SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/lord-tirumala-details4b73d007-f842-4445-9f61-d0e640b046e0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/lord-tirumala-details4b73d007-f842-4445-9f61-d0e640b046e0-415x250-IndiaHerald.jpgకరోనా తగ్గుముఖం పట్టిన క్రమంలో ఇప్పుడిప్పుడే దర్శన నిమిత్తం భక్తుల సంఖ్యను పెంచుతున్నారు. సూర్య జయంతి సందర్భంగా ఈనెల 19న శ్రీవారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) రథ సప్తమి ఉత్సవాన్ని నిర్వహించబోతోంది. ఆ రోజు శ్రీ మలయప్ప స్వామి 7 వాహనాలపై ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.lord tirumala details;darshana;jayanthi;surya sivakumar;tiru;varsha;yajamanya;tirupati;sri venkateswara swamy;husband;good news;irctc;good newwz;tirumala tirupathi devasthanam;jayamఆధ్యాత్మికం: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్...?ఆధ్యాత్మికం: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్...?lord tirumala details;darshana;jayanthi;surya sivakumar;tiru;varsha;yajamanya;tirupati;sri venkateswara swamy;husband;good news;irctc;good newwz;tirumala tirupathi devasthanam;jayamSun, 14 Feb 2021 06:00:00 GMTటీటీడీ యాజమాన్యం. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టిన క్రమంలో భక్తులపై వరాల వర్షం కురిపిస్తోంది. ఇటీవలే నూతన దేవాలయాలు ఆవిష్కరణ గురించి శుభవార్త చెప్పిన టిటిడి ఇప్పుడు మరో గుడ్ న్యూస్ అందించింది. తిరుమలలో ఉత్సవాలు వేడుకల మాట అటుంచితే... సాధారణ రోజుల్లోనూ భక్తుల రద్దీ భారీగానే ఉంటుంది. శ్రీవారి దర్శనం కోసం ఎక్కడ ఎక్కడ నుంచో వేలాది జనం తరలివస్తారు. అలాంటిది ఈ కరోనా మహమ్మారి కారణంగా వీటన్నింటికీ అడ్డుకట్ట పడింది. భక్తజనులతో కలసి మహోత్సవాలు జరపడం సరికదా... ఆ శ్రీనివాసుని దర్శనం కోసం వచ్చే భక్తజనుల రద్దీని పరిమిత సంఖ్యకు తగ్గించారు.

కరోనా తగ్గుముఖం పట్టిన క్రమంలో ఇప్పుడిప్పుడే దర్శన నిమిత్తం భక్తుల సంఖ్యను పెంచుతున్నారు. సూర్య జయంతి సందర్భంగా ఈనెల 19న శ్రీవారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) రథ సప్తమి ఉత్సవాన్ని నిర్వహించబోతోంది. ఆ రోజు శ్రీ మలయప్ప స్వామి 7 వాహనాలపై ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి భక్తులకు అనుమతి ఇవ్వక పోయినప్పటికీ.... ఆ శ్రీనివాసుని దర్శన భాగ్యం కొరకు ఎదురు చూసే భక్తులకు తీపి కబురు లభించింది. కరోనా తీవ్రత తగ్గిన నేపథ్యంలో రోజూ స్వామి వారి సర్వదర్శనం టికెట్ల సంఖ్యను పెంచింది టీటీడీ. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.

అయితే ఇక్కడ టిటిడి అందించిన పెద్ద శుభవార్త ఏమిటంటే....తిరుపతి వెళ్లే శ్రీవారి భక్తులకు ఒకరోజు తిరుపతి టూర్ ప్యాకేజీ ఐఆర్‌సీటీసీ ప్రకటించిన టీటీడీ. తిరుమల వెళ్లే భక్తులకు శ్రీవారి దర్శనం చేస్తుందన్నమాట ఐఆర్‌సీటీసీ. డివైన్ బాలాజీ దర్శన్ పేరుతో ఈ ప్యాకేజీని అందిస్తున్నారు. ఇది ఒక రోజు టూర్ ప్యాకేజీ మాత్రమే. ఈ ప్యాకేజీ ప్రతీ రోజు అందుబాటులో ఉంచనున్నారు. ఒక రోజులోనే దర్శనం పూర్తి చేసుకొని తిరిగి వెళ్లాలనుకుంటే వారికి ఈ ప్యాకేజీ ఉపయోగకరంగా ఉంటుంది. భక్తులు తప్పనిసరిగా ఒరిజినల్ ఐడీ కార్డు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీ ద్వారా భక్తులకు ఒకరోజు శ్రీవారి దర్శన సదుపాయాలు కల్పిస్తుంది. అయితే ఇక్కడ ఎటువంటి వసతులు ఉండవని తెలిపింది.


ఫిబ్ర‌వ‌రి 14వ విశిష్ఠ‌త అదే...అందుకే ఈరోజుకు అంత ప్ర‌త్యేక‌త‌..

రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...

వ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

కొడాలి ఇలాకాలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ... వింత గెలుపు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>