PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/what-happened-night-after-night-ycp-vision-is-all-yoursf4fe77bd-1e93-4e7a-b74e-c92a38e166df-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/what-happened-night-after-night-ycp-vision-is-all-yoursf4fe77bd-1e93-4e7a-b74e-c92a38e166df-415x250-IndiaHerald.jpgదీనికి ముందు మంత్రి కొడాలి నాని చేసిన‌ విమర్శలపై స్పందించిన ఎస్‌ఈసీ.. ఆయనకు షోకాజ్‌ నోటీసు పంపించింది. సాయంత్రానికి మంత్రి తన వివరణను న్యాయవాది ద్వారా పంపించారు. ఎస్‌ఈసీ అంటే తనకు గౌరవమే అని వివరణ ఇచ్చారు. దీంతో అప్ప‌టికే విధించిన‌.. నిషేధ ఉత్త‌ర్వుల‌ను నిమ్మ‌గ‌డ్డ వెన‌క్కి తీసుకుంటార‌ని అంద‌రూ అనుకున్నారు. లేదా.. వాటినే కొన‌సాగిస్తార‌ని భావించారు. వైసీపీలోనూ ఇదే చ‌ర్చ సాగింది. అయితే.. అనూహ్యంగా తెల్ల‌వారే స‌రికి ప‌రిస్థితి మొత్తం మారిపోయింది. రాత్రికి రాత్రి ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ.. మంత్రిchandra babu ysrcp;view;cbn;nani;amala akkineni;kumaar;kodali nani;krishna river;vijayawada;district;scheduled caste;panchayati;lawyer;minister;krishna district;letter;tdp;ycp;election commission;mantraరాత్రికి రాత్రి ఏం జ‌రిగింది... వైసీపీ దృష్టంతా బాబుమీదే.. !రాత్రికి రాత్రి ఏం జ‌రిగింది... వైసీపీ దృష్టంతా బాబుమీదే.. !chandra babu ysrcp;view;cbn;nani;amala akkineni;kumaar;kodali nani;krishna river;vijayawada;district;scheduled caste;panchayati;lawyer;minister;krishna district;letter;tdp;ycp;election commission;mantraSun, 14 Feb 2021 13:30:00 GMTవైసీపీ సీనియ‌ర్ల మ‌ధ్య తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అస‌లు ఏం జ‌రిగింది?  రాత్రికి రాత్రి ఎందుకు ఈ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి?  దీనివెనుక ఎవ‌రు ఉన్నారు?  చంద్ర‌బాబే క‌థంతా న‌డిపించారా?  ఇవీ.. ఇప్పుడు వైసీపీ సీనియ‌ర్ల‌ను వేధిస్తున్న, ఆలోచ‌న‌కు గురి చేస్తున్న ప్ర‌శ్న‌లు. మంత్రి కొడాలి నాని వ‌ర్సెస్ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌ వ్య‌వ‌హారం.. కేవ‌లం 24 గంట‌ల్లో వ్యూహాత్మ‌క మ‌లుపు తిరిగింది. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న కమిషనర్‌కు దురుద్దేశాలు ఆపాదించార‌ని పేర్కొంటూ.. పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు మంత్రి కొడాలి మీడియాతో మాట్లాడొద్దని ఎస్ ఈసీ ఆదేశించింది. ఈ మేరకు కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ శుక్ర‌వారం రాత్రి ఉత్తర్వులిచ్చారు.

ఈ నెల 21 వరకు మంత్రి నాని బహిరంగ సభల్లోనూ, గ్రూపు సమావేశాల్లోనూ మాట్లాడకుండా నిషేధం విధించారు. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. వీటిని అమలు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌, ఎస్సీ, విజయవాడ పోలీసు కమిషనర్‌లను నిర్దేశించారు. దీనికి ముందు మంత్రి కొడాలి నాని చేసిన‌ విమర్శలపై స్పందించిన ఎస్‌ఈసీ.. ఆయనకు షోకాజ్‌ నోటీసు పంపించింది. సాయంత్రానికి మంత్రి తన వివరణను న్యాయవాది ద్వారా పంపించారు. ఎస్‌ఈసీ అంటే తనకు గౌరవమే అని వివరణ ఇచ్చారు.

