PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/////images/politics/politics_latestnews/modi-shah-now-you-are-weak-get-equipped-for-indo-china-war-1144cb23-e1b7-4c8d-a452-f619d0cd38c0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/////images/politics/politics_latestnews/modi-shah-now-you-are-weak-get-equipped-for-indo-china-war-1144cb23-e1b7-4c8d-a452-f619d0cd38c0-415x250-IndiaHerald.jpgశ్రీలంక, నేపాల్‌లో బీజేపీ విస్తరణ కార్యక్రమాన్ని మన సీఎం విప్లవ్ కుమార్ దేవ్ ‘ఆత్మనిర్భర్ సౌత్ ఏసియా’గా అభివర్ణించారు. బీజేపీ విదేశాల్లోనూ అధికారంలోకి వస్తుందని.. ఇందుకు గాను కేంద్ర హోం మంత్రి, బీజేపీ మాజీ చీఫ్ అమిత్‌ షా ఇప్పటికే తగిన వ్యూహ రచన చేశారని ఆయన చెప్పారు.modi amit;view;amit shah;kumaar;rachana;tiru;kerala;bharatiya janata party;india;pakistan;bangladesh;korea, south;nepal;bhutan;sri lanka;narendra modi;2019;capital;prime minister;chief minister;minister;central government;party;narendraమోదీ, అమిత్ షాల లక్ష్యం "ఆత్మ నిర్భర సౌత్ ఏషియా" - త్రిపుర సీఎం విప్లవ్మోదీ, అమిత్ షాల లక్ష్యం "ఆత్మ నిర్భర సౌత్ ఏషియా" - త్రిపుర సీఎం విప్లవ్modi amit;view;amit shah;kumaar;rachana;tiru;kerala;bharatiya janata party;india;pakistan;bangladesh;korea, south;nepal;bhutan;sri lanka;narendra modi;2019;capital;prime minister;chief minister;minister;central government;party;narendraMon, 15 Feb 2021 22:40:00 GMT2014 సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యతతో కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ..... 2019 సార్వత్రిక ఎన్నికల సమయానికి క్రమంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సత్తా చాటింది. దేశవ్యాప్తంగా ఇక ఇప్పటికే అత్యధిక రాష్ట్రాల్లో దక్షిణాది మినహా మిగిలిన మెజార్టీ రాష్ట్రాల్లో జయకేతనం ఎగరేసి ప్రతిపక్షాలకు కోలుకోలేని రీతిలో దెబ్బ వేసింది.  అయితే ఇటీవలే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం కర్ణాటకలోనూ తిరిగి అధికారం దక్కించుకొని దక్షిణాదిలో కూడా తన సత్తాను చాటుకుంది. ఇక కేరళలోనూ కూడా తమదే అధికారమని ధీమాగా చెబుతోంది. ఇలా దేశం మొత్తం తమ వశం చేసుకున్నాక బీజేపీ నెక్ట్స్ టార్గెట్ ఏంటనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది. అయితే మోదీ, అమిత్ షాల తరువాత లక్ష్యం.. శ్రీలంక, నేపాల్ అని వచ్చిన వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అయితే ఈ వార్త ఎలా వచ్చిందంటే... త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ దేవ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలకు పెట్టింది పేరు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ విదేశాల్లోనూ అధికారంలోకి వస్తుందని.. ఇందుకు గాను కేంద్ర హోం మంత్రి, బీజేపీ మాజీ చీఫ్ అమిత్‌ షా ఇప్పటికే తగిన వ్యూహ రచన చేశారని ఆయన చెప్పారు.




