PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పునరాలోచనలో పడాల్సిన అవసరం వచ్చింది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రధానంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయమై ఆయన అప్పులు చేసి మరీ రాష్ట్ర ప్రజలకు డబ్బులు ఇస్తున్నారు అని ఆరోపణలు ఎప్పటినుంచొ వినబడుతున్నాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు సంక్షేమ కార్యక్రమాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. గతంలో తాను అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీనివలన చాలామందికి నష్టం జరys jagan;cbn;amala akkineni;manu;jagan;andhra pradesh;chief minister;local language;central government;ycp;partyచంద్రబాబు ఫిర్యాదు... జగన్ సంచలన నిర్ణయం తీసుకుంటారా...?చంద్రబాబు ఫిర్యాదు... జగన్ సంచలన నిర్ణయం తీసుకుంటారా...?ys jagan;cbn;amala akkineni;manu;jagan;andhra pradesh;chief minister;local language;central government;ycp;partySun, 14 Feb 2021 12:07:30 GMTఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పునరాలోచనలో పడాల్సిన అవసరం వచ్చింది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రధానంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయమై ఆయన అప్పులు చేసి మరీ రాష్ట్ర ప్రజలకు డబ్బులు ఇస్తున్నారు అని ఆరోపణలు ఎప్పటినుంచొ వినబడుతున్నాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు సంక్షేమ కార్యక్రమాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. గతంలో తాను అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.

దీనివలన చాలామందికి నష్టం జరుగుతుందని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయంలో చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్రంలో ఆర్థికంగా చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయని అప్పులు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం వలన భవిష్యత్తులో ఏ ప్రభుత్వాలు ఏర్పడిన సరే మనుగడ సాగించడం చాలా కష్టంగా ఉంటుంది అని కేంద్రం పెద్దలు దృష్టికి వివరాలతో సహా తీసుకెళ్లి ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.

అయితే ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో పునరాలోచనలో పడినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది అనే విషయాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి జగన్ కొన్ని కీలక సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజలకు డబ్బులు ఇచ్చి తన వైపు తిప్పుకోవాలని భావించిన ముఖ్యమంత్రి జగన్ కు స్థానిక సంస్థల ఎన్నికలు ఊహించని దెబ్బ కొట్టాయి. దీంతో ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ లో కూడా ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. పార్టీ సీనియర్ నేతలతో కూడా త్వరలోనే ఆయన సమావేశం కానున్నారు. చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే మాత్రం ఈసారి కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమికి భారతీయ జనతాపార్టీ కూడా విస్మయం వ్యక్తం చేసింది. కాబట్టి వైసీపీని పక్కన పెట్టే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు.



మెగాస్టార్ చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం సినిమాలో, బాలనటిగా నటించింది అమ్మాయా.. అబ్బాయా..

కడుపుతో ఉన్నా కూడా తుపాకి పట్టింది..గుండెలు కదిలించే కథ

రేవంత్ రెడ్డి హఠాత్తుగా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు ?.. అసలు కారణం అదేనా..?

స్టార్ హీరోలను ఢీ కొట్టిన కమెడియన్...?

అప్పట్లో కన్నీళ్లు తెప్పించి, కాసుల వర్షం కురిపించిన సినిమా ఏంటో తెలుసా...!

నిహారిక పెళ్ళితో సాయి ధరమ్ తేజ్ కు ఒత్తిడి !

ఎడిటోరియల్: “కోవిడ్ వ్యాక్సీన్” కోసం భారత్ ను ఎందుకు సంప్రదించ లేదు? కెనడా మంత్రి అనితా ఆనంద్ ను ప్రశ్నించిన ఎంపి వార్నర్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>