PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/funds-to-ap97fd811c-96c8-4914-a31b-27b8308684ef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/funds-to-ap97fd811c-96c8-4914-a31b-27b8308684ef-415x250-IndiaHerald.jpgనేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద పలు రాష్ట్రాలకు సాయం అందించేందుకు గాను ముందుకొచ్చింది కేంద్రం. తద్వారా నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతానికి ఈ నిధులు చేరబోతున్నాయి. నిధులు కేటాయించిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఒకటి.funds to ap;amit shah;prakruti;varsha;andhra pradesh;amith shah;2020;minister;tamilnadu;good news;central government;good newwzఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం...?ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం...?funds to ap;amit shah;prakruti;varsha;andhra pradesh;amith shah;2020;minister;tamilnadu;good news;central government;good newwzSun, 14 Feb 2021 09:00:00 GMTఆంధ్రప్రదేశ్ పై మరోసారి నిధుల వర్షం కురిపించింది కేంద్రం. నిధుల విడుదల చేస్తున్నామంటూ ఏపీ ప్రజలకు తియ్యని కబురు తెలిపింది. దీని కారణంగా కేంద్రంపై ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఇంత సంతోషానికి కారణమైన ఆ నిధుల విషయం ఏంటంటే ? ఇటీవలే జల్‌జీవన్‌ మిషన్‌ (జేజేఎం) కింద 2020–21 ఆర్థిక సంవత్సరానికిగానూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి  నిధులు ఇచ్చిన కేంద్రం ఇప్పుడు మరోసారి..ప్రకృతి వైపరరీత్యాల కారణంగా ఏర్పడిన నష్టాన్ని
భర్తీ చేసేందుకు ఏపీకి నిధులు విడుదల చేయాలని  నిర్ణయించింది.

అయితే ఈ అంశం కింద కేవలం ఆంధ్ర మాత్రమే లబ్ధి పొందడం లేదుు, మరో కొన్ని రాష్ట్రాలు కూడా ఇదే తరహాలో భారీ మొత్తంలో నిధులను పొంద బోతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన హైలెవల్ కమిటీ సమావేశంలో 2020లో తుఫాను,వరదలు
 దాడి వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా భారీగా నష్టపోయిన ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని చర్చించడం జరిగింది. ఈ ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రభావితమైన రాష్ట్రాలకు సహాయం అందించేందుకు గాను నిధుల విడుదలకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు ప్రకటించింది.

నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద పలు రాష్ట్రాలకు సాయం అందించేందుకు గాను ముందుకొచ్చింది కేంద్రం. తద్వారా నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతానికి ఈ నిధులు చేరబోతున్నాయి.
నిధులు కేటాయించిన  రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఒకటి. మొత్తానికి నేషనల్ డిజాస్టర్ ఫండ్ కింద..రూ.3,113.05 కోట్ల అదనపు కేంద్ర సహాయాన్ని హెచ్‌ఎల్‌సీ ఆమోదం తెలిపినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ సహాయం కింద  నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు రూ.280.76 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది.

అదేవిధంగా 2020 ఖరీఫ్‌లో తెగుళ్ల కారణంగా నష్టపోయిన మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి అత్యధికంగా రూ.1,280 కోట్లు కేటాయించింది. తుఫాన్ల కారణంగా నష్టపోయిన  తమిళనాడుకు రూ.63.14 కోట్లు (నివర్‌ తుఫాన్), రూ.223.77 కోట్లు (బురేవి తుఫాన్ ) కేటాయించింది. అలాగే బిహార్‌కు రూ.1,255.27 కోట్లు ఇవ్వాలని ఆమోదం తెలిపింది.
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి రూ.9.91 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్రం ప్రకటించిన ఈ నిర్ణయం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ 280.76 కోట్ల రూపాయలను అదనంగా పొందబోతోంది. మరి ఈ భారీ మొత్తాన్ని ఏ రకంగా వినియోగించాలి అన్న అంశం రాష్ట్ర పరిధిలో ఉంటుంది.


జగడ్డ: చిత్తూరులో నిమ్మగడ్డ పర్యటన.. పోలీసుల అభ్యంతరం..?

ఏపీ పంచాయతీ ఎన్నికల్లోనే అది రికార్డు విజయం..

జగడ్డ : రెండో విడతలోనూ ఎవరి లెక్కలు వారివే..

చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రికి షాక్ ఇచ్చిన ఓట‌ర్లు.... అక్క‌డ సైకిల్ గ‌ల్లంతు

వైసీపీ కీల‌క‌నేత‌కు షాక్‌.. నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో టీడీపీ ఘ‌న‌విజ‌యం

తెలంగాణ టీడీపీపై చంద్ర‌బాబు మ‌ళ్లీ ఫోక‌స్‌... ఇదిగో సాక్ష్యం..

జగడ్డ: నిమ్మగడ్డ జగన్ చేతికి అడ్డంగా దొరికిపోయారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>