PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid19-covaxina8a21cc8-a911-43fa-84e0-24ebda1d2b58-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid19-covaxina8a21cc8-a911-43fa-84e0-24ebda1d2b58-415x250-IndiaHerald.jpgఇండియాలో కవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను ఫ్రంట్ లైన్ కార్యకర్తలకు అందిస్తున్నారు. ఈ రెండు టీకాలూ సురక్షితమైనవేనని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేస్తుండగా, వైద్యుల్లోనే టీకా పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తాజాగా హైదరాబాద్ నిమ్స్ లో కలకలం రేగింది.కరోనావ్యాక్యిన్ ను తీసుకున్న 20 రోజుల తరువాత.. ఇద్దరు ప్రముఖ వైద్యులకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. covid19 covaxin;hyderabad;doctor;central governmentటీకా తీసుకున్న డాక్టర్లకు కోవిడ్! నిమ్స్ లో కలకలంటీకా తీసుకున్న డాక్టర్లకు కోవిడ్! నిమ్స్ లో కలకలంcovid19 covaxin;hyderabad;doctor;central governmentSun, 14 Feb 2021 10:31:34 GMTకేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేస్తుండగా, వైద్యుల్లోనే టీకా పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

తాజాగా హైదరాబాద్ నిమ్స్ లో కలకలం రేగింది. కరోనావ్యాక్యిన్ ను తీసుకున్న 20 రోజుల తరువాత.. ఇద్దరు ప్రముఖ వైద్యులకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది.  నిమ్స్ కు చెందిన ఓ రెసిడెంట్ డాక్టర్ కు, ఉస్మానియాకు చెందిన పీజీ విద్యార్థికీ కరోనా సోకింది. వీరిద్దరూ దాదాపు 20 రోజుల క్రితం కరోనా టీకా తొలి డోస్  తీసుకున్నారు.

 అయితే ఇద్దరు వైద్యులకు కరోనా సోకిన విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. టీకా తీసుకున్న తరువాత వీరిద్దరూ తమకు వైరస్ సోకదన్న ధీమాతో మాస్క్ ధరించలేదని, భౌతిక దూరం పాటించడం, చేతులను శానిటైజ్ చేసుకోవడం వంటి నిబంధనలు పాటించలేదని, ఈ కారణంగానే వైరస్ సోకిందని ఉన్నతాధికారులు వెల్లడించారు. వారిద్దరి పేర్లను మాత్రం బహిర్గతం చేయలేదు.

       ఇండియాలో వ్యాక్సినేషన్ గత నెల 16న ప్రారంభం కాగా, రెండో డోస్ ఇవ్వడం ఇప్పుడే మొదలైంది. అయితే  రెండు డోస్ లనూ ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, తొలి డోస్ తీసుకున్న 42 రోజుల తరువాతనే శరీరంలో కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీస్ వృద్ధి జరుగుతుందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. టీకా తీసుకున్నా అన్ని జాగ్రత్తలతో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. చాలా మంది తొలి టీకా తీసుకోగానే నిబంధనలను పాటించడం లేదని, అందువల్లే ఇటువంటి కేసులు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు.

మరోవైపు కొవిడ్ టీకాల పంపిణీ  లక్ష్యాన్ని చేరుకోవడంలో హైదరాబాద్ వెనుకంజలో ఉందని తెలుస్తోంది. ఫ్రంట్ లైన్ వర్కర్లు కూడా టీకా తీసుకోవడానికి ముందుకు రాలేదని అధికారులు చెబుతున్నారు.




ఉప్పెన హీరోయిన్ వయసు ఎంతో తెలుసా..అప్పుడే దిగిందా..?

అప్పట్లో కన్నీళ్లు తెప్పించి, కాసుల వర్షం కురిపించిన సినిమా ఏంటో తెలుసా...!

నిహారిక పెళ్ళితో సాయి ధరమ్ తేజ్ కు ఒత్తిడి !

ఎడిటోరియల్: “కోవిడ్ వ్యాక్సీన్” కోసం భారత్ ను ఎందుకు సంప్రదించ లేదు? కెనడా మంత్రి అనితా ఆనంద్ ను ప్రశ్నించిన ఎంపి వార్నర్

ఏపీ పంచాయతీ ఎన్నికల్లోనే అది రికార్డు విజయం..

జగడ్డ : రెండో విడతలోనూ ఎవరి లెక్కలు వారివే..

చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రికి షాక్ ఇచ్చిన ఓట‌ర్లు.... అక్క‌డ సైకిల్ గ‌ల్లంతు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>