PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bjp-also-targets-home-minister054edc21-9ddb-4bcb-8365-c63590097c5e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bjp-also-targets-home-minister054edc21-9ddb-4bcb-8365-c63590097c5e-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీలో కీలక మార్పులు జరిగే అవకాశాలున్నాయని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమాత్రం కూడా ప్రభావం చూపించ లేక పోతుంది అనే విషయం అందరికీ అర్థమవుతుంది. ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ప్రజల్లోకి వెళ్లే విషయంలో ముందు నుంచి కూడా ఘోరంగా విఫలమవుతున్నారు. రాజకీయంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన సమయంలో ఆయన అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని ఆరోbjp;amala akkineni;bharatiya janata party;kamma;andhra pradesh;2019;local language;partyఏపీ బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా... కమ్మ నేత...?ఏపీ బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా... కమ్మ నేత...?bjp;amala akkineni;bharatiya janata party;kamma;andhra pradesh;2019;local language;partySun, 14 Feb 2021 13:07:07 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీలో కీలక మార్పులు జరిగే అవకాశాలున్నాయని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమాత్రం కూడా ప్రభావం చూపించ లేక పోతుంది అనే విషయం అందరికీ అర్థమవుతుంది. ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ప్రజల్లోకి వెళ్లే విషయంలో ముందు నుంచి కూడా ఘోరంగా విఫలమవుతున్నారు. రాజకీయంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన సమయంలో ఆయన అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి.

ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద పెద్దగా దృష్టి పెట్టడం లేదు అని ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. 2019 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ పూర్తిగా నాశనం అయిపోయింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలలో ఆ పార్టీపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. 2014 తర్వాత రాష్ట్రానికి నిధులు ఏమి ఇవ్వకపోగా ప్రత్యేక హోదా కూడా అమలు కాకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోతుంది. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అన్యాయం చేస్తూ ఉత్తరాది రాష్ట్రాలకు న్యాయం చేస్తోంది అని ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. 

ప్రస్తుతం రాష్ట్రానికి రావాల్సిన నిధులు విషయంలో కూడా ఆ పార్టీ నేతలు ఎలాంటి ముందడుగు వేయలేకపోతున్నారు. ప్రజల్లోకి వెళ్లి కొన్ని వాస్తవాలను వివరించలేని పరిస్థితుల్లో కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నారు అనే వార్తల నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ అధిష్టానం రాష్ట్రంలో కీలక మార్పులు చేసే అవకాశాలున్నాయంటున్నారు. త్వరలోనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుని మార్చడమే కాకుండా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఒక కీలక నేతను నియమించే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఉందని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరి ఎవరిని నియమిస్తుంది ఏంటనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది.



టీమిండియాకు షాక్.. 67 ఏళ్ల భారత్ రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్

షాకింగ్ రోల్ లో శ్రియ...తట్టుకోగలరా..?

బాబు వైఖ‌రి ఇలా ఉంటే క‌ష్ట‌మే.. త‌ల ప‌ట్టుకుంటోన్న త‌మ్ముళ్లు ?

జగడ్డ: వైసీపీ కంచు కోటలు బద్దలు.. సీన్ మారుతోందా..?

కడుపుతో ఉన్నా కూడా తుపాకి పట్టింది..గుండెలు కదిలించే కథ

రేవంత్ రెడ్డి హఠాత్తుగా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు ?.. అసలు కారణం అదేనా..?

స్టార్ హీరోలను ఢీ కొట్టిన కమెడియన్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>