PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/minister-kodali-nani-case-in-courta7123f2d-b093-4fd9-bc43-86c68fd9e843-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/minister-kodali-nani-case-in-courta7123f2d-b093-4fd9-bc43-86c68fd9e843-415x250-IndiaHerald.jpgరాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తీవ్రంగా విమర్శించిన వారి జాబితాలో మంత్రి కొడాలి నాని పేరు ముందు వరుసలో ఉంటుందనే విషయాన్ని ఎవరూ తోసిపుచ్చలేరు. చంద్రబాబు ఏజెంట్ అనే కాదు, ఇంకా చాలా చాలా మాటలే అన్నారు నిమ్మగడ్డని. అయితే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత మాత్రం కొడాలి పెద్దగా స్పందించలేదు. దీంతో అసలు సమస్యే రాలేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శల డోసు కాస్త ఎక్కువ కాగనే ఎస్ఈసీ ఆయనపై ఆంక్షలు విధించడం, ఆ తర్వాత కోర్టు ద్వారా వాటిని సడలించుకోవడం తెలిసిందే. అయితే తాజాగా నnimmagadda vs kodali nani;nani;kumaar;kodali nani;peddireddy ramachandra reddy;police;media;panchayati;court;petitioner;minister;ycpమంత్రి కొడాలిని బాగానే ఇరికించారు..మంత్రి కొడాలిని బాగానే ఇరికించారు..nimmagadda vs kodali nani;nani;kumaar;kodali nani;peddireddy ramachandra reddy;police;media;panchayati;court;petitioner;minister;ycpMon, 15 Feb 2021 08:00:00 GMTకుమార్ ని తీవ్రంగా విమర్శించిన వారి జాబితాలో మంత్రి కొడాలి నాని పేరు ముందు వరుసలో ఉంటుందనే విషయాన్ని ఎవరూ తోసిపుచ్చలేరు. చంద్రబాబు ఏజెంట్ అనే కాదు, ఇంకా చాలా చాలా మాటలే అన్నారు నిమ్మగడ్డని. అయితే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత మాత్రం కొడాలి పెద్దగా స్పందించలేదు. దీంతో అసలు సమస్యే రాలేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శల డోసు కాస్త ఎక్కువ కాగనే ఎస్ఈసీ ఆయనపై ఆంక్షలు విధించడం, ఆ తర్వాత కోర్టు ద్వారా వాటిని సడలించుకోవడం తెలిసిందే. అయితే తాజాగా నిమ్మగడ్డపై మంత్రి కొడాలి చేసిన వ్యాఖ్యలు మళ్లీ సంచలనంగా మారాయి.

ఏకంగా కొడాలిపై కేసు పెట్టండి అంటూ ఎస్ఈసీ పోలీసులకు ఆదేశాలివ్వడం, మీడియాతోనే కాదు, సమావేశాల్లో కూడా మాట్లాడొద్దంటూ కండిషన్ పెట్టడంతో మేటర్ మరింత సీరియస్ గా మారింది. యథావిధిగానే ఈ కండిషన్లు తీసేయాలంటూ మంత్రి కోర్టుకెక్కారు. అయితే అక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. తాను వివరణ ఇచ్చనా, ఎస్ఈసీ తనపై ఆంక్షలు విధించారని, అసలు తనకు వివరణ ఇవ్వడానికి కనీసం కొన్ని గంటలైనా సమయం ఇవ్వలేదనేది మంత్రి వాదన. అయితే ఎస్ఈసీ మాత్రం మంత్రిని బాగానే ఇరికించారు. కొడిలి వ్యాఖ్యలను కోర్టు కచ్చితంగా వినాలని, రాతపూర్వకంగానూ, వీడియో ఫుటేజీ రూపంలోనూ వాటిని విన్న తర్వాతే తీర్పునివ్వాలని ఎస్ఈసీ తరపు లాయర్లు వాదించారు.

వాస్తవానికి గతంతో పోల్చి చూస్తే ఎస్ఈసీపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఏమంత పెద్దవి కావు. కానీ విషయం మరింత వివాదం అయింది కాబట్టి.. ఈ వ్యాఖ్యలు మరింత ఇబ్బంది పెడతాయని తెలుస్తోంది. అటు న్యాయస్థానం కూడా మీడియా సమావేశంలో పిటిషనర్‌ మాట్లాడిన వీడియో ఫుటేజ్‌, అందులోని అంశాలను రాతపూర్వకంగా కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. దీంతో కొడాలి కోటరీలో టెన్షన్ మొదలైంది. వీడియో ఫుటేజీని పరిశీలిస్తే కోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరుస్తుందోనని ఆందోళన చెందుతున్నారు వైసీపీ నేతలు. మంత్రి పెద్దిరెడ్డి వ్యవహారంలో విషయం వీడియో ఫుటేజీ వరకు వెళ్లలేదు. ఇప్పుడు కోర్టు కొడాలి నాని వీడియో ఫుటేజీని పరిశీలించే అవకాశం ఉంది. ఈరోజు ఈ వ్యవహారంలో తీర్పు రావాల్సి ఉంది. 


శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త.. టీటీడీ బోర్డు కీలక నిర్ణయం..?

ఉప్పెన కు సమస్యగా తయారైన నెట్ ఫ్లిక్స్ !

జగడ్డ : నిమ్మగడ్డా.. ప్లీజ్‌.. అది కూడా కానిచ్చేయండీ..!

జగడ్డ: బాబు దెబ్బకి వైసీపీలో వణుకు..

జగడ్డ: ఉన్న కాస్త పరువూ పోగొట్టుకుంటున్న చంద్రబాబు..!?

ఏంటీ.. పవన్ కళ్యాణ్ ను.. ఆ హీరోయిన్ ప్రేమిస్తుందా..?

స్టార్ హీరో అయ్యాక అబ్బాస్ పెట్రోల్ బంక్ లో ఎందుకు పని చేయాల్సి వచ్చింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>