MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anupama-parameswaran15601de7-a4d2-4399-85c3-5d520c0b03b7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anupama-parameswaran15601de7-a4d2-4399-85c3-5d520c0b03b7-415x250-IndiaHerald.jpgపైన ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా..? బాగా చూడండి..! గుర్తుకొచ్చిందా..? అయ్యో ఇంకా రాలేదా..? ఆమె ఎవరో కాదండి మన అనుపమ పరమేశ్వరన్.. అవును.. ఆమె..సరిగ్గా చూడండి..మీకు గుర్తుకొస్తుంది.. అనుపమ పరమేశ్వరన్ చిన్నప్పటి ఫోటో. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటో ని ఎవరు అప్లోడ్ చేశారు అని చూస్తున్నారా.? anupama parameswaran;nithin;samantha;kerala;patti;thrissur;cinema;telugu;media;cm;february;instagram;heroine;nithin reddy;premam;shatamanam bhavathi;james cameron;a aaఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో తెలుసా..?ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో తెలుసా..?anupama parameswaran;nithin;samantha;kerala;patti;thrissur;cinema;telugu;media;cm;february;instagram;heroine;nithin reddy;premam;shatamanam bhavathi;james cameron;a aaMon, 15 Feb 2021 16:44:41 GMT

ఇంతకుముందెప్పుడూ సోషల్ మీడియాలో అనుపమ యాక్టివ్ గా ఉండేది కాదు. కానీ ప్రస్తుతం లాక్ డౌన్ పుణ్యమా అని ఈ అమ్మడు ట్రెండ్ మార్చేసింది. ఈ టైం లో పూర్తిగా స్లిమ్ లుక్లో కి మారిపోయింది. ఈ మలయాళ ముద్దుగుమ్మ వరుస ఫోటో షూట్ లతో ఇన్స్టా  లో హల్ చల్ చేస్తోంది . ఫిబ్రవరి 18 అనుపమ పుట్టిన రోజు కాగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆమె సోషల్ మీడియాలో తన చిన్నప్పటి ఫోటోలను అభిమానులతో పంచుకుంది.


అనుపమ పరమేశ్వరన్ కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్  జిల్లాకు చెందిన ఇరింజలకుడ లో 1996 ఫిబ్రవరి 18న పరమేశ్వరన్,సునీత దంపతులకు జన్మించింది. ఆమె తన పై చదువులను కొట్టాయం సీఎంఎస్ కళాశాలలో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ప్రధాన విషయంగా ఉన్నత విద్యను అభ్యసించింది. ఆ తర్వాత నటనపై ఉన్న ఆసక్తి కారణంగా చదువులకు పూర్తిగా ఫుల్స్టాప్ పెట్టింది. ఈ అమ్మడు మలయాళం సినిమా ప్రేమమ్  సినిమా ద్వారా అరంగేట్రం చేసింది. అయితే ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధించి పెట్టింది. ఇక ఆ తర్వాత మలయాళం చిత్రమైన జేమ్స్ అండ్ అలైస్ లో కూడా అవకాశం చిక్కింది. ఆ తర్వాత వరుస ఆఫర్లతో బిజీ అయిపోయింది ఈ అమ్మడు.


ఆ తర్వాత నితిన్,సమంత  నటించిన" అ ఆ "సినిమాలో కూడా  ఈమె మలయాళం అయినప్పటికీ, తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఇక ఆ తర్వాత  తెలుగులో శతమానం భవతి సినిమా లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించి పెట్టింది అని చెప్పవచ్చు. మరో రెండు రోజుల్లో అనుపమ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఈ ఫోటో ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది.





వైష్ణవ్ తేజ్ హిట్.. అఖిల్ కు తలనొప్పిగా మారిందా..?

ఉప్పెన 3 డేస్ లోనే ప్రాఫిట్స్.. మెగా హీరో మొదటి సినిమానే రికార్డ్..!

స‌జ్జ‌ల వారి దౌత్యం కుద‌ర‌లేదు.. ఎమ్మెల్యే వ‌ర్సెస్ కీల‌క నేత ర‌గ‌డ ?

ర‌వి రాజ‌కీయం.. టీడీపీకి కొత్త ఉద‌యం..!

అఖిల్.. మోనాల్.. బిగ్ బాస్ కపుల్ క్రేజీ వెబ్ సీరీస్..!

జగడ్డ : ఉక్కే అని ఊరుకుంటే లెక్క తేల్చేస్తుందా.. ?

షూటింగ్ స్పాట్ కి లేట్ గా వచ్చాడని ఒక సీనియర్ నటుడిని మెగాస్టార్ ఏమి చేసాడంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>