PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/telangana-governor-shocking-comments-on-kcr79e55581-9c53-4f7b-befa-02fdb8823167-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/telangana-governor-shocking-comments-on-kcr79e55581-9c53-4f7b-befa-02fdb8823167-415x250-IndiaHerald.jpgతెలంగాణ గవర్నర్ ఇప్పుడు రాజకీయాల మీద ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఆమె ఈ నెల చివర్లో కచ్చితంగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఆమె కూడా దీనిపై స్పష్టత ఇచ్చేసారు. గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్టు ఆమె ప్రకటన చేశారు. దీనిపై టిఆర్ఎస్ పార్టీ వర్గాలు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకు ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినా గిరిజన ప్రాంతాల్లో పోడు భూముల వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందినgovernor;raj;bharatiya janata party;maharashtra - mumbai;telangana;cm;governor;maharashtra;central government;partyప్రజల్లోకి గవర్నర్... సీఎంకు ఊహించని షాక్ప్రజల్లోకి గవర్నర్... సీఎంకు ఊహించని షాక్governor;raj;bharatiya janata party;maharashtra - mumbai;telangana;cm;governor;maharashtra;central government;partyMon, 15 Feb 2021 07:00:00 GMTతెలంగాణ గవర్నర్ ఇప్పుడు రాజకీయాల మీద ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఆమె ఈ నెల చివర్లో కచ్చితంగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఆమె కూడా దీనిపై స్పష్టత ఇచ్చేసారు. గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్టు ఆమె ప్రకటన చేశారు. దీనిపై టిఆర్ఎస్ పార్టీ వర్గాలు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకు ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినా గిరిజన ప్రాంతాల్లో పోడు భూముల వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. 

ఈ భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కొంతమంది నేతలు ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గిరిజనులను తరిమికొట్టడానికి ఈ మధ్య కాలంలో మహారాష్ట్ర నుంచి కూడా పులులను తెప్పించి అడవిలో వదిలి పెట్టారు అని ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వచ్చిన పులులకు సంబంధించి కూడా ఆమె ఆరా తీస్తున్నారు. తెలంగాణ గవర్నర్ ప్రజల్లోకి వెళ్లి దీని మీద కూడా అడిగే అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా ఉమ్మడి జిల్లాల పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

దీనికి సంబంధించి త్వరలోనే ఒక షెడ్యూల్ ని కూడా రాజ్ భవన్ వర్గాలు విడుదల చేసే అవకాశాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే ఈ పర్యటన వెనుక రాజకీయ ఉద్దేశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. తెలంగాణలో వాస్తవ పరిస్థితులను వివరించే విషయంలో రాష్ట్ర పార్టీ నేతలు ఘోరంగా విఫలం కావడంతో ఆమెకు బాధ్యతలు అప్పగించింది కేంద్ర నాయకత్వం అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందుకే ఆమె రంగంలోకి దిగారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఆమెకున్న విషయపరిజ్ఞానం రాష్ట్ర బిజెపి నేతలకు పెద్దగా ఎవరికీ లేదు. ఇప్పుడు ఆమె ప్రజల్లోకి వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయని అంచనా వేస్తుంది బీజేపీ అధిష్టానం.



శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త.. టీటీడీ బోర్డు కీలక నిర్ణయం..?

మంత్రి కొడాలిని బాగానే ఇరికించారు..

ఉప్పెన కు సమస్యగా తయారైన నెట్ ఫ్లిక్స్ !

జగడ్డ : నిమ్మగడ్డా.. ప్లీజ్‌.. అది కూడా కానిచ్చేయండీ..!

జగడ్డ: బాబు దెబ్బకి వైసీపీలో వణుకు..

జగడ్డ: ఉన్న కాస్త పరువూ పోగొట్టుకుంటున్న చంద్రబాబు..!?

ఏంటీ.. పవన్ కళ్యాణ్ ను.. ఆ హీరోయిన్ ప్రేమిస్తుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>