CookingPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/cooking-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/cooking-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. చిలగడ దుంప రబ్డీకి కావలసినవి.... పాలు – ఒక కప్పు; ఉడికించిన చిలగడ దుంపల ముద్ద – 2 టేబుల్‌ స్పూన్లు; పంచదార – అర టీ స్పూను; గోరు వెచ్చని నీళ్ళు – అర కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; కుంకుమ పువ్వు – చిటికెడు; పల్లీ, పిస్తా, జీడిపప్పుల పొడి – ఒక టేబుల్‌ స్పూన్. చిలగడ దుంప రబ్డీ తయారు చేయు విధానం... ముందుగా స్టౌ మీద గిన్నెలో పాలు పోసి, మరిగించాలి ఉడికించిన చిలగడ దుంప ముద్ద జత చేసి, పాలు చిక్కబడే వరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి.చిన్న కప్పులో గోరుcooking;india;pistachio;beetroot;oil;garlic;aqua;letter;pomegranate;masalaచిలకడదుంప, బీట్రూట్ తో ఈ వంటకాలు ట్రై చెయ్యండి...చిలకడదుంప, బీట్రూట్ తో ఈ వంటకాలు ట్రై చెయ్యండి...cooking;india;pistachio;beetroot;oil;garlic;aqua;letter;pomegranate;masalaSun, 14 Feb 2021 12:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..

చిలగడ దుంప రబ్డీకి కావలసినవి....
పాలు – ఒక కప్పు; ఉడికించిన చిలగడ దుంపల ముద్ద – 2 టేబుల్‌ స్పూన్లు; పంచదార – అర టీ స్పూను; గోరు వెచ్చని నీళ్ళు – అర కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; కుంకుమ పువ్వు – చిటికెడు; పల్లీ, పిస్తా, జీడిపప్పుల పొడి – ఒక టేబుల్‌ స్పూన్.

చిలగడ దుంప రబ్డీ తయారు చేయు విధానం...

  • ముందుగా స్టౌ మీద గిన్నెలో పాలు పోసి, మరిగించాలి
  • ఉడికించిన చిలగడ దుంప ముద్ద జత చేసి, పాలు చిక్కబడే వరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి.చిన్న కప్పులో గోరు వెచ్చని నీళ్ళలో కుంకుమ పువ్వు వేసి, కరిగించి, మరుగుతున్న పాలలో వేసి కలియబెట్టాలి.ఏలకుల పొడి జతచేయాలి.పల్లీ, పిస్తా, జీడిపప్పల పొడి జత చేసి, కలిపి దింపేయాలి.చల్లారాక, ఫ్రిజ్‌లో గంట సేపు ఉంచి, తీసి అందించాలి.

బీట్ రూట్ కబాబ్ తయారీకి కావాల్సిన పదార్ధాలు....

ముందుగా బీట్‌ రూట్‌ తురుము – ఒక కప్పు; టోఫు – అర కప్పు (తురమాలి); వెల్లుల్లి ముద్ద – అర టేబుల్‌ స్పూను; ఆమ్‌ చూర్‌ పొడి – ఒక టేబుల్‌ స్పూను; వేయించిన దానిమ్మ గింజల పొడి – ఒక టేబుల్‌ స్పూను; చాట్‌ మసాలా – చిటికెడు; రాళ్ళ ఉప్పు – తగినంత; జీడిపప్పు పలుకులు – పావు కప్పు; ఓట్స్‌ పొడి – అర కప్పు; నూనె – డీప్‌ ఫ్రైకి తగినంత.


బీట్రూట్ కబాబ్ తయారి విధానం.......

  • ముందుగా ఒక పాత్రలో బీట్‌ రూట్‌ తురుము, టోఫు తురుము, వెల్లుల్లి ముద్ద, ఆమ్‌చూర్‌ పొడి, చాట్‌ మసాలా, ఉప్పు, దానిమ్మ గింజల పొడి వేసి, బాగా కలిపి, చేతితో కట్‌లెట్‌ మాదిరిగా ఒత్తాలి.ఒక్కొక్క దానిలో జీడిపప్పు పలుకులు వేసి, కబాబ్‌ మాదిరిగా గుండ్రంగా చేయాలి
  • ఓట్స్‌ పొడిని అద్దాలి∙స్టౌపై బాణలిలో నూనె కాగాక, కబాబ్స్‌ని అందులో వేయించి, కిచెన్‌ న్యాప్‌కిన్‌ మీదకు తీసుకోవాలి.గ్రీన్‌ చట్నీతో వేడిగా వేడిగా తింటే చాలా బాగుంటుంది...






చంద్రబాబు మాట కంటే ఆ మంత్రి మాటకే విలువ ఎక్కువా...? పాపం

కడుపుతో ఉన్నా కూడా తుపాకి పట్టింది..గుండెలు కదిలించే కథ

రేవంత్ రెడ్డి హఠాత్తుగా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు ?.. అసలు కారణం అదేనా..?

స్టార్ హీరోలను ఢీ కొట్టిన కమెడియన్...?

అప్పట్లో కన్నీళ్లు తెప్పించి, కాసుల వర్షం కురిపించిన సినిమా ఏంటో తెలుసా...!

నిహారిక పెళ్ళితో సాయి ధరమ్ తేజ్ కు ఒత్తిడి !

ఎడిటోరియల్: “కోవిడ్ వ్యాక్సీన్” కోసం భారత్ ను ఎందుకు సంప్రదించ లేదు? కెనడా మంత్రి అనితా ఆనంద్ ను ప్రశ్నించిన ఎంపి వార్నర్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>