MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipsd93cd168-c002-4c8a-bd90-69edf2e89700-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipsd93cd168-c002-4c8a-bd90-69edf2e89700-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ తనకు బాగా అచ్చొచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నాడు. సింహా లెజెండ్ లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండడంతో అటు ప్రేక్షకులతో పాటు ఇటు సినీ వర్గాల్లో కూడా ఈ సినిమా మీద ఆసక్తి నెలకొంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే ప్రతి సినిమాకి బోయపాటి స్ట్రాటజీ ఫాలో అవుతూ ఉంటాడు. అదేమంటే ఒక లీడింగ్ హీరోయిన్ ని పెట్టి ఒక అప్ కమింగ్ హీరోయిన్ ని లేదా ఫేడవుట్ అయిన హీరోయిన్ ని పెడుతూ ఉంటాడు. బాలయ్యతో గతంలboyapati;balakrishna;sneha ullal;sonal chauhan;boyapati srinu;geetha;namitha;nayantara;poorna;radhika;simhaa;thaman s;cinema;sangeetha;telugu;nandamuri balakrishna;producer;producer1;heroine;allu sneha;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;legend;simha;yashasvi jaiswalబీబీ 3 కి ఆ విషయంలో ఫెయిల్ అయిన బోయపాటిబీబీ 3 కి ఆ విషయంలో ఫెయిల్ అయిన బోయపాటిboyapati;balakrishna;sneha ullal;sonal chauhan;boyapati srinu;geetha;namitha;nayantara;poorna;radhika;simhaa;thaman s;cinema;sangeetha;telugu;nandamuri balakrishna;producer;producer1;heroine;allu sneha;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;legend;simha;yashasvi jaiswalSun, 14 Feb 2021 13:00:00 GMTనందమూరి బాలకృష్ణ తనకు బాగా అచ్చొచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నాడు. సింహా లెజెండ్ లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండడంతో అటు ప్రేక్షకులతో పాటు ఇటు సినీ వర్గాల్లో కూడా ఈ సినిమా మీద ఆసక్తి నెలకొంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే ప్రతి సినిమాకి బోయపాటి స్ట్రాటజీ ఫాలో అవుతూ ఉంటాడు. అదేమంటే ఒక లీడింగ్ హీరోయిన్ ని పెట్టి ఒక అప్ కమింగ్ హీరోయిన్ ని లేదా ఫేడవుట్ అయిన హీరోయిన్ ని పెడుతూ ఉంటాడు. 

బాలయ్యతో గతంలో తీసిన సింహ సినిమాకి వస్తే అందులో నయనతార లీడ్ హీరోయిన్ గా ఉండగా నమిత, స్నేహ ఉల్లాల్ ఇద్దరిని కూడా నటింప చేశారు. ఇక్కడ నయనతార క్రేజ్ వున్న హీరోయిన్గా గా మిగతా ఇద్దరూ అప్పటికే ఫేడవుట్ అయిపోయిన హీరోయిన్స్. లెజెండ్ సినిమా విషయానికి వచ్చినా సరే అందులో రాధిక ఆప్టే సోనాల్ చౌహాన్ ఇద్దరినీ ఫిమేల్ లీడ్స్ గా తీసుకున్నాడు. ఒక రకంగా అప్పటికి రాధిక ఆప్టే తెలుగులో మంచి సినిమాలు చేస్తూ ఫామ్ లో ఉంది. అయితే ఈ సినిమాకి అలా ఒక లీడింగ్ హీరోయిన్ తీసుకోవడానికి బోయపాటి చాలా ప్రయత్నాలు చేసినా అవేవి వర్కవుట్ కాలేదు. 

ప్రస్తుతం బాలయ్యతో బోయపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలయ్య ప్రజ్ఞా జైస్వాల్ అలాగే పూర్ణ ఇద్దరితో కలిసి నటించనున్నారు. బోయపాటి స్టార్ హీరోయిన్ ను నటింపజేసేందుకు ఆమెను చూసిన ఎవరు బాలయ్య తో సినిమా చేయడానికి ప్రస్తుతానికి రెడీగా లేరు.  పోనీ ఎవరో ఒక హీరోయిన్ చేత ఐటెం సాంగ్ చేయించాలన్నా బడ్జెట్ భారీగా పెరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు నిర్మాత అంత బడ్జెట్ పెట్టలేనని చెప్పేస్తున్నాడు. సో ఈ విషయంలో బోయపాటి కాస్త అసంతృప్తిగానే ఉన్నాడని అంటున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.




టీమిండియాకు షాక్.. 67 ఏళ్ల భారత్ రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్

షాకింగ్ రోల్ లో శ్రియ...తట్టుకోగలరా..?

బాబు వైఖ‌రి ఇలా ఉంటే క‌ష్ట‌మే.. త‌ల ప‌ట్టుకుంటోన్న త‌మ్ముళ్లు ?

జగడ్డ: వైసీపీ కంచు కోటలు బద్దలు.. సీన్ మారుతోందా..?

కడుపుతో ఉన్నా కూడా తుపాకి పట్టింది..గుండెలు కదిలించే కథ

రేవంత్ రెడ్డి హఠాత్తుగా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు ?.. అసలు కారణం అదేనా..?

స్టార్ హీరోలను ఢీ కొట్టిన కమెడియన్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>