‘‘అమిత్‌ షా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఒకసారి మన రాష్ట్రానికి అతిథిగా వచ్చారు. ఆ సమయంలో మనలో ఒకరు.. నాకు తెలిసి అజయ్‌ జమ్‌వాల్‌ (ఈశాన్య జోనల్‌ బీజేపీ సెక్రటరీ) అనుకుంటా.. ఆయనతో ‘ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అందుకు అభినందనలు తెలుపుతున్నా’ అన్నారు. అందుకు అమిత్‌ షా బదులిస్తూ ‘శ్రీలంక, నేపాల్‌ మిగిలి ఉన్నాయి. పార్టీని అక్కడ కూడా విస్తరించి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి’ అన్నారు’’ అంటూ సీఎం విప్లవ్‌ కుమార్ దేవ్‌ చెప్పుకొచ్చారు. త్రిపుర రాజధాని అగర్తలాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. విప్లవ్‌ దేవ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తమ రాష్ట్రానికి చేసిన కేటాయింపులకు గాను ధన్యవాదాలు తెలపడానికి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 




శ్రీలంక, నేపాల్‌లో బీజేపీ విస్తరణ కార్యక్రమాన్ని మన సీఎం విప్లవ్ కుమార్ దేవ్ ‘ఆత్మనిర్భర్ సౌత్ ఏసియా’గా అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ గత కొంతకాలంగా ‘ఆత్మనిర్భర భారత్’ పదాన్ని వినిపిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ అన్ని రంగాల్లో స్వయం సంవృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ప్రధాని దాని గురించి ప్రస్తావిస్తున్నారు. త్రిపుర ముఖ్యమంత్రి దాన్ని మరో శిఖరానికి తీసుకెళ్లి, దక్షిణాసియా దేశాల వరకు విస్తరించారన్నమాట. అందుకు తగిన వివరణ కూడా ఇచ్చారు. ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్ (అందరికీ అభివృద్ధి ఫలాలు) నినాదంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తోంది. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన పాలసీలు, బడ్జెట్.. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ దేశాలకు కూడా ప్రయోజనం చేకూర్చేవిధంగా ఉన్నాయి. అసలు 2014లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే మోదీ చేసిన పనేంటో తెలుసా.. సార్క్ దేశాధ్యక్షులందరినీ ఆహ్వానించి సమావేశమయ్యారు. వీరిలో పాకిస్థాన్ అధ్యక్షుడు కూడా ఉన్నారు’ అని సీఎం విప్లవ్ దేవ్ చెప్పుకొచ్చారు. దీన్ని బట్టే మోదీ విశాల దృక్పథాన్ని అర్థం చేసుకోవచ్చునంటూ విప్లవ్ దేవ్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. భారత్ తన దాయాది దేశాలతో కలిసి ఎదగాలని కోరుకుంటోందని ఆయన వివరించారు. పనిలో పనిగా కేరళ ఎన్నికల పైనా తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. ‘కేరళలో గత కొన్నేళ్లుగా పాతుకుపోయిన పాత సంప్రదాయాన్ని బీజేపీ మార్చనుంది. ఇప్పటిదాకా కేరళలో ఐదు సంవత్సరాలు కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే.. తర్వాతి ఐదేళ్లు లెఫ్ట్‌ అధికారంలో ఉండేది. బీజేపీ ఈ పద్దతిని మార్చనుంది. త్వరలోనే దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ పాగా వేయనుంది’ అని విప్లవ్ దేవ్ అన్నారు.




కంగారు పడకండయ్యా .... కన్ఫర్మ్ అయితే మేమే చెప్తాము కదా ....??

అన్ని కలిసొచ్చాయ్.. లక్ తోడైంది.. బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యింది..!

దుమ్ముదులిపేస్తున్న దీపిక పిల్లి.. ఢీ 13వ యాంకర్ మిలియన్ ఫాలోవర్స్..!

మరో ఎన్నికలకు తెర తీసిన ఎస్ఈసి..!!

ఒక్క సినిమాతో సూపర్ స్టార్ డమ్ ..?

RRR కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఆలియా భట్..షాక్ లో రాజమౌళి..??

'ఉప్పెన' పై మహేష్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ .....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>