Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/narendra-modib8330095-c0b5-43de-9116-3a340afea1a7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/narendra-modib8330095-c0b5-43de-9116-3a340afea1a7-415x250-IndiaHerald.jpgభారత సైన్యం యుద్ధ సామర్థ్యం నానాటికీ పెరిగుతోంది. యుద్ధ విమానాలు, తుపాకులతో పాటు ఇప్పుడు తాజాగా సరికొత్త యుద్ధ ట్యాంకులను కూడా ఆర్మీ అమ్ములపోదిలోకి చేరాయి. అవే సరికొత్త టెక్నాలజీలతో అప్‌గ్రేడ్ చేసిన అర్జున్ ట్యాంకులు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ యుద్ధ ట్యాంకులను ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణేకు అప్పగించారు. చెన్నైలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ స్టేడియం..narendra modi;arjuna;narendra modi;prime minister;chennai;army;arjun 1;narendraసైన్యంలోకి ప్రపంచ స్థాయి ఆయుధం.. ఆర్మీకి అందించిన మోదీ..!సైన్యంలోకి ప్రపంచ స్థాయి ఆయుధం.. ఆర్మీకి అందించిన మోదీ..!narendra modi;arjuna;narendra modi;prime minister;chennai;army;arjun 1;narendraSun, 14 Feb 2021 16:28:14 GMTఇంటర్నెట్ డెస్క్: భారత సైన్యం యుద్ధ సామర్థ్యం నానాటికీ పెరిగుతోంది. యుద్ధ విమానాలు, తుపాకులతో పాటు ఇప్పుడు తాజాగా సరికొత్త యుద్ధ ట్యాంకులను కూడా ఆర్మీ అమ్ములపోదిలోకి చేరాయి. అవే సరికొత్త టెక్నాలజీలతో అప్‌గ్రేడ్ చేసిన అర్జున్ ట్యాంకులు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ యుద్ధ ట్యాంకులను ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణేకు అప్పగించారు. చెన్నైలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. తేజస్‌ తర్వాత ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద భారత దళాలకు అందిన మరో అతిపెద్ద ఆయుధంగా ఈ అర్జున్‌ మార్క్‌1ఏ యుద్ధ ట్యాంకు నిలిచింది.

ఇప్పటికే సైన్యంలో అర్జున్‌(ఎంబీటీ) యుద్ధ ట్యాంకులు సేవలు అందిస్తున్నా.. వీటికి అనేక మార్పులు చేసి తిరిగి సైన్యానికి అందించారు. ప్రభుత్వ నివేదికల ప్రకారం.. దాదాపు 71 చిన్న, పెద్ద మార్పులను ఈ ట్యాంకులకు చేసి అప్‌డేటెడ్‌ వెర్షన్‌గా సైన్యానికి అందించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ అప్‌డేషన్ల కారణంగా అర్జున మార్క్1ఏ యుద్ధ ట్యాంకు ప్రపంచ స్థాయి ఆయుధాలతో పోటీపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

అర్జున మార్క్1ఏ ట్యాంక్‌ నుంచి ప్రయోగించే తూటాలు(మందుగుండు)కూడా ఎంతో ప్రత్యేకమైనవని, దీని తూటా లక్ష్యాన్ని చేరుకోగానే అక్కడి ఆక్సిజన్‌ను పూర్తిగా వినియోగించుకొని పేలుతుందని, అంతేకాకుండా లక్ష్యాన్ని చేరుకోగానే విస్ఫోటం చెందేలా వీటిని డిజైన్ చేయడం జరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిల్లో పేటెంట్‌ పొందిన టెక్నాలజీనే అత్యధికంగా వినియోగించామని, ఈ ట్యాంక్‌ ఆత్మరక్షణ వ్యవస్థ కూడా చాలా బలంగా ఉందని నిపుణులు తెలిపారు.

ఈ ట్యాంక్‌ గన్‌లో లక్ష్యాన్ని ఆటోమేటిక్‌గా ట్రాక్‌ చేసే ప్రత్యేక వ్యవస్థ కూడా ఉన్నట్లు తెలిపారు. వేగంగా కదులుతున్న లక్ష్యాలను కూడా ఈ ట్యాంక్‌ సులభంగా పేల్చివేయగలదని, ట్యాంక్‌ వేగంగా ప్రయాణిస్తూ కూడా ఇతర లక్ష్యాలను గుర్తించి ధ్వంసం చేయగలదని చెబుతున్నారు. కంప్యూటర్‌లోని ఇంటిగ్రేటెడ్‌ ఫైర్‌ కంట్రోల్‌ వ్యవస్థ ట్యాంక్‌ గన్‌ను నియంత్రిస్తుందని, రాత్రి, పగలు తేడా లేకుండా లక్ష్యాలను సులభంగా గుర్తించగలిగే వ్యవస్థను ఈ ట్యాంక్‌లో అమర్చామని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఇదిలా ఉంటే ఈ అర్జున మార్క్1ఏ యుద్ధ ట్యాంకులకు భవిష్యత్తు యుద్ధ తంత్రానికి చెందిన వ్యవస్థలను అమర్చి అప్‌గ్రేడ్ చేసినట్లు తెలుస్తోంది. వీటిని హంటర్‌ కిల్లర్స్‌ అని కూడా పిలుస్తున్నారు. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో అర్జున మార్క్1ఏ ట్యాంక్ స్థిరంగా పనిచేయగలదు. ఇది దాదాపు 68 టన్నుల బరువు ఉంటుంది. 120 ఎంఎం రౌండ్స్‌ వినియోగించే గన్‌ను దీనికి అమర్చారు. పాత ట్యాంక్‌కు సరికొత్త అప్‌గ్రేడేషన్లన్నీ డీఆర్‌డీవో చెన్నై విభాగంలోని కాంబాట్‌ వెహికల్స్‌ రీసెర్చి అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌(సీవీఆర్డీఈ) చేసినట్లు తెలుస్తోంది.


హమ్మా.. మళ్లీ మెగాస్టార్ సరసన ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందిగా..

జగడ్డ: కృష్ణా జిల్లాలో రగడ దేనికి సంకేతం...?

హీరోయిన్ కాబోతున్న తెలుగు టిక్ టాక్ స్టార్

సింగర్ సునీతను రామ్ రెండో పెళ్లికి ఎలా ఒప్పించాడో తెలుసా..??

హమ్మా..ఈ తెలుగు అందం మెల్లిగా సెటిల్ అయిపోతుందిగా.?

షాకింగ్ రోల్ లో శ్రియ...తట్టుకోగలరా..?

బాబు వైఖ‌రి ఇలా ఉంటే క‌ష్ట‌మే.. త‌ల ప‌ట్టుకుంటోన్న త‌మ్ముళ్లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>