MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sriya558b01e4-c6d0-4e0c-ab1b-07ab5d520ff7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sriya558b01e4-c6d0-4e0c-ab1b-07ab5d520ff7-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. వస్తున్నాయి. ఒక్కో సినిమాకూ ఒక్కో టార్గెట్ ఉంటుంది. సినిమా అంటే ప్రధానంగా వినోద సాధనమే. అందుకే కంటెంట్ కూడా అలాగే ఉండేలా చూసుకుంటారు. ఇదిలా ఉంటే మిగిలిన భాషలలో వచ్చిన విధంగా డిఫరెంట్ జోనర్లలో మూవీస్ తెలుగులో తక్కువగా వస్తుంటాయి. sriya;women;shriya;tara;tollywood;cinema;telugu;husband;woman;hero;nijamషాకింగ్ రోల్ లో శ్రియ...తట్టుకోగలరా..?షాకింగ్ రోల్ లో శ్రియ...తట్టుకోగలరా..?sriya;women;shriya;tara;tollywood;cinema;telugu;husband;woman;hero;nijamSun, 14 Feb 2021 13:20:52 GMTటాలీవుడ్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. వస్తున్నాయి. ఒక్కో సినిమాకూ ఒక్కో టార్గెట్ ఉంటుంది. సినిమా అంటే ప్రధానంగా వినోద సాధనమే. అందుకే కంటెంట్ కూడా అలాగే ఉండేలా చూసుకుంటారు. ఇదిలా ఉంటే మిగిలిన భాషలలో వచ్చిన విధంగా డిఫరెంట్ జోనర్లలో మూవీస్ తెలుగులో తక్కువగా వస్తుంటాయి.

దానికి కారణం ఏంటో తెలియదు కానీ నూటికి తొంబై అయిదు శాతం దాకా సినిమాలు అన్నీ కూడా కమర్షియల్ ఫార్మెంట్ లోనే వస్తాయి. దాంతో నటీనటులకు మంచి అభిరుచి ఉన్న పాత్రలు చేయాలని ఉన్నా కూడా ఆచరణలో మాత్రం పెద్దగా  కుదరడంలేదు. ఇవన్నీ పక్కన పెడితే అందాల తార, గ్లామర్ డాల్ గా పేరు పొందిన శ్రియ ఒక ఆఫ్ బిట్ మూవీలో యాక్ట్ చేయడం అంటే షాకింగ్ న్యూసే.

గమనం అనే సినిమా తెలుగులో శ్రియ చేస్తోంది. ఈ మూవీలో శ్రియ పాత్ర ఒక చెవిటి మహిళ. ఆమె ఈ సినిమాలో తన నుంచి దూరమైన భర్త కోసం వేచి చూస్తే తన బిడ్డను పోషించుకునే పాత్రట. పేదరికాన్ని అనుభవించే ఒక స్త్రీగా ఈ సినిమాలో శ్రియ చేయడం అంటే నిజంగా రికార్డే.

శ్రియను ఇంతవరకూ వయ్యారాల భామగానే చూశారు. హీరో పక్కన డ్యూయెట్లు పాడుతూ సాగే బొమ్మగానే చూశారు. ఫస్ట్ టైం శ్రియ ఇలాంటి పాత్రలో నటించడం అంటే రిస్క్  చేసిందనే చెప్పాలి. అయితే నటీమణులకు మంచి పాత్రలు పడాలి కానీ తమను తాము వారు ప్రూవ్ చేసుకుంటారు. శ్రీయ విషయంలో అదే జరుగుతుందని అంతా ఆశాభావంగా ఉన్నారట. శ్రియ కి ఈ మూవీ ద్వారా కచ్చితంగా అవార్డ్ దక్కుతుంది అని కూడా అంటున్నారు. చూడాలి మరి తొందరలో రిలీజ్ అయ్యే ఈ మూవీలో శ్రియ నటన ఎలా ఉందో. ఏది ఏమైనా సీనియర్ నటీమణిగా శ్రియ సరైన నిర్ణయమే తీసుకుందని అని అంతా అంటున్నారు.






టీమిండియాకు షాక్.. 67 ఏళ్ల భారత్ రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్

బాబు వైఖ‌రి ఇలా ఉంటే క‌ష్ట‌మే.. త‌ల ప‌ట్టుకుంటోన్న త‌మ్ముళ్లు ?

జగడ్డ: వైసీపీ కంచు కోటలు బద్దలు.. సీన్ మారుతోందా..?

కడుపుతో ఉన్నా కూడా తుపాకి పట్టింది..గుండెలు కదిలించే కథ

రేవంత్ రెడ్డి హఠాత్తుగా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు ?.. అసలు కారణం అదేనా..?

స్టార్ హీరోలను ఢీ కొట్టిన కమెడియన్...?

అప్పట్లో కన్నీళ్లు తెప్పించి, కాసుల వర్షం కురిపించిన సినిమా ఏంటో తెలుసా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>