PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/asad-ayodhyaf62d3c89-b949-4d48-9154-43c2fa9f3dff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/asad-ayodhyaf62d3c89-b949-4d48-9154-43c2fa9f3dff-415x250-IndiaHerald.jpgతాజాగా హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కానున్నదంటూ మజ్లిస్ పార్టీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఇక హైదరాబాద్‌తో పాటుగా.. చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ లాంటి మెట్రో నగరాలను కూడా కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తారని అసద్ వ్యాఖ్యానించడం విశేషం. అయితే ఇటీవలే జమ్మూ కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది అంతటితో ఆగిపోదని.. ఇది ఆరంభం మాత్రమేనంటూ ఓవైసీ సెక్యులర్ పార్టీలను హెచ్చరించారు.asaduddin owaisi;ali;manu;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;ahmedabad;telangana;narendra modi;g kishan reddy;congress;capital;minister;chennai;central government;reddy;partyకేంద్ర పాలిత ప్రాంతంగా మారనున్న హైదరాబాద్... మరో మూడు నగరాలు కూడా అదే బాటలో!కేంద్ర పాలిత ప్రాంతంగా మారనున్న హైదరాబాద్... మరో మూడు నగరాలు కూడా అదే బాటలో!asaduddin owaisi;ali;manu;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;ahmedabad;telangana;narendra modi;g kishan reddy;congress;capital;minister;chennai;central government;reddy;partyMon, 15 Feb 2021 18:30:00 GMTతెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కాకముందు నుండి రాజధాని హైదరాబాద్ ని కేంద్ర ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతం చేయనున్నారంటూ పలు రకాల వ్యాఖ్యలు షికారు చేసిన సంగతి తెలిసిందే.. అయితే మరోసారి తాజాగా హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కానున్నదంటూ మజ్లిస్ పార్టీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఇక హైదరాబాద్‌తో పాటుగా.. చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ లాంటి మెట్రో నగరాలను కూడా కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తారని అసద్ వ్యాఖ్యానించడం విశేషం. అయితే ఇటీవలే జమ్మూ కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది అంతటితో ఆగిపోదని.. ఇది ఆరంభం మాత్రమేనంటూ ఓవైసీ సెక్యులర్ పార్టీలను హెచ్చరించారు.



అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కొట్టిపారేశారు. హైదరాబాద్‌ను యూటీగా మార్చే యోచన కేంద్రానికి లేదన్నారు. హైదరాబాద్ ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించేలా టీఆర్ఎస్, ఎంఐఎం ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కాగా బీజేపీ ఆలోచననే ఓవైసీ బయటకు చెప్పారంటూ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపించారు. హైదరాబాద్ లేకపోతే తెలంగాణ ఆదాయాన్ని కోల్పోతుందన్నారు. ఈ కారణంతోనే హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను యూపీఏ సర్కారు రాష్ట్రంగా ఏర్పాటు చేసిందన్నారు. హైదరాబాద్‌ను యూటీ చేస్తే ఊరుకునేది లేదన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తారని ప్రచారం జరగడం ఇదే తొలిసారి కాదు. రాష్ట్ర విభజనకు ముందు ఈ ప్రచారం జరిగింది. తెలంగాణ వచ్చాక కూడా భాగ్యనగరాన్ని మోదీ సర్కారు యూటీ చేస్తుందనే టాక్ వినిపించింది. తెలంగాణలో బలపడాలని బీజేపీ భావిస్తోన్న వేళ.. హైదరాబాద్‌ను యూటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతుండటం గమనార్హం. రాష్ట్రంలో పాగా వేయాలని భావిస్తోన్న కాషాయ పార్టీకి.. భాగ్యనగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం వల్ల రాజకీయంగా నష్టం వాటిల్లడమే తప్పితే ఒరిగేది ఏముండదు. బంగారు బాతుల్లాంటి నగరాలను వదులుకొని ఆయా రాష్ట్రాలు మనుగడ సాగించలేవనే సంగతి తెలిసిందే.




జగడ్డ : విశాఖ ఏజెన్సీలో పంచాయతీ... మూడెదెవరికి...?

మరో ఎన్నికలకు తెర తీసిన ఎస్ఈసి..!!

ఒక్క సినిమాతో సూపర్ స్టార్ డమ్ ..?

RRR కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఆలియా భట్..షాక్ లో రాజమౌళి..??

'ఉప్పెన' పై మహేష్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ .....!!

వైసీపీకి రివ‌ర్స్ షాక్‌.. మామూలు దెబ్బ కాదుగా...!

డప్పు కొడుతున్న అనసూయ.. కుర్రాళ్ల గుండెల్లో నిప్పు రాజేస్తుంది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>