PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/panchayati48163370-e3ee-435b-b1af-49d61d785fce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/panchayati48163370-e3ee-435b-b1af-49d61d785fce-415x250-IndiaHerald.jpgకాలం మారింది. దాంతో పాటే అన్నీ మారుతున్నాయి. ఇక రాజకీయాలూ మారాల్సిందే. మారమని ఎవరైనా అంటే వారు రేసులో వెనకబడినట్లే. అలాగే మార్చేసేందుకు కూడా రెడీగా ఉంటారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల మీద ఇపుడు దేశం మొత్తం దృష్టి ఉంది. ఏపీలో ఏడాదిగా సాగిన రెండు రాజ్యాంగ సంస్థల మధ్య యుధ్ధం నేపధ్యంలో పంచాయతీ ఎన్నికలు కోర్టు ఆదేశానుసారం జరుగుతున్నాయి. panchayati;geum;panchayati;chief minister;mla;survey;elections;tdp;ycp;partyకోట్లు ఖర్చు పెట్టి నంబర్ గేమ్...?కోట్లు ఖర్చు పెట్టి నంబర్ గేమ్...?panchayati;geum;panchayati;chief minister;mla;survey;elections;tdp;ycp;partySun, 14 Feb 2021 14:14:58 GMTపంచాయతీ ఎన్నికల మీద ఇపుడు దేశం మొత్తం దృష్టి ఉంది. ఏపీలో ఏడాదిగా సాగిన రెండు రాజ్యాంగ సంస్థల  మధ్య యుధ్ధం నేపధ్యంలో పంచాయతీ ఎన్నికలు కోర్టు ఆదేశానుసారం జరుగుతున్నాయి.

దీంతో పంచాయతీ ఎన్నికల విషయంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ రెండూ ప్రతిష్టకు పోయాయని తెలుస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీ అంటే అంగబలం, అర్ధబలం కూడా ఉంటాయి. దాంతో కోట్లు ఖర్చు చేసి మరీ పంచాయతీ సర్పంచు పదవులో కోసం పోటీ పడ్డారని అంటున్నారు. దీని వల్ల జరిగిందేంటి అంటే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా పంచాయతీలను కూడా తయారు చేశారు. వైసీపీకి ఏ ఒక్క చాన్సూ ఇవ్వకూడదని ప్రతిపక్ష టీడీపీ కూడా వీలు ఉన్న చోట్ల గట్టిగానే పోటీ పడింది. తన దగ్గర ఉన్న అన్ని వనరులనూ వాడేసింది. దాంతో పంచాయతీ ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలతో సమానంగా ఈసారి జరిగాయి. ఎక్కడ చూసినా బలాబలాల సరిసమానమైన  పోరే కనిపించింది.

నిజానికి పల్లెటూర్ల‌లో  మంచి వారిని, తమకు బాగా   దగ్గరగా ఉన్న వారిని  జనాలు ఎన్నుకుంటారు. కానీ ఈసారి పంతం వల్ల ఎన్నికలు జరగాలని ప్రతిపక్షం పట్టుదల వల్ల ఏకగ్రీవాలు కూడా కోట్లలో వేలం పాట మాదిరిగా పలికాయన్న వార్తలు కూడా వచ్చాయి. దీంతో తమకు ఎక్కువగా పదవులు వచ్చాయని అటు అధికార పార్టీ, ఇటు విపక్ష పార్టీ ఎవరికి తోచిన విధంగా వారు లెక్కలు చెప్పుకుంటూ నంబర్ గేమ్ మొదలెట్టేశారు. నిజానికి పంచాయతీ ఎన్నికల్లో గెలిస్తే ఏకంగా రేపటి రోజున ఏపీలో అధికారం వచ్చేస్తుందని ఏ సర్వే చెప్పలేదు. అలాగని ఇక్కడ గెలవకపోతే ఏపీలో ముఖ్యమంత్రి పీఠం రాదని కూడా ఏ  రాజకీయ గణిత శాస్త్రంలోనూ  చెప్పలేదు. కానీ ఒకరి మీద మరొకరు  పై చేయి సాధించాలన్న ఉద్దేశ్యంతోనే ఇలా విచ్చలవిడిగా పోరాటం చేస్తూ జబ్బలు చరచుకుంటున్నారు అంటున్నారు. మొత్తానికి ఈ నంబర్ గేమ్ శాశ్వతం కాదని, రాజకీయ  పార్టీల ఆత్మ తృప్తి కోసమే తప్ప జనాలను ఏ విధంగానూ ప్రభావితం చేయదని కూడా రాజకీయ మేధావులు అంటున్నారు.




షాకింగ్ రోల్ లో శ్రియ...తట్టుకోగలరా..?

బాబు వైఖ‌రి ఇలా ఉంటే క‌ష్ట‌మే.. త‌ల ప‌ట్టుకుంటోన్న త‌మ్ముళ్లు ?

జగడ్డ: వైసీపీ కంచు కోటలు బద్దలు.. సీన్ మారుతోందా..?

కడుపుతో ఉన్నా కూడా తుపాకి పట్టింది..గుండెలు కదిలించే కథ

రేవంత్ రెడ్డి హఠాత్తుగా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు ?.. అసలు కారణం అదేనా..?

స్టార్ హీరోలను ఢీ కొట్టిన కమెడియన్...?

అప్పట్లో కన్నీళ్లు తెప్పించి, కాసుల వర్షం కురిపించిన సినిమా ఏంటో తెలుసా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>