PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/latest-news59b89201-acf8-4f24-a23c-d2aa7dd2aadd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/latest-news59b89201-acf8-4f24-a23c-d2aa7dd2aadd-415x250-IndiaHerald.jpgస్టీల్‌ప్లాంట్‌ ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించినదని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంకెల గారడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రజలు వైసీపీకి మంచి ఫలితాలు ఇచ్చారన్నారు. మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ఇక టి‌డి‌పి నేత మాజీ మంత్రి నారా లోకేష్ సి‌ఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడే ధైర్యం లేదని ద్వజమెత్తారు. latest news;lokesh;tara;jagan;nara lokesh;botcha satyanarayana;steel plant;telugu;vishakapatnam;panchayati;chief minister;minister;letter;tdp;central government;ycp;lokesh kanagarajస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తో కొనసాగుతున్న వేడి.. విమర్శల దాడి !!స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తో కొనసాగుతున్న వేడి.. విమర్శల దాడి !!latest news;lokesh;tara;jagan;nara lokesh;botcha satyanarayana;steel plant;telugu;vishakapatnam;panchayati;chief minister;minister;letter;tdp;central government;ycp;lokesh kanagarajSun, 14 Feb 2021 21:42:19 GMT కలగజేసుకుని పంత్‌కి సర్దిచెప్పాడు కేంద్రం ప్రకటించిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంతో ఒక్క సరిగా రాష్ట్రం లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. కేంద్ర నిర్ణయాన్ని ప్రజలతో సహ అన్నీ రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్ర నిర్ణయంతో రాజకీయ వేడి కొనసాగుతుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చుట్టూ ప్రధాన రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలతో, ఘాటు వ్యాఖ్యలతో రాజకీయ వేడి తార స్థాయికి చేరుతుంది. కేంద్రం ప్రకటించిన స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఎంపీలు స్టీల్‌ప్లాంట్‌ నిర్ణయంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌‌షాను కలిశారని చెప్పారు.

స్టీల్‌ప్లాంట్‌ ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించినదని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంకెల గారడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రజలు వైసీపీకి మంచి ఫలితాలు ఇచ్చారన్నారు. మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ఇక టి‌డి‌పి నేత మాజీ మంత్రి నారా లోకేష్ సి‌ఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడే ధైర్యం లేదని ద్వజమెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు టి‌డి‌పి పూర్తిగా వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు చేపట్టిన నిరాహార దీక్షకు లోకేష్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా లోకేష్ సి‌ఎం జగన్ పై ఘాటు విమర్శలు చేశారు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉండి జగన్ ప్రభుత్వం ఏం సాధించిందని లోకేష్ ప్రశ్నించారు. గాడిదలు కాస్తున్నారా? అని ఎద్దేవా చేశారు. బుల్లెట్ లేని గన్.. జగన్ అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. మొత్తానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కేంద్ర నిర్ణయం చుట్టూ ప్రధాన రాజకీయ పార్టీల మద్య విమర్శల రగడ కొనసాగుతుంది..


రామ్ ఆ కొలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడా?

స్టార్ హీరో అయ్యాక అబ్బాస్ పెట్రోల్ బంక్ లో ఎందుకు పని చేయాల్సి వచ్చింది

మూడు వారాల గ్యాప్ లో ... మూడు సునామీలు ....బాక్సాఫీస్ రచ్చ రచ్చే .... ??

RC15 కి మ్యూజిక్ డైరెక్టర్ అతనేనా?

హమ్మా.. మళ్లీ మెగాస్టార్ సరసన ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందిగా..

జగడ్డ: కృష్ణా జిల్లాలో రగడ దేనికి సంకేతం...?

హీరోయిన్ కాబోతున్న తెలుగు టిక్ టాక్ స్టార్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>