PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/education/virgo_virgo/jobs-in-reserve-bank-of-india9b302bfc-c0be-45d6-950b-73b94572afe1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/education/virgo_virgo/jobs-in-reserve-bank-of-india9b302bfc-c0be-45d6-950b-73b94572afe1-415x250-IndiaHerald.jpgనిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి, తగిన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోంది. అయితే కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఐటీసీ ఎంఎస్‌కే పేస్ ఫౌండేషన్, ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్‌తో కలసి ఇలా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. నిరుద్యోగ యువతకు ప్రధానంగా ఎలక్ట్రికల్, బ్యూటీషియన్ వంటి క్రేజీ కోర్సులలో రెండు నెలల పాటు శిక్షణను ఇస్తోంది. ఇక ఈ రెండు నెలల ఉచిత శిక్షణ అనంతరం వారికి సర్టిఫికెట్ అందించి.. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తోంది. youth;education;naresh;kumaar;allari naresh;naga chaitanya;sunil;district;degree;central government;bhadradri;aadhar;chaitanya 1;uppalనిరుద్యోగ యువతకు శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శ్రీకారం చుట్టిన ఐటీసీ....నిరుద్యోగ యువతకు శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శ్రీకారం చుట్టిన ఐటీసీ....youth;education;naresh;kumaar;allari naresh;naga chaitanya;sunil;district;degree;central government;bhadradri;aadhar;chaitanya 1;uppalSun, 14 Feb 2021 22:45:00 GMTగ్రామీణ ప్రాంతాల్లోని యువతీ యువకులు పై చదువులు చదువుకునే స్థోమత లేక అలాగే కుటుంబ పోషణ బాధ్యతలు వంటి వివిధ కారణాల కారణంగా తమ చదువును మధ్యలోనే ఆపేయడం చూస్తూనే ఉన్నాం. వారి సమస్యలు ఎలాంటివి అయినా కూడా చదువును మాత్రం మధ్యలోనే ఆపేయటంతో ఈ అరకొర చదువుల కారణంగా ఎలాంటి గౌరవప్రదమైన ఉద్యోగావకాశాలు దక్కించుకోలేక మరింత వెనుకబాటుకు గురవుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా అలాంటి నిరుద్యోగ యువతరం కోసం ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ అయినటువంటి ఐటీసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.



ఈ వినూత్న కార్యక్రమంలో భాగంగా ఐటీసీ.. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి, తగిన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోంది. అయితే కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఐటీసీ ఎంఎస్‌కే పేస్ ఫౌండేషన్, ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్‌తో కలసి ఇలా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. నిరుద్యోగ యువతకు ప్రధానంగా ఎలక్ట్రికల్, బ్యూటీషియన్ వంటి క్రేజీ కోర్సులలో రెండు నెలల పాటు శిక్షణను ఇస్తోంది. ఇక ఈ రెండు నెలల ఉచిత శిక్షణ అనంతరం వారికి సర్టిఫికెట్ అందించి.. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తోంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని యువతీయువకులు వీటికి సంబంధించిన శిక్షణా కేంద్రంలో చేరవచ్చని ట్రైనింగ్ సెంటర్ ప్రతినిధి ఆర్‌.ఉప్పల్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, బూర్గంపాడులో శిక్షణ కేంద్రాలు ఉన్నాయని.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంప్రదించవచ్చని తెలియజేశారు.




భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని యువతలో చైతన్యం నింపేందుకు.. శిక్షణ కార్యక్రమాలను వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు సహకరించాలని కోరుతూ ట్రైనింగ్ సెంటర్ ఇన్‌చార్జి నరేష్ కుమార్ నటేషన్, ఆర్.ఉప్పల్ జిల్లా ఎస్పీ సునీల్ దత్‌ని కలిశారు. ఉచిత వసతి సదుపాయాలు కల్పించడంతో పాటు ఉచిత శిక్షణ అందజేస్తామని.. వంద శాతం ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలియజేశారు. అదనంగా స్పోకెన్ ఇంగ్లీష్, సాఫ్ట్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్ నేర్పిస్తారు. ప్రతి నెలా 15 వ తేదీ నుంచి 1వ తేదీ వరకు అడ్మిషన్స్ నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు 97015 91483, 83412 57200 నంబర్లలో సంప్రదించాలని తెలియజేశారు.

అర్హతలు..

1. కనీసం 18 సంవత్సరాల నుంచి 30 ఏళ్లలోపు వారు
2. ఎనిమిదో తరగతి, నుంచి డిగ్రీ (ఏదైనా పాస్/ఫెయిల్)
3. ఆధార్ కార్డ్ జిరాక్స్, స్టడీ సర్టిఫికెట్
4. అడ్మిషన్ ఫీజు లేదు




పూర్తి స్థాయిలో రైళ్ల పునరుద్ధరణ విషయమై స్పష్టతనిచ్చిన రైల్వే శాఖ...

స్టార్ హీరో అయ్యాక అబ్బాస్ పెట్రోల్ బంక్ లో ఎందుకు పని చేయాల్సి వచ్చింది

మూడు వారాల గ్యాప్ లో ... మూడు సునామీలు ....బాక్సాఫీస్ రచ్చ రచ్చే .... ??

RC15 కి మ్యూజిక్ డైరెక్టర్ అతనేనా?

హమ్మా.. మళ్లీ మెగాస్టార్ సరసన ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందిగా..

జగడ్డ: కృష్ణా జిల్లాలో రగడ దేనికి సంకేతం...?

హీరోయిన్ కాబోతున్న తెలుగు టిక్ టాక్ స్టార్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>