దీంతో అప్ప‌టికే విధించిన‌.. నిషేధ ఉత్త‌ర్వుల‌ను నిమ్మ‌గ‌డ్డ వెన‌క్కి తీసుకుంటార‌ని అంద‌రూ అనుకున్నారు. లేదా.. వాటినే కొన‌సాగిస్తార‌ని భావించారు. వైసీపీలోనూ ఇదే చ‌ర్చ సాగింది. అయితే.. అనూహ్యంగా తెల్ల‌వారే స‌రికి ప‌రిస్థితి మొత్తం మారిపోయింది. రాత్రికి రాత్రి ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ.. మంత్రి కొడాలి వివ‌ర‌ణ ఇచ్చిన త‌ర్వాత‌.. అప్ప‌టికే నిమ్మ‌గ‌డ్డ ఆయ‌న‌పై నిషేధం ఉత్త‌ర్వులు ఇచ్చిన త‌ర్వాత కూడా అనూహ్య‌మైన ఆదేశాలు ఇవ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. కొడాలిపై ఏకంగా క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. కేసులు న‌మోదు చేయాల‌ని ఆదేశించ‌డం గ‌మ‌నార్హం.

ఏకంగా ఐపీసీ సెక్ష‌న్లు  504, 505, 506ల కింద మంత్రి నానిపై త‌క్ష‌ణం కేసులు న‌మోదు చేయాల‌ని కృష్ణాజిల్లా ఎస్పీని రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ఆదేశించారు.  దీంతో రంగంలోకి దిగిన వైసీపీ సీనియ‌ర్ నాయ‌కులు, మంత్రులు .. అస‌లు రాత్రికి రాత్రి ఏం జ‌రిగింది? అనే విష‌యంపై దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. కొడాలిపై కేసులు న‌మోదు చేసేలా ఆదేశాలు ఇవ్వ‌డం వెనుక‌.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఉన్నార‌ని నాయ‌కులు ప్రాథ‌మికంగా నిర్ధారించుకున్న‌ట్టు స‌మాచారం. వాస్త‌వానికి నాని.. ఎప్పుడూ చేసే విమ‌ర్శ‌లే చేశార‌ని.. వాటిలో కొత్త‌వి ఏమీ లేవ‌ని.. నాయ‌కులు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు.

అయినా.. కొడాలిపై క్రిమిన‌ల్ కేసులు పెట్ట‌డం అంటే.. ఖ‌చ్చితంగా బాబు హ‌స్తం ఉండి ఉంటుంద‌ని అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఆదిశ‌గానే వైసీపీ నాయ‌కులు దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలో వ్యూహాత్మ‌కంగా ఎస్ ఈసీని , చంద్ర‌బాబును కూడా ఇరికించేలా ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. అది ఎలా? అనే విష‌యం తేలాల్సి ఉంది.




టీమిండియాకు షాక్.. 67 ఏళ్ల భారత్ రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్

షాకింగ్ రోల్ లో శ్రియ...తట్టుకోగలరా..?

బాబు వైఖ‌రి ఇలా ఉంటే క‌ష్ట‌మే.. త‌ల ప‌ట్టుకుంటోన్న త‌మ్ముళ్లు ?

జగడ్డ: వైసీపీ కంచు కోటలు బద్దలు.. సీన్ మారుతోందా..?

కడుపుతో ఉన్నా కూడా తుపాకి పట్టింది..గుండెలు కదిలించే కథ

రేవంత్ రెడ్డి హఠాత్తుగా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు ?.. అసలు కారణం అదేనా..?

స్టార్ హీరోలను ఢీ కొట్టిన కమెడియన్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>