LifeStyleGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/valentines-day-rare-gift965fa5f4-35e7-4fbc-bede-aec493da15d6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/valentines-day-rare-gift965fa5f4-35e7-4fbc-bede-aec493da15d6-415x250-IndiaHerald.jpgప్రేమికుల రోజు అంటే ప్రేయసీ ప్రియులిద్దరూ ఒకరికొకరు బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటుంటారు. చాక్లెట్ల నుంచి మొదలు పెడితే.. కాస్ట్ లీ కార్లు, అపార్ట్ మెంట్ ల వరకు అన్నీ ఈ లిస్ట్ లో ఉంటాయి. మొబైల్ హవా బాగా నడుస్తున్న ఈ రోజుల్లో బంగారు నగలకంటే మొబైల్ ఫోన్లే ఎక్కువగా బహుమతుల రూపంలో చేతులు మారాయి. అయితే ఈ ఏడాది ఓ యువకుడు తనకు కాబోయే భార్యకు ఓ అరుదైన బహుమతి ఇచ్చాడు. ఆ బహుమతి ఏంటో తెలిస్తే అందరూ షాకవ్వాల్సిందే. valentines day rare gift;shahrukh khan;hyderabad;indore;marriage;husband;wife;prize;gift;dubai;ee rojullo;nayak;manadesam;sharukh khanప్రేమికుల రోజు అత్యంత అరుదైన గిఫ్ట్ ఇదే..ప్రేమికుల రోజు అత్యంత అరుదైన గిఫ్ట్ ఇదే..valentines day rare gift;shahrukh khan;hyderabad;indore;marriage;husband;wife;prize;gift;dubai;ee rojullo;nayak;manadesam;sharukh khanMon, 15 Feb 2021 11:00:00 GMTఈ రోజుల్లో బంగారు నగలకంటే మొబైల్ ఫోన్లే ఎక్కువగా బహుమతుల రూపంలో చేతులు మారాయి. అయితే ఈ ఏడాది ఓ యువకుడు తనకు కాబోయే భార్యకు ఓ అరుదైన బహుమతి ఇచ్చాడు. ఆ బహుమతి ఏంటో తెలిస్తే అందరూ షాకవ్వాల్సిందే.

ప్రేమికుల రోజు సందర్భంగా తనకు కాబోయే భార్య కోసం ఏకంగా చంద్రుడిపై భూమి కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చాడు ఓ యువకుడు. ఇండోర్ ‌కు చెందిన పలాష్‌ నాయక్ అనే యువకుడు చంద్రుడిపై ఎకరా భూము కొనుగోలు చేసి దానికి సంబంధించిన ధృవపత్రాలను కాబోయే భార్యకు గిఫ్ట్ గా ఇచ్చాడు. దీంతో ఆమె ఎగిరి గంతేసింది. ప్రపంచంలో అందరికంటే.. అరుదైన గిఫ్ట్ తనకు కాబోయే భర్త ఇచ్చాడని సంబరపడిపోతోంది.

కేవలం చంద్రుడిపై భూమి కొని బహుమతిగా ఇవ్వడమే కాదు, ఓ నక్షత్రానికి కూడా తనకు కాబోయే భార్య పేరు పెట్టేలా ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పలాష్‌ ప్రస్తుతం దుబాయ్ ‌లో ఉంటున్నాడు. అక్కడ ఫ్రీ లాంచింగ్‌ లో విధులు నిర్వర్తిస్తున్న పలాష్.. హైదరాబాద్ లో ఓ యువతిని వివాహం చేసుకోబోతున్నాాడు. అతని కాబోయే భార్య ప్రస్తుతం హైదరాబాద్ ‌లోనే ఉంటోంది. తనకు కాబోయే భార్యకు ఏదైనా కొత్తగా అందించాలని కోరుకుంటున్న పలాష్.. చంద్రుడిపై భూమి కొనేందుకు నిర్ణయించుకున్నానని తెలిపాడు. చంద్రునిపై ఒక ఎకరం భూమిని కలిగి ఉన్నట్లు సర్టిఫికెట్ కూడా పొందాడు. మనదేశంలో అతి కొద్ది మంది మాత్రమే ఇలా చంద్రుడి మీద భూమిని సొంతం చేసుకున్నారు. వీరిలో బాలీవుడ్‌ నటులు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్, షారుఖ్ ఖాన్ తదితరులున్నారు. ఈ లిస్ట్ లో ఇప్పుడు పలాష్ నాయక్ కూడా చేరాడు. కాబోయే భార్యకు అంత అరుదైన గిఫ్ట్ ఇచ్చిన పలాష్.. పెళ్లి తర్వాత వచ్చే ఏడాది ప్రేమికులరోజుకి ఇంకెంత వెరైటీ గిఫ్ట్ ఇస్తాడో అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.


బిగ్ బ్రేకింగ్: ఏపీలో మరో ఎన్నికల సమరానికి షెడ్యూల్

మంత్రి కొడాలిని బాగానే ఇరికించారు..

ఉప్పెన కు సమస్యగా తయారైన నెట్ ఫ్లిక్స్ !

జగడ్డ : నిమ్మగడ్డా.. ప్లీజ్‌.. అది కూడా కానిచ్చేయండీ..!

జగడ్డ: బాబు దెబ్బకి వైసీపీలో వణుకు..

జగడ్డ: ఉన్న కాస్త పరువూ పోగొట్టుకుంటున్న చంద్రబాబు..!?

ఏంటీ.. పవన్ కళ్యాణ్ ను.. ఆ హీరోయిన్ ప్రేమిస్తుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>