PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-mohan-reddya60b1e15-fc51-428d-a6a4-8ae2a3d718aa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-mohan-reddya60b1e15-fc51-428d-a6a4-8ae2a3d718aa-415x250-IndiaHerald.jpgవాస్త‌వానికి రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరిగిన నేపథ్యంలో ఆయా ఘ‌ట‌న‌ల‌పై సీఎం జ‌గ‌న్ ఒక్క‌సారి కూడా పెద‌వి విప్ప‌లేదు. పైగా ప‌ట్టించుకోను కూడా లేదు. ఎక్క‌డ ఏం జ‌రిగినా.. ఆయ‌న మౌనం పాటించారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఒకేసారి మూడు జిల్లాల్లో సీఎం ఆధ్యాత్మిక పర్యటన చేపట్టడం గ‌మ‌నార్హం. విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో ఉత్సవ రథంపై మూడు వెండి సింహాలు మాయమవడం, అంతర్వేదిలో నృసింహస్వామి ఆలయ రథం దగ్ధమవడం, విజయనగరం జిల్లాలోని రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం తలను వేరుచేయడంతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా అనేక ఆలయాల్లో jagan mohan reddy;prema;ramu;tiru;godavari river;east;east godavari;vishakapatnam;chief minister;love;silver;letter;rama tirthaసీఎం జ‌గ‌న్‌కు ఆల‌యాల‌పై ఆక‌స్మిక ప్రేమ పుట్టిందా... వెనక ఏం జ‌రుగుతోంది ?సీఎం జ‌గ‌న్‌కు ఆల‌యాల‌పై ఆక‌స్మిక ప్రేమ పుట్టిందా... వెనక ఏం జ‌రుగుతోంది ?jagan mohan reddy;prema;ramu;tiru;godavari river;east;east godavari;vishakapatnam;chief minister;love;silver;letter;rama tirthaSun, 14 Feb 2021 12:23:00 GMTసీఎం జ‌గ‌న్‌కు ఆల‌యాల‌పై ఆక‌స్మిక ప్రేమ పుట్టిందా?   వరుసగా ఆయ‌న‌ మూడు రోజులపాటు మూడు జిల్లాల్లోని ప్ర‌ముఖ ఆల‌యా ల‌ను, మ‌ఠాల‌ను కూడా సంద‌ర్శించ‌నున్న నేప‌థ్యంలో అంద‌రికీ ఇదే సందేహం క‌లుగుతుండ‌డం గ‌మ‌నార్హం.  ఈ నెల 17న విశాఖలో సీఎం పర్యటిస్తారు. విశాఖ శ్రీశార దా పీఠం వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొంటారు. ఈ నెల 18న తిరుపతికి వెళతారు. శ్రీవారి ద‌ర్శించుకుంటా రు. 19న తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేదికి వెళతారు. అంతర్వేదిలో నృసింహస్వామి ఆలయ రథం సిద్ధం కావడంతో దాన్ని సీఎం పరిశీలిస్తారు. అదే స‌మ‌యంలో దీనిని ప్రారంభించే అవ‌కాశం ఉంది.

ఇలా ముఖ్యమంత్రి జ‌గ‌న్ వ‌రుస‌గా ఆల‌యాల సంద‌ర్భన చేస్తుండడంతో దీని వెనుక రాజ‌కీయ కోణం ఉంద‌నే సందేహాలు తెర‌మీదికి వ‌చ్చాయి. వాస్త‌వానికి రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరిగిన నేపథ్యంలో ఆయా ఘ‌ట‌న‌ల‌పై సీఎం జ‌గ‌న్ ఒక్క‌సారి కూడా పెద‌వి విప్ప‌లేదు. పైగా ప‌ట్టించుకోను కూడా లేదు. ఎక్క‌డ ఏం జ‌రిగినా.. ఆయ‌న మౌనం పాటించారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఒకేసారి మూడు జిల్లాల్లో సీఎం ఆధ్యాత్మిక పర్యటన చేపట్టడం గ‌మ‌నార్హం.

విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో ఉత్సవ రథంపై మూడు వెండి సింహాలు మాయమవడం, అంతర్వేదిలో నృసింహస్వామి ఆలయ రథం దగ్ధమవడం, విజయనగరం జిల్లాలోని రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం తలను వేరుచేయడంతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా అనేక ఆలయాల్లో దాడులు జరిగాయి.  ఈ నేప‌థ్యంలో తాజాగా ముఖ్య‌మంత్రి నిర్ణ‌యించుకున్న ఈ ప‌ర్య‌ట‌న‌ల వెనుక రాజ‌కీయ కోణం ఖ‌చ్చితంగా ఉండి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీలకులు. త్వ‌ర‌లోనే అంటే.. వ‌చ్చే నెల‌లోనే క‌ర్పొరేష‌న్‌ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

అవ‌న్నీ.. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలే కావ‌డంతో.. ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షిం చేందుకు జ‌గ‌న్ ఇలా చేస్తున్నారని అంటున్నారు ప‌రిశీల‌కులు. జ‌గ‌న్ వ‌రుస ప‌ర్య‌ట‌న‌లు.. ఆల‌యాల‌పై ఆక‌స్మిక ప్రేమ వంటివి హిందూ సామాజిక వ‌ర్గాన్ని ఆక‌ర్సించ‌డంతోపాటు.. న‌గ‌ర‌, ప‌ట్ట‌ణ ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసేందుకునేన‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఏదేమైనా కార‌ణం లేకుండా జ‌గ‌న్ ఇలాంటి ప‌ర్య‌ట‌న‌లు పెట్టుకునే అవ‌కాశం లేద‌ని మాత్రం తెలుస్తోంది.  


టీమిండియాకు షాక్.. 67 ఏళ్ల భారత్ రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్

షాకింగ్ రోల్ లో శ్రియ...తట్టుకోగలరా..?

బాబు వైఖ‌రి ఇలా ఉంటే క‌ష్ట‌మే.. త‌ల ప‌ట్టుకుంటోన్న త‌మ్ముళ్లు ?

జగడ్డ: వైసీపీ కంచు కోటలు బద్దలు.. సీన్ మారుతోందా..?

కడుపుతో ఉన్నా కూడా తుపాకి పట్టింది..గుండెలు కదిలించే కథ

రేవంత్ రెడ్డి హఠాత్తుగా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు ?.. అసలు కారణం అదేనా..?

స్టార్ హీరోలను ఢీ కొట్టిన కమెడియన్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>