PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tsrtcb16a95a4-5970-4827-934f-7786534f697c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tsrtcb16a95a4-5970-4827-934f-7786534f697c-415x250-IndiaHerald.jpgగ‌త కొంత‌కాలంగా తెలంగాణ‌ ఆర్టీసీ ఎంతో ప్ర‌గ‌తి సాధిస్తోంద‌ని, కొత్త‌గా ప్ర‌వేశ పెట్టిన కార్గో సేవ‌ల‌తో ప్ర‌గ‌తి ప‌థంలో ప‌య‌నిస్తోంద‌ని స్వ‌యంగా ఆ శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్‌తో పాటు రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు కూడా సంతృప్తి వ్య‌క్తం చేశారు. కొత్త విధానాల‌తో ఆర్టీసీని అప్పుల ఊబి నుంచి బ‌య‌ట ప‌డేయాల‌ని ముఖ్య‌మంత్రి కూడా ఆర్టీసీ అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. వాస్త‌వానికి కూడా గ‌తంలో క‌న్నా ఆదాయం కూడా మెరుగ‌వ‌డం విశేషం. అయితే గ‌డ్డుకాలంలో కూడా ఎప్పుడు ఆగ‌ని జీతాలు గ‌త ఐదts rtc;deva;telangana;rtc;bus;2020;diesel;minister;coronavirusఇక ఆర్టీసీని ఆ దేవుడే కాపాడాలి.. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వ‌డం లేదుగాఇక ఆర్టీసీని ఆ దేవుడే కాపాడాలి.. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వ‌డం లేదుగాts rtc;deva;telangana;rtc;bus;2020;diesel;minister;coronavirusSun, 14 Feb 2021 07:30:00 GMTఆర్టీసీ ఎంతో ప్ర‌గ‌తి సాధిస్తోంద‌ని, కొత్త‌గా ప్ర‌వేశ పెట్టిన కార్గో సేవ‌ల‌తో ప్ర‌గ‌తి ప‌థంలో ప‌య‌నిస్తోంద‌ని స్వ‌యంగా ఆ శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్‌తో పాటు రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు కూడా సంతృప్తి వ్య‌క్తం చేశారు. కొత్త విధానాల‌తో ఆర్టీసీని  అప్పుల ఊబి నుంచి బ‌య‌ట ప‌డేయాల‌ని ముఖ్య‌మంత్రి కూడా ఆర్టీసీ అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. వాస్త‌వానికి కూడా గ‌తంలో క‌న్నా ఆదాయం కూడా మెరుగ‌వ‌డం విశేషం. అయితే గ‌డ్డుకాలంలో కూడా ఎప్పుడు ఆగ‌ని జీతాలు గ‌త ఐదారు నెల‌లుగా టైంకు రావ‌డం లేద‌ని ఉద్యోగులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. 5,10 తారీఖు అంటూ నెల‌నెలా జీతాలు ఆల‌స్య‌మ‌వుతూ వ‌స్తున్నాయి.


ఈనెల అయితే మ‌రీ దారుణం 14దాటినా జీతాల‌కు అతీ గ‌తీ లేద‌ని వాపోతున్నారు. సంస్థ లాభాల్లో న‌డుస్తున్న స‌మ‌యంలో జీతాల‌కు ఇబ్బంది ప‌డ‌టం దారుణ‌మ‌ని అంటున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం జోక్యం చేసుకుని జీతాల చెల్లింపుల‌కు ఏర్పాట్లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను సంస్థ ఉద్యోగులు వేడుకుంటున్నారు. నెల‌నెలా ఖ‌ర్చుల‌కు ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తోంద‌ని చెబుతున్నారు. ఇది ఇలా ఉండ‌గా టికెట్ల అమ్మకాల ద్వారా ఆర్టీసీకి రోజుకు 11 కోట్ల రూపాయల వరకు వస్తుంది.  ఏడాదికి ఇది రూ.3,976 కోట్ల‌కు పైగా ఉంటుంది. ఇది ఏటా మారుతుంది. ఇతర మార్గాల నుంచి అంటే షాపుల అద్దెలు, ప్రకటనలు, పార్శిళ్లు లాంటి వాటి నుంచి సుమారు రూ.వెయ్యి కోట్లు వస్తుంది.


అన్నీ కలిపి సుమారు ఆర్టీసీ స్థూల ఆదాయం రూ.4,880 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా. ఖర్చు సంగతికి వస్తే ఆదాయం కంటే ఏటా వెయ్యి కోట్ల రూపాయల వరకు అదనపు వ్యయం ఉంటుంది. ఆర్టీసీ ఖర్చులో ఎక్కువ భాగం జీతాలు, డీజిల్, పన్నులకే పోతుంది. ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసం వల్ల ఆర్టీసీ ఏటా నష్టాల బారిన పడుతోంది. నష్టాల్లో కొనసాగుతున్న తెలంగాణ ఆర్టీసీని కరోనా వైరస్ కకావికలం చేసేసింది. వైరస్ నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్ సంస్థను కోలుకోలేని దెబ్బతీసింది. అన్‌లాక్‌లో భాగంగా ఆర్టీసీ బస్సులు మళ్లీ రోడ్డెక్కినా ప్రయాణికులు ఆదరించకపోవడంతో పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో ఆర్టీసీ చరిత్రలోనే కనివీనీ ఎరుగని రీతిలో ఏకంగా రూ.1800కోట్ల నష్టాన్ని మూటగట్టుకున్నట్టు అధికారులు అంచనా వేశారు.







జైళ్లో ఉండి స‌ర్పంచ్ అయ్యాడు... వైసీపీకి టీడీపీ సూప‌ర్ షాక్‌

జగడ్డ: నిమ్మగడ్డ జగన్ చేతికి అడ్డంగా దొరికిపోయారా..?

ఏపీలో మతమార్పిడిల జోరు తెలుసుకుని మోడీయే షాకయ్యారా..?

ఎన్టీఆర్ తో ఆ యంగ్ హీరో నటిస్తున్నాడా..?

రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>