PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy-padhayathrab1bca102-3469-4952-adb2-0022454b2d86-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy-padhayathrab1bca102-3469-4952-adb2-0022454b2d86-415x250-IndiaHerald.jpgతెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అచ్చంపేట నుంచి హైదరాబాద్‌ వరకు పాదయాత్ర చేయాలని తలపెట్టిన రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజలను పరామర్శిస్తూ వారి మనసును కాంగ్రెస్ కు మళ్లీ దగ్గర చేస్తున్నారు.revanth reddy padhayathra;dr rajasekhar;jeevan;revanth;telangana;y. s. rajasekhara reddy;revanth reddy;congress;mp;tpcc;selection process;central government;reddy;petta;partyరేవంత్ రెడ్డి హఠాత్తుగా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు ?.. అసలు కారణం అదేనా..?రేవంత్ రెడ్డి హఠాత్తుగా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు ?.. అసలు కారణం అదేనా..?revanth reddy padhayathra;dr rajasekhar;jeevan;revanth;telangana;y. s. rajasekhara reddy;revanth reddy;congress;mp;tpcc;selection process;central government;reddy;petta;partySun, 14 Feb 2021 11:00:00 GMTరేవంత్ రెడ్డి తరచూ వార్తల్లో హాట్ టాపిక్ గా ఉంటారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అచ్చంపేట నుంచి హైదరాబాద్‌ వరకు పాదయాత్ర చేయాలని తలపెట్టిన రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజలను పరామర్శిస్తూ వారి మనసును కాంగ్రెస్ కు మళ్లీ దగ్గర చేస్తున్నారు.. తిరిగి కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం దక్కేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు రేవంత్ రెడ్డి. అచ్చంపేట ప్రాంతం వద్ద పాదయాత్ర మొదలు పెట్టిన రేవంత్ రెడ్డి అధికార పార్టీ మరియు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి శుక్రవారం నాడు మండిపడ్డారు.వారి వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా సంచలనం సృష్టిస్తున్న ఆయన పాదయాత్రపై పలు భావనలు వ్యక్తమవుతున్నాయి. ఇంత త్వరగా పాదయాత్ర చేయడానికి వెనుక వేరే కారణాలు ఉన్నాయంటూ ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ అంశానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే వాస్తవానికి పాలిటిక్స్ లో చురుగ్గా ఉండే ప్రముఖ నేతలలో రేవంత్ రెడ్డి ఒకరు. అయితే ఈయనకు ఈ ఆలోచన ఎప్పటినుంచో ఉందని...వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని ఆయన అనుకున్నారని... అయితే ఇంత త్వరగా పాదయాత్ర చేపట్టడం వెనుక అసలు కారణం వేరే ఉందని అంటున్నారు.  కొద్దిరోజుల క్రితం టీపీసీసీ చీఫ్ పదవి కి రేవంత్ రెడ్డిని ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది.

అయితే అప్పట్లో ఈ పదవి మరో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డికి ఖాయమైందని కొందరు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో...మరోసారి టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ మొదలయ్యేలోపు తన పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ అధిష్టానం పూర్తి దృష్టి తనపై పడేలా చూసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రణాళికలు చేసినట్లు చెబుతున్నారు. మరోసారి టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ ప్రారంభమయ్యే తాను పాదయాత్ర  మొదలుపెట్టి అటు ప్రజలను ఇటు పార్టీ శ్రేణులను ఇరువురిని తనపై దృష్టి పడేలా చేసుకొని.... తాను అనుకున్నది సాధించాలనే పట్టుదలతోనే ఇంత హఠాత్తుగా పాదయాత్ర మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. మరి రేవంత్ రెడ్డి అనుకున్న విధంగా జరుగుతుందా లేదా తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.


కరివేపాకుకు కాలిన గాయాలను నయం చేయగల శక్తి ఉందా..?

అప్పట్లో కన్నీళ్లు తెప్పించి, కాసుల వర్షం కురిపించిన సినిమా ఏంటో తెలుసా...!

నిహారిక పెళ్ళితో సాయి ధరమ్ తేజ్ కు ఒత్తిడి !

ఎడిటోరియల్: “కోవిడ్ వ్యాక్సీన్” కోసం భారత్ ను ఎందుకు సంప్రదించ లేదు? కెనడా మంత్రి అనితా ఆనంద్ ను ప్రశ్నించిన ఎంపి వార్నర్

ఏపీ పంచాయతీ ఎన్నికల్లోనే అది రికార్డు విజయం..

జగడ్డ : రెండో విడతలోనూ ఎవరి లెక్కలు వారివే..

చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రికి షాక్ ఇచ్చిన ఓట‌ర్లు.... అక్క‌డ సైకిల్ గ‌ల్లంతు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>