MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-superstar-krishnace90809a-62d0-4f2f-8bf5-6ccb9644be75-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-superstar-krishnace90809a-62d0-4f2f-8bf5-6ccb9644be75-415x250-IndiaHerald.jpgసీనియర్ హీరో సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ టాలీవుడ్ సినిమా పరిశ్రమకు అప్పట్లో ఎన్నో కొత్తరకాల నూతన హంగులు, టెక్నాలజీలను పరిచయం చేసారు. తొలి సినిమా స్కోప్, తొలి కలర్, తొలి కౌబాయ్, తొలి జేమ్స్ బాండ్ ఇలా చెప్పుకుంటూ పోతే కృష్ణ ఆవిధంగా ఎన్నో రకాలుగా సినిమా పరిశ్రమకు సరికొత్త సొగసులద్దారు. అంతేకాదు టాలీవుడ్ లో 350 సినిమాల్లో హీరోగా నటించి గొప్ప పేరు దక్కించుకున్న కృష్ణ, అప్పట్లో కొన్నేళ్ల పాటు తిరుగులేని నెంబర్ వన్ మాస్ హీరోగా టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో మంచి క్రేజ్ దక్కించుకున్నారు. mahesh-babu;superstar-krishna;mahesh;abhishek;krishna;tiru;rajaka;tollywood;cinema;rajani kanth;media;producer;audience;producer1;hero;james bond;mass;james cameronఎంతైనా ఆయన కొడుకు కదా .... రియల్ హీరోయిజం వాళ్ళ బ్లడ్ లోనే ఉంది ....??ఎంతైనా ఆయన కొడుకు కదా .... రియల్ హీరోయిజం వాళ్ళ బ్లడ్ లోనే ఉంది ....??mahesh-babu;superstar-krishna;mahesh;abhishek;krishna;tiru;rajaka;tollywood;cinema;rajani kanth;media;producer;audience;producer1;hero;james bond;mass;james cameronMon, 15 Feb 2021 16:23:39 GMTహీరో సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ టాలీవుడ్ సినిమా పరిశ్రమకు అప్పట్లో ఎన్నో కొత్తరకాల నూతన హంగులు, టెక్నాలజీలను పరిచయం చేసారు. తొలి సినిమా స్కోప్, తొలి కలర్, తొలి కౌబాయ్, తొలి జేమ్స్ బాండ్ ఇలా చెప్పుకుంటూ పోతే కృష్ణ ఆవిధంగా ఎన్నో రకాలుగా సినిమా పరిశ్రమకు సరికొత్త సొగసులద్దారు. అంతేకాదు టాలీవుడ్ లో 350 సినిమాల్లో హీరోగా నటించి గొప్ప పేరు దక్కించుకున్న కృష్ణ, అప్పట్లో కొన్నేళ్ల పాటు తిరుగులేని నెంబర్ వన్ మాస్ హీరోగా టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో మంచి క్రేజ్ దక్కించుకున్నారు.

ఇక చూడడానికి ఎంతో అందంగా ఉండే కృష్ణ మనసు కూడా అంతే అందంగా ఉంటుందని, తనతో చేసిన సినిమాలు ఏవైనా ఫెయిల్ అయితే ఆ నిర్మాతల నుండి పారితోషికం తీసుకోకపోవడం, అలానే మరికొందరికి తదుపరి సినిమాలు ఉచితంగా చేసిపెట్టడం వంటివి చేసారని, అలానే తనతో నటించిన కొందరు నటులకు తనకు వీలైనంతలో గొప్ప మనసుతో సాయమందించే విషయంలో కృష్ణ ఎప్పుడూ ముందుంటారని ఆయన మంచితనం గురించి ఇప్పటికీ కూడా ఎందరో నటీనటులు, సినిమా ప్రముఖులు చెప్తూ ఉంటారు. ఇక అయన తనయుడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు బాలనటుడిగా చిన్నతంలోనే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆపై రాజకుమారుడు మూవీ తో హీరోగా రంగప్రవేశం చేసిన మహేష్, ఫస్ట్ మూవీ తో బెస్ట్ హిట్ కొట్టారు. ఇక అక్కడి నుండి వరుస అవకాశాలతో కొనసాగి వాటితో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ కొట్టి కోట్లాదిమంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొని, ప్రస్తుతం తండ్రికి తగ్గ తనయుడిగా నేటితరం సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు మహేష్.

ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే, టాలీవుడ్ కి చెందిన డిస్ట్రిబ్యూటర్ మరియు నిర్మాత అయిన అభిషేక్ నామా ఇటీవల ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న హీరోల్లో తమ సినిమాలు ఒకవేళ ఫెయిల్ అయితే నష్టపోయిన వారిని ఆదుకోవడంలో ముందుండే వ్యక్తుల్లో మహేష్ బాబు ప్రధమ వ్యక్తి అని, తన మూవీ ఫ్లాప్ అయిన వెంటనే మా వంటివారి కష్టాన్ని గ్రహించి ఆయన చాలా సార్లు సాయమందించారని అన్నారు అభిషేక్. అయితే మిగతా హీరోలు కొందరు కూడా సాయం చేసినప్పటికీ కూడా మహేష్ వారందరికంటే ఒకింత సమస్య తెలుసుకుని ముందుకు స్పందించేవారని అన్నారు. ఎంతైనా కృష్ణ కొడుకు కదా, రియల్ హీరోయిజం వాళ్ళ బ్లడ్ లోనే ఉంది అంటూ ఈ విషయమై పలువురు ఫ్యాన్స్, ఆడియన్స్ మహేష్ బాబు గొప్ప మనసుపై తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభినందనలు కురిపిస్తున్నారు....!!


ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో తెలుసా..?

వైష్ణవ్ తేజ్ హిట్.. అఖిల్ కు తలనొప్పిగా మారిందా..?

ఉప్పెన 3 డేస్ లోనే ప్రాఫిట్స్.. మెగా హీరో మొదటి సినిమానే రికార్డ్..!

స‌జ్జ‌ల వారి దౌత్యం కుద‌ర‌లేదు.. ఎమ్మెల్యే వ‌ర్సెస్ కీల‌క నేత ర‌గ‌డ ?

ర‌వి రాజ‌కీయం.. టీడీపీకి కొత్త ఉద‌యం..!

అఖిల్.. మోనాల్.. బిగ్ బాస్ కపుల్ క్రేజీ వెబ్ సీరీస్..!

జగడ్డ : ఉక్కే అని ఊరుకుంటే లెక్క తేల్చేస్తుందా.. ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>