Crimesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/latest-caber-crime-news-at-narayanaguda-ce1a9831-28b5-4dff-b9ec-2fda869bd20e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/latest-caber-crime-news-at-narayanaguda-ce1a9831-28b5-4dff-b9ec-2fda869bd20e-415x250-IndiaHerald.jpgఆన్లైన్ మోసాల గురించి సైబర్ పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. నేటి యువతలో మాత్రం మార్పు రావడం లేదు. అందమైన అమ్మాయి పిక్ కనిపిస్తే చాలు వారితో ఫ్రెండ్షిప్ చెయ్యడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. అందులోనూ ఆ అమ్మాయి నుంచి ఫ్రెండ్ రిక్వస్ట్ రావడమే ఆలస్యం ఓకే ఓకే అంటూ చాటింగ్ మొదలెడుతుంటారు. ఇక గురుడు లైన్లోకి వచ్చాడంటూ అవతల వ్యక్తి అచ్చిక బుచ్చిక చెప్పి ఏదో ఒక రకంగా ఖాతాను ఖాళీ చేసేస్తుంటారు. ఇలాంటి సైబర్ నేరాలు రోజురోజుకు ఎక్కువవుతూనే ఉన్నాయి. నమ్మకండని పోలీసులు.. ఎంతగా మొత్తుకున్నా వింటేగా.. అబ్బే వీcrime;hyderabad;rbi;smart phone;whatsapp;police;bank;youtube;2020;you tube;king;driver;woman;arrest;girl;chatting;june;ala ela;vపాపం.. అమ్మాయి అనుకుని ‘హాయ్’ అని రిప్లే ఇచ్చారు.. ఇంకేముంది ఖాతా మొత్తం ఖాళీ చేసేసారుగా..పాపం.. అమ్మాయి అనుకుని ‘హాయ్’ అని రిప్లే ఇచ్చారు.. ఇంకేముంది ఖాతా మొత్తం ఖాళీ చేసేసారుగా..crime;hyderabad;rbi;smart phone;whatsapp;police;bank;youtube;2020;you tube;king;driver;woman;arrest;girl;chatting;june;ala ela;vSun, 14 Feb 2021 17:52:00 GMTఅమ్మాయి పిక్ కనిపిస్తే చాలు వారితో ఫ్రెండ్షిప్ చెయ్యడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. అందులోనూ ఆ అమ్మాయి నుంచి ఫ్రెండ్ రిక్వస్ట్ రావడమే ఆలస్యం ఓకే ఓకే అంటూ చాటింగ్ మొదలెడుతుంటారు. ఇక గురుడు లైన్లోకి వచ్చాడంటూ అవతల వ్యక్తి అచ్చిక బుచ్చిక చెప్పి ఏదో ఒక రకంగా ఖాతాను ఖాళీ చేసేస్తుంటారు. ఇలాంటి సైబర్ నేరాలు రోజురోజుకు ఎక్కువవుతూనే ఉన్నాయి. నమ్మకండని పోలీసులు.. ఎంతగా మొత్తుకున్నా వింటేగా.. అబ్బే వీళ్లు అలాంటి వాళ్లలా లేరే.. పైగా అమ్మాయి.. అలా ఎలా మోసం చేస్తది అంటూ వారితో స్నేహానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఇస్తే ఊరుకుంటారా.. సైబర్ నేరగాళ్లు వారి చేతి వాటానికి పనిచెప్తుంటారు. ఇలాంటి దోపిడీకి పాల్పడిన ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇన్ స్పెక్టర్ వెంకటరామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. 2020 జూన్ లో ఓ యువకుడు తన బ్యాంక్ అకౌంట్ లో రూ.11 లక్షలు విత్ డ్రా అయ్యాయని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆ యువకుడికి ఫేస్ బుక్ ద్వారా ఓ యువతి పరిచయమైందట. కాగా ఆ యువతి వాట్సాప్ కాల్ చేసి వాయిస్ క్లారిటీ లింక్ పంపిస్తానని చెప్పింది. ఆ లింక్ కు బదులుగా మొబైల్ స్క్రీన్ షేరింగ్ యాప్ ను పంపింది. దాంతో ఈ యువకుడి అకౌంట్ లో నుంచి క్షణకాలంలో అక్షరాల 11 లక్షల రూపాయలు మటుమాయమయ్యాయి. కాగా కేసును నమోదు చేసుకున్న పోలీసులు నేర ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠా లోని వ్యక్తులెవరంటే.. సంగారెడ్డికి చెందిన కేశవ్, కర్నూల్ కు చెందిన హరిప్రసాద్ నాయుడు, బెంగుళూరుకు చెందిన అంబురాజులను దోషులుగా తేల్చారు పోలీసులు.

 క్యాబ్ డ్రైవర్ గా పనిచేసుకుంటూ ఫ్యామిలీని పోషించుకుంటున్న హరిప్రసాద్ నాయుడు దగ్గరకు కేశవ అనే యువకుడు వెళ్లాడు. కేశవ్ కు హరిప్రసాద్ నాయుడు వరుసకు మేనమామ అవుతాడు. అయితే కేశవ్ డిగ్రీని మధ్యలోనే ఆపేసాడు. ఇక మేనమామ ఇంటికి వెళ్లి అక్కడే యూట్యూబ్ లో స్క్రీన్ షేరింగ్ గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. ఇక అప్పటి నుంచి తన ఫేస్ బుక్ అకౌంట్ కు అందమైన అమ్మాయి ఫోటోను డీపీగా పెట్టుకుని డబ్బులున్న అబ్బాయిలను టార్గెట్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపేవాడు. అయితే ఆ యువకులతో మట్లాడేందుకు మహిళ గొంతు అవసరమని నంద్యాలకు చెందిన సోఫియా ద్వారా వారితో మాట్లాడించేవాడు. ఫ్రెండని.. ప్రేమని స్టెప్ బై స్టెప్ వెళుతూ.. వారికి మొబైల్ స్క్రీన్ షేరింగ్ యాప్ లను లింక్ ల ద్వారా పంపిస్తూ అందినకాడికి దోచేస్తుండేవారు. ఇలా వీరు ముగ్గురు.. ముగ్గురు అమాయకులను మోసం చేసి అక్షరాల 22 లక్షల రూపాయల వరకు దోచేశారని పోలీసులు వెళ్లడించారు. 


వామ్మో.. కాజల్, గౌతమ్ ల లవ్ స్టొరీలో ఇన్ని ట్విస్టులా.. సినిమాల్లో కూడా ఉండవేమో..??

RC15 కి మ్యూజిక్ డైరెక్టర్ అతనేనా?

హమ్మా.. మళ్లీ మెగాస్టార్ సరసన ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందిగా..

జగడ్డ: కృష్ణా జిల్లాలో రగడ దేనికి సంకేతం...?

హీరోయిన్ కాబోతున్న తెలుగు టిక్ టాక్ స్టార్

సింగర్ సునీతను రామ్ రెండో పెళ్లికి ఎలా ఒప్పించాడో తెలుసా..??

హమ్మా..ఈ తెలుగు అందం మెల్లిగా సెటిల్ అయిపోతుందిగా.?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>