియా భట్..షాక్ లో రాజమౌళి..??

'ఉప్పెన' పై మహేష్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ .....!!

వైసీపీకి రివ‌ర్స్ షాక్‌.. మామూలు దెబ్బ కాదుగా...!

డప్పు కొడుతున్న అనసూయ.. కుర్రాళ్ల గుండెల్లో నిప్పు రాజేస్తుంది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>