PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-nimmagadda-elections95c730ea-f571-4ab9-a39f-ac4f0af60ee2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-nimmagadda-elections95c730ea-f571-4ab9-a39f-ac4f0af60ee2-415x250-IndiaHerald.jpgరాష్ట్రవ్యాప్తంగా జరిగిన రెండు దశల పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం స్పష్టంగా తెలిసొచ్చింది. అదే ఊపులో ఆగిపోయిన పరిషత్ ఎన్నికలు, మున్సిపాల్టీ ఎన్నికలకు వైసీపీ రెడీ అంటోంది. కరోనా కారణంగా వాయిదా వేసిన ఆ ఎన్నికలను కూడా ఇప్పుడే పెట్టాలని ఎస్ఈసీ ముందుకి ప్రతిపాదన పంపింది. దీనిపై ఈరోజో రేపో ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటారని, నోటిఫికేషన్ విడుదల చేస్తారని, అయితే అది కొత్త నోటిఫికేషన్ లేక ఆగిపోయిన దగ్గరనుంచి మొదలు పెట్టే నోటిఫికేషన్ అనేది తేలాల్సి ఉంది. jagan-nimmagadda-elections;cbn;panchayati;court;press;tdp;ycp;partyజగడ్డ: నిమ్మగడ్డ నిర్ణయంతో బాబులో టెన్షన్..జగడ్డ: నిమ్మగడ్డ నిర్ణయంతో బాబులో టెన్షన్..jagan-nimmagadda-elections;cbn;panchayati;court;press;tdp;ycp;partyMon, 15 Feb 2021 12:00:00 GMTపంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం స్పష్టంగా తెలిసొచ్చింది. అదే ఊపులో ఆగిపోయిన పరిషత్ ఎన్నికలు, మున్సిపాల్టీ ఎన్నికలకు వైసీపీ రెడీ అంటోంది. కరోనా కారణంగా వాయిదా వేసిన ఆ ఎన్నికలను కూడా ఇప్పుడే పెట్టాలని ఎస్ఈసీ ముందుకి ప్రతిపాదన పంపింది. దీనిపై ఈరోజో రేపో ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటారని, నోటిఫికేషన్ విడుదల చేస్తారని, అయితే అది కొత్త నోటిఫికేషన్ లేక ఆగిపోయిన దగ్గరనుంచి మొదలు పెట్టే నోటిఫికేషన్ అనేది తేలాల్సి ఉంది.

పంచాయతీ ఫలితాల్లో టీడీపీ హవా కొనసాగుతోందని చెప్పుకుంటున్న చంద్రబాబు అభ్యర్థుల పేర్లు మాత్రం చెప్పలేకపోతున్నారు. 50శాతం స్థానాలు మాకే వచ్చాయని చెప్పుకుంటున్నా.. ఎవరెవరు, ఎక్కడెక్కడ గెలిచారో మాత్రం బయటపెట్టడంలేదు. గెలిచామంటున్నారే కానీ, గెలిచిన స్థానాలపై టీడీపీ నాయకులకు కూడా నమ్మకం లేదు. పార్టీ గుర్తులతో సంబంధం లేదు కాబట్టి.. గెలిచినవారంతా తమ పార్టీవారేనని చెప్పుకున్నా ఆక్షేపించేవారు కూడా లేరు. అయితే పరిషత్, మున్సిపాల్టీ ఎన్నికలకు పార్టీ గుర్తులతో సంబంధం ఉంది. ఆ ఎన్నికలు జరిగితే మాత్రం అన్ని సీట్లొచ్చాయి, ఇన్ని స్థానాలు వచ్చాయి అని చెప్పుకోడానికి టీడీపీకి అవకాశమే లేదు. ముఖ్యంగా చంద్రబాబు కూడా ఇప్పటిలాగా ప్రెస్ మీట్లు పెట్టి హడావిడి చేసే అవకాశమే లేదు. దీంతో ఆగిపోయిన ఎన్నికలు మొదలైతే తమ అసలు విషయం బయటపడుతుందని భయపడుతున్నారు చంద్రబాబు. నిమ్మగడ్డ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని బాబు ఆందోళన చెందుతున్నారు.

ఎన్నికల నోటిఫికేషన్ పై కూడా టీడీపీ కోర్టుకి వెళ్లే అవకాశాలున్నాయని అంటున్నారు. గతంలో మొదలైన పరిషత్, మున్సిపాల్టీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని, నోటిఫికేషన్ల సమయంలోనే అక్రమాలు జరిగాయనేది చంద్రబాబు ఆరోపణ. ఇప్పుడు ఆగిపోయిన ఎన్నికలను కొత్త నోటిఫికేషన్ తో మొదలు పెట్టాలని, పాత నోటిఫికేషన్ ప్రకారం నామినేషన్ల ప్రక్రియను పరిగణలోకి తీసుకుంటే కోర్టుకెళ్లి అడ్డుకోవాలని టీడీపీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే పరిషత్, మున్సిపాల్టీ ఎన్నికల విషయంలో మరోసారి రభస జరగడం ఖాయం. కోర్టులు, పిటిషన్లు అంటే ఎన్నికలకు మరికొన్నాళ్లు సమయం పట్టే అవకాశం ఉంది.




కరోనా నుంచి బయటపడినా ఆ వైరస్ మళ్లీ ప్రబలుతోంది.. మరణాలు కూడా..!

బిగ్ బ్రేకింగ్: ఏపీలో మరో ఎన్నికల సమరానికి షెడ్యూల్

ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ సినిమా... ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్ వ‌చ్చేసింది..!

సౌందర్య బయోపిక్ పై రష్మిక ఆకస్మిక ప్రకటన !

ఉప్పెన మీద వివాదం.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం !

కత్తిలా ఉన్నావ్ అంటూ.. యాంకర్ సుమపై జబర్దస్త్ కమెడియన్ కామెంట్..!?

మంత్రి కొడాలిని బాగానే ఇరికించారు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>