Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/avise-ginjaluf5e42c9c-1916-4f69-b521-03a5edcfd86b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/avise-ginjaluf5e42c9c-1916-4f69-b521-03a5edcfd86b-415x250-IndiaHerald.jpg అవిసె గింజల్ని వాడడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.ఈ గింజలను పూర్వకాలము నుంచి వాడు తున్నారు. అవిసె గింజలను అన్ని రకాల ఆహార పదార్థాల్లోనూ వాడుతున్నారు. అవిశ గింజలు మంచి వాసన కలిగి ఉంటాయి. రుచి కూడా బాగుంటాయి.అవిసె గింజల్లో అనేక పోషకాలు ఉన్నాయి. అంతేకాకుండా విటమిన్లు, ప్రొటీన్లు కూడా ఉన్నాయి. ఇవి వాడటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అవిసె గింజలను వాడటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. avise ginjalu;bhavana;tara;cancer;cheque;aqua;cholesterol;lieఅవిసె గింజల్లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఉన్నాయని మీకు తెలుసా...?అవిసె గింజల్లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఉన్నాయని మీకు తెలుసా...?avise ginjalu;bhavana;tara;cancer;cheque;aqua;cholesterol;lieSun, 14 Feb 2021 01:00:00 GMT
 అవిసె గింజల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల తొందరగా కడుపు నిండిన భావన కలిగి తక్కువ తింటారు.ఫలితంగా బరువు తగ్గుతారు.

 అవిశ గింజల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. అందుకే వీటిని తినడం వల్ల శరీరము యొక్క ఆరోగ్యకరమైన పనితీరుకు బాగా ఉపయోగపడుతుంది.

 అవిసె గింజల్లో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మెండుగా ఉంటాయి.ఇవి శరీరంలోని కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అవిసె గింజల్లో యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల రక్తాన్ని శుద్ధి చేసి, నిరోధక శక్తిని పెంచుతాయి.చుండ్రు సమస్యను కూడా చెక్ పెడతాయి.

 అవిసె గింజలని వాడడం వల్ల మానసిక ఒత్తిడిని దూరం చేయడమే కాకుండా, లైంగిక రుగ్మతలను దూరం చేస్తాయి. అంతే కాకుండా ఈ గింజల్లో ఒమేగా 3 ఆమ్లాలు ఉండడంవల్ల హృద్రోగాలు,  కీళ్లవాతం, ఉబ్బసం, మధుమేహం వంటి వ్యాధులను రాకుండా చేస్తాయి.

దగ్గు, జలుబు తో బాధపడుతున్న వాళ్లు 3 చెంచాల అవిసె గింజల పొడిని కప్పు నీటిలో వేసి చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి.తర్వాత వడగట్టి అందులోకి మూడు చెంచాల నిమ్మరసం,  మూడు చెంచాల తేనె కలిపి తాగడం వల్ల జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది.

 అవిసె గింజలను క్రమం తప్పకుండా వాడటం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని పరిశోధనలో తేలింది. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటి ఆమ్లాలు,యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి.

 ఆవిష గింజల్లోని ఫైబర్ జీర్ణాశయం పనితీరును మెరుగుపరిచి గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది. అవిసె గింజల పొడిని ఆహారంలో కలిపి తీసుకోవడం వల్ల మలబద్దక సమస్య కూడా తగ్గుతుంది.


వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా...?

రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...

వ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

కొడాలి ఇలాకాలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ... వింత గెలుపు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>