EducationParisa Rama Krishna Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/less-sleep-on-full-moon-night38c94ade-9173-4c56-861c-d9c3f8925cff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/less-sleep-on-full-moon-night38c94ade-9173-4c56-861c-d9c3f8925cff-415x250-IndiaHerald.jpgచల్లని వెలుగులు చిందించే పున్నమి రాత్రుల చందమామ అందం వేరు, ఆకర్షణ వేరు. పిండారబోసిన వెన్నెల్లో ఆరుబయట నింగిలోకి చూస్తూ పరవసించే వేళ మనం తక్కువ నిదురేపోతాం. అది మనోరంజకం. అయితే ఖగోళ శాస్త్రవేత్తల ఆలోచనలు శాస్త్రీయంగా ఉంటాయి కదా! పౌర్ణమి వేళ జనం చాలా తక్కువ సమయమే నిద్రిస్తారని, దీనికి చంద్రుడు నిండుగా కాంతి వంతంగా ప్రకాశించడమే ప్రధాన కారణమని తాజా అధ్యయనంలో తేలింది. కాగా, ఈ అధ్యయన ఫలితాలను “సైన్స్ అడ్వాన్సెస్‌ జర్నల్” లో ప్రచురించారు.అద్భుతమైన ఈ ఈ విషయాన్ని పౌర్ణమి రోజు గమనించవచ్చని శాస్త్రవేత్తలుless sleep on full moon night;manu;tara;moon;professorనిండు పున్నమి రాత్రి నిద్దుర తక్కువేగా? శాస్త్రవేత్తలేమంటున్నారు?నిండు పున్నమి రాత్రి నిద్దుర తక్కువేగా? శాస్త్రవేత్తలేమంటున్నారు?less sleep on full moon night;manu;tara;moon;professorSun, 14 Feb 2021 21:15:00 GMT
చల్లని వెలుగులు చిందించే పున్నమి రాత్రుల చందమామ అందం వేరు, ఆకర్షణ వేరు. పిండారబోసిన వెన్నెల్లో ఆరుబయట నింగిలోకి చూస్తూ పరవసించే వేళ మనం తక్కువ నిదురేపోతాం. అది మనోరంజకం. అయితే ఖగోళ శాస్త్రవేత్తల ఆలోచనలు శాస్త్రీయంగా ఉంటాయి కదా!


పౌర్ణమి వేళ జనం చాలా తక్కువ సమయమే నిద్రిస్తారని, దీనికి చంద్రుడు నిండుగా కాంతి వంతంగా ప్రకాశించడమే ప్రధాన కారణమని తాజా అధ్యయనంలో తేలింది. కాగా, ఈ అధ్యయన ఫలితాలను “సైన్స్ అడ్వాన్సెస్‌ జర్నల్” లో ