CrimeGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/failure-love-storye677b7ad-3d02-46f9-be87-e31c57d07e31-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/failure-love-storye677b7ad-3d02-46f9-be87-e31c57d07e31-415x250-IndiaHerald.jpgప్రేమికుల రోజు అన్ని జంటలూ సంబరాల్లో మునిగితేలితే ఓ జంట మాత్రం క్షణికావేశంలో తప్పుడు నిర్ణయం తీసుకుంది. పెద్దల్ని ఎదిరించలేక ప్రేమ చచ్చిపోయింది. అబ్బాయి సంగతి ఎలాఉందో ఎవరికీ తెలియదు కానీ, అమ్మాయి మాత్రం ప్రియుడు, కుటుంబ సభ్యుల మధ్య నలిగిపోయి ఉరేసుకుని చనిపోయింది. ఈ దుర్ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మోకిలా తండాలో జరిగింది. failure love story;prema;shankar;maharashtra - mumbai;district;police;january;marriage;bengaluru 1;love;maharashtra;girl;letter;traffic police;ranga reddy;premikula rojuప్రేమికుల రోజు విషాదాంతమైన ప్రేమకథ..ప్రేమికుల రోజు విషాదాంతమైన ప్రేమకథ..failure love story;prema;shankar;maharashtra - mumbai;district;police;january;marriage;bengaluru 1;love;maharashtra;girl;letter;traffic police;ranga reddy;premikula rojuMon, 15 Feb 2021 09:00:00 GMTప్రేమికుల రోజు అన్ని జంటలూ సంబరాల్లో మునిగితేలితే ఓ జంట మాత్రం క్షణికావేశంలో తప్పుడు నిర్ణయం తీసుకుంది. పెద్దల్ని ఎదిరించలేక ప్రేమ చచ్చిపోయింది. అబ్బాయి సంగతి ఎలాఉందో ఎవరికీ తెలియదు కానీ, అమ్మాయి మాత్రం ప్రియుడు, కుటుంబ సభ్యుల మధ్య నలిగిపోయి ఉరేసుకుని చనిపోయింది. ఈ దుర్ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మోకిలా తండాలో జరిగింది.

వారిద్దరిదీ ఫేస్ బుక్ పరిచయం. అది కాస్తా ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. అమ్మాయి పేరు అనూష. వయసు 19 సంవత్సరాలు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మోకిలా తండా నివాసి. అబ్బాయి మహారాష్ట్రకు చెందినవాడు వయసు 27 సంవత్సరాలు. ఫేస్ బుక్ పరిచయంతో ప్రేమించుకున్న వీరిద్దరూ పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు.  వన్ ఫైన్ మార్నింగ్ అమ్మాయిని మహారాష్ట్రకు వచ్చేయమని చెప్పాడు ఆ ప్రబుద్ధుడు. దీంతో అనూష మహారాష్ట్ర ప్రయాణం కట్టింది. జనవరి 19న తాను బెంగళూరుకు వెళ్తున్నానని చెప్పి అనూష ఇంట్లోనుంచి వెళ్లింది. అప్పటి నుంచి ఆమె ఫోన్‌ స్విచ్ఛాప్‌ రావడంతో తల్లిదండ్రులు శంకర్‌ పల్లి పోలీస్ ‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాల్‌డేటా సాయంతో యువతి ఆచూకీ తెలుసుకున్న పోలీసులు, అనూషను ఎలాగోలా ఇంటికి రప్పించారు. దాదాపు నెలరోజుల తర్వాత ఈనెల 13న అనూష శంకర్ పల్లికి చేరుకుంది.



అయితే ఇంటికి వచ్చిన తర్వాత తన ప్రేమ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు వివరించింది. పెళ్లంటూ చేసుకుంటే తన ఫేస్ బుక్ ప్రియుడినే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పేసింది. అయితే తల్లిదండ్రులు ఆమెను వారించారు. కుదరదని చెప్పేశారు, ఓ దశలో తీవ్రంగా మందలించారని తెలుస్తోంది. దీంతో అనూషకు ఏం చేయాలో పాలుపోలేదు. అటు ప్రియుడు ప్రపోజల్ ఒప్పుకోలేక, ఇటు తల్లిదండ్రుల ఆవేదన చూడలేక, తనువు చాలించింది. సరిగ్గా ప్రేమికుల రోజునే వారి ప్రేమకథకు విషాదాంత ముగింపునిచ్చింది. ఆదివారం ఉదయం స్నానానికంటూ బాత్‌ రూంలోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సరిగ్గా ప్రేమికుల రోజున జరిగిన ఈ దుర్ఘటన అందరినీ కలచివేసింది. 


ఖమ్మం జిల్లాలో కొత్త వైరస్

మంత్రి కొడాలిని బాగానే ఇరికించారు..

ఉప్పెన కు సమస్యగా తయారైన నెట్ ఫ్లిక్స్ !

జగడ్డ : నిమ్మగడ్డా.. ప్లీజ్‌.. అది కూడా కానిచ్చేయండీ..!

జగడ్డ: బాబు దెబ్బకి వైసీపీలో వణుకు..

జగడ్డ: ఉన్న కాస్త పరువూ పోగొట్టుకుంటున్న చంద్రబాబు..!?

ఏంటీ.. పవన్ కళ్యాణ్ ను.. ఆ హీరోయిన్ ప్రేమిస్తుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>