PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections521648f3-3bb3-4b5f-baea-35ed1628da8f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections521648f3-3bb3-4b5f-baea-35ed1628da8f-415x250-IndiaHerald.jpgఏపీ పంచాయతీ ఎన్నికల విషయంలో అధికార వైసిపి ఏకగ్రీవ రాగం అందుకుంది. వీలైనన్ని ఎక్కువ ఏకగ్రీవాలు చేయించుకుని ప్రజలు తమ వైపే ఉన్నారని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి నుంచి మంత్రులకు, మంత్రుల నుంచి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేల నుంచి లోకల్ లీడర్లకు ఆదేశాలు అందాయి. ఇక జగన్ ఆదేశాలను బాగా సీరియస్ గా తీసుకున్న నేతలు ఎవరైనా ఉన్నారంటే ముందు వరుసలో వినపడే పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈయన ఈ అంశాలను చాలా సీరియస్ గా తీసుకున్నారు. స్వతహాగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి కావడంతో వీలైనన్ని ఎక్jagan elections nimmagadda;kumaar;raaga;korcha;jagan;andhra pradesh;district;peddireddy ramachandra reddy;government;police;panchayati;court;chief minister;minister;governor;tdp;local language;ycp;punganur;party;mantraజగడ్డ : పుంగనూరు పంచాయతీ లెక్కలు తేలుస్తారా ? అంతా ఒట్టిదేనా ?జగడ్డ : పుంగనూరు పంచాయతీ లెక్కలు తేలుస్తారా ? అంతా ఒట్టిదేనా ?jagan elections nimmagadda;kumaar;raaga;korcha;jagan;andhra pradesh;district;peddireddy ramachandra reddy;government;police;panchayati;court;chief minister;minister;governor;tdp;local language;ycp;punganur;party;mantraMon, 15 Feb 2021 16:00:00 GMTఏపీ పంచాయతీ ఎన్నికల విషయంలో అధికార వైసిపి ఏకగ్రీవ రాగం అందుకుంది. వీలైనన్ని ఎక్కువ ఏకగ్రీవాలు చేయించుకుని ప్రజలు తమ వైపే ఉన్నారని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి నుంచి మంత్రులకు, మంత్రుల నుంచి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేల నుంచి లోకల్ లీడర్లకు ఆదేశాలు అందాయి. ఇక జగన్ ఆదేశాలను బాగా సీరియస్ గా తీసుకున్న నేతలు ఎవరైనా ఉన్నారంటే ముందు వరుసలో వినపడే పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈయన ఈ అంశాలను చాలా సీరియస్ గా తీసుకున్నారు. స్వతహాగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి కావడంతో వీలైనన్ని ఎక్కువ పంచాయతీలను తమ పార్టీ తరపున ఏకగ్రీవాలు చేయించుకునే బాధ్యతలు తీసుకున్నారు. అందుకే మెజారిటీ పంచాయతీలు ఏకగ్రీవం చేస్తున్నారు..నిజానికి పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాలు సర్వసాధారణం గ్రామ అభివృద్ధి పేరిట గ్రామస్తులు కూర్చుని చర్చించుకుని పార్టీలకతీతంగా వ్యక్తులను ఎన్నుకుంటారు.

 కానీ నియోజకవర్గం మొత్తం పరిస్థితి అలానే ఉంటే అవి బలవంతపు ఏకగ్రీవాలు కాక మరేంటి అంటూ టిడిపి కోర్టుకు వెళ్లింది. ఈ సంగతంతా పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన విషయం. హైకోర్టు ఈ అంశం మీద చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పుంగనూరులో పర్యటిస్తానని వెళ్లారు. కానీ అక్కడ ఆయనకు పోలీసుల నుంచి అభ్యంతరం ఎదురు కావడం ఆశ్చర్య కరంగా మారింది. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో మూడో విడతలో మొత్తం 85 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ఈ అన్ని పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇదే ఇప్పుడు అధికార పార్టీకి కూడా తలనొప్పిగా మారింది..అసలు ఈ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను పోటీకి దిగే అవకాశం కూడా లేకుండా రకరకాల ఒత్తిడులకు గురి చేసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రతిపక్ష టిడిపి ఆరోపిస్తోంది.

ఈ మొత్తం బంతి ఇప్పుడు ఎన్నికల సంఘం కోర్టులో ఉంది. బలవంతపు ఏకగ్రీవాలు అనుకుంటే ఇప్పటి కిప్పుడు ఆ ఏకగ్రీవాలు అన్నిటినీ రద్దు చేసే హక్కులు అధికారాలు కూడా ఎన్నికల సంఘానికి ఉన్నాయి. అయితే ప్రభుత్వంతో నిమ్మగడ్డ రాజీకి వచ్చాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ అంశం మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా లేక నోటీసులు ఇచ్చి వివరణ కోరి ఊరుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా మొదటి నుంచి బలవంతంగా ఏకగ్రీవాలకు తాను వ్యతిరేకమని చెబుతూ వస్తున్నారు. అందుకు తగ్గట్టే గతంలో అత్యధికంగా ఏకగ్రీవాలు అయిన గుంటూరు చిత్తూరు జిల్లాలకు సంబంధించిన ఏకగ్రీవాలను కొన్ని రోజులపాటు హోల్డ్ లో ఉంచారు. అయితే గవర్నర్ తో భేటీ అనంతరం వీటిని రిలీజ్ చేయడంతో ఆయన ప్రభుత్వంలో రాజీకి వచ్చారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. మరి ఈ అంశంలో ఏం జరుగుతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. అదీ కాక ఆయన పర్యటనకు పోలీసులు సహకరిస్తారా ?  లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. 


ఎంతైనా ఆయన కొడుకు కదా .... రియల్ హీరోయిజం వాళ్ళ బ్లడ్ లోనే ఉంది ....??

వైష్ణవ్ తేజ్ హిట్.. అఖిల్ కు తలనొప్పిగా మారిందా..?

ఉప్పెన 3 డేస్ లోనే ప్రాఫిట్స్.. మెగా హీరో మొదటి సినిమానే రికార్డ్..!

స‌జ్జ‌ల వారి దౌత్యం కుద‌ర‌లేదు.. ఎమ్మెల్యే వ‌ర్సెస్ కీల‌క నేత ర‌గ‌డ ?

ర‌వి రాజ‌కీయం.. టీడీపీకి కొత్త ఉద‌యం..!

అఖిల్.. మోనాల్.. బిగ్ బాస్ కపుల్ క్రేజీ వెబ్ సీరీస్..!

జగడ్డ : ఉక్కే అని ఊరుకుంటే లెక్క తేల్చేస్తుందా.. ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>