PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-galla-jayadev-strong-on-guntur5a64043e-e2e4-458d-897f-3b29d68a3512-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-galla-jayadev-strong-on-guntur5a64043e-e2e4-458d-897f-3b29d68a3512-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే విషయంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు ఎక్కువగా తప్పులు చేస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజు రోజుకు కూడా చాలా దారుణంగా తయారవుతోంది. ఆయన జిల్లాలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేదు. రెండో దశ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి పాలు కావడం అనేది తెలుగుదేశం పార్టీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. కీలgalla;bhavana;telugu desam party;atchannaidu kinjarapu;galla jayadev;andhra pradesh;telugu;media;rayalaseema;tdp;local language;nijam;jayadev galla;yatra;partyఅచ్చెన్నతో బాబు యాత్ర... విత్ గల్లాఅచ్చెన్నతో బాబు యాత్ర... విత్ గల్లాgalla;bhavana;telugu desam party;atchannaidu kinjarapu;galla jayadev;andhra pradesh;telugu;media;rayalaseema;tdp;local language;nijam;jayadev galla;yatra;partyMon, 15 Feb 2021 08:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే విషయంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు ఎక్కువగా తప్పులు చేస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజు రోజుకు కూడా చాలా దారుణంగా తయారవుతోంది. ఆయన జిల్లాలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేదు. రెండో దశ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి పాలు కావడం అనేది తెలుగుదేశం పార్టీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. 

కీలక నేతల నియోజకవర్గాల్లో కూడా ఓటమి అనేది శ్రీకాకుళం జిల్లాలో పార్టీకి నిజంగా అవమానకరమనే చెప్పాలి. పెద్దగా అచ్చెన్న కూడా దృష్టి పెట్టలేకపోతున్నారు. నియోజకవర్గాల్లో ఆయన పర్యటనలు చేయాల్సి ఉన్నా సరే అక్కడ నేతలతో కూడా ఆయన పెద్ద చర్చలు జరిపే ప్రయత్నం చేయటం లేదు. దీని కారణంగా పార్టీ ఎక్కువ నష్టపోతుందనే ఆవేదన కొంతమందిలో వ్యక్తమవుతోంది. ఇక పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన రాయలసీమ జిల్లాల మీద పెద్దగా దృష్టి పెట్టలేదు అని చెప్పాలి.

ఎక్కడైనా ఏదైనా ఘటన జరిగితే ఆ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం లేకపోతే మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేయడం వంటివి మాత్రమే చేస్తున్నారు. దీనివలన పార్టీ కార్యకర్తల్లో ఆయనపై నమ్మకం అనేది పోతుంది అనే భావన చాలామంది వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇప్పుడు మారకపోతే మాత్రం భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఆ పార్టీకి వచ్చే అవకాశాలు ఉంటాయి. తెలంగాణలో తరహాలో పార్టీ తయారవుతుంది. దీంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడుతో త్వరలోనే సమావేశమై కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో ఒక యాత్ర కూడా చేయించే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నారని సమాచారం. ఆయనతో పాటుగా రామ్మోహన్ నాయుడు గల్లా జయదేవ్ కూడా వెళ్లే అవకాశాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.



యూట్యూబ్ లో చూసి పిల్లల పై ప్రయోగాలు చేశాడు.. చివరికి..?

మంత్రి కొడాలిని బాగానే ఇరికించారు..

ఉప్పెన కు సమస్యగా తయారైన నెట్ ఫ్లిక్స్ !

జగడ్డ : నిమ్మగడ్డా.. ప్లీజ్‌.. అది కూడా కానిచ్చేయండీ..!

జగడ్డ: బాబు దెబ్బకి వైసీపీలో వణుకు..

జగడ్డ: ఉన్న కాస్త పరువూ పోగొట్టుకుంటున్న చంద్రబాబు..!?

ఏంటీ.. పవన్ కళ్యాణ్ ను.. ఆ హీరోయిన్ ప్రేమిస్తుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>