PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/disa-ravi0164e083-5f70-490e-972b-c9a02239d73e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/disa-ravi0164e083-5f70-490e-972b-c9a02239d73e-415x250-IndiaHerald.jpgసాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమానికి మద్దతు తెలియజేయడానికి స్వీడన్ బాలిక గ్రెటా థన్‌బర్గ్ షేర్ చేసిన టూల్‌కిట్‌కు ఖలిస్థాన్ వేర్పాటువాదులతో సంబంధం ఉన్నట్టు పోలీసులు ఆరోపిస్తున్నారు. థన్‌బర్గ్ షేర్ చేసిన టూల్‌కిట్‌ను బెంగళూరుకు చెందిన పర్యావరణ కార్యకర్త దిశ రవి ఎడిట్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమెను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, తన కుమార్తె అరెస్ట్ అంశంపై మీడియాతో మాట్లాడటానికి దిశ రవి తల్లి మంజుల నిరాకరించారు.disa ravi;women;manjula;ravi anchor;delhi;bharatiya janata party;korcha;sweden;smart phone;police;media;capital;bengaluru 1;woman;arrest;local language;central government;dogsమీడియాతో మాట్లాడేందుకు ఇష్టపడని దిశ రవి తల్లి మంజులమీడియాతో మాట్లాడేందుకు ఇష్టపడని దిశ రవి తల్లి మంజులdisa ravi;women;manjula;ravi anchor;delhi;bharatiya janata party;korcha;sweden;smart phone;police;media;capital;bengaluru 1;woman;arrest;local language;central government;dogsMon, 15 Feb 2021 22:00:00 GMTఇటీవలే కేంద్ర బీజేపీ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో దాదాపు మూడు నెలలుగా రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమానికి మద్దతు తెలియజేయడానికి స్వీడన్ బాలిక గ్రెటా థన్‌బర్గ్ షేర్ చేసిన టూల్‌కిట్‌కు ఖలిస్థాన్ వేర్పాటువాదులతో సంబంధం ఉన్నట్టు పోలీసులు ఆరోపిస్తున్నారు. థన్‌బర్గ్ షేర్ చేసిన టూల్‌కిట్‌ను బెంగళూరుకు చెందిన పర్యావరణ కార్యకర్త దిశ రవి ఎడిట్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమెను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, తన కుమార్తె అరెస్ట్ అంశంపై మీడియాతో మాట్లాడటానికి దిశ రవి తల్లి మంజుల నిరాకరించారు.




‘ఏం జరిగిందో మాకు తెలుసు.. అయినా ఈ సమయంలో మీడియాతో మాట్లాడటానికి మేము ఇష్టపడటం లేదు’ అని దిశ రవి తల్లి మంజుల అన్నారు. మీడియా ప్రతినిధులను లోపలికి రాకుండా వారి పెంపుడు కుక్క జర్మన్ షెపర్డ్ అడ్డుకోవడం కొసమెరుపు. బెంగళూరు సబర్బన్‌ చిక్కబనవారాలో ఐదేళ్ల కిందట దిశ రవి తల్లిదండ్రులు ఇల్లు నిర్మించినట్టు స్థానికులు చెప్పారు. ఆ ప్రాంతంలో చాలా మంది కొత్తగా వచ్చిన వ్యక్తులే ఉన్నారని దిశ ఇంటి పక్కనే ఉండే ఓ దుకాణం యజమాని తెలిపాడు. ‘దిశ తన పెంపుడు కుక్కను ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం బయటకు తీసుకొస్తుంది.. వారి ఇంటి ఆవరణలో ఉండే చిన్న గార్డెన్‌‌లో దిశ, మంజుల రోజూ కూర్చుంటారు’ అని ఓ మహిళ చెప్పింది. ‘శనివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో రెండు కార్లు వచ్చి దిశ ఇంటి ముందు ఆగాయి.. గేటు వద్ద ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉండటం కనిపించింది.. ఏం జరుగుతుందో తమకు తెలియకపోవడంతో దూరంగా ఉన్నాం... మా పక్కింటిలో ఉండే వ్యక్తి ఫోన్ చేసిన దిశను సాయంత్రం 6 గంటలప్పుడు తీసుకెళ్లారని చెప్పాడు.. కానీ, ఆమెను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారని గ్రహించలేదు’ అని మరో వ్యక్తి తెలిపాడు. దిశ తరుచూ తమ వద్ద బ్రెడ్, స్నాక్స్, చాక్‌లెట్స్ కొంటుందని అక్కడ షాప్ యజమాని చెప్పాడు. అంతేకాదు, తన వెంట ఎప్పుడూ కుక్క ఉంటుంది, ఆమెను అరెస్ట్ చేసిన విషయం, కేసు గురించి తమకేమీ తెలియదని అన్నాడు.




జె డి చక్రవర్తి భార్య సైతం స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా..?

మరో ఎన్నికలకు తెర తీసిన ఎస్ఈసి..!!

ఒక్క సినిమాతో సూపర్ స్టార్ డమ్ ..?

RRR కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఆలియా భట్..షాక్ లో రాజమౌళి..??

'ఉప్పెన' పై మహేష్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ .....!!

వైసీపీకి రివ‌ర్స్ షాక్‌.. మామూలు దెబ్బ కాదుగా...!

డప్పు కొడుతున్న అనసూయ.. కుర్రాళ్ల గుండెల్లో నిప్పు రాజేస్తుంది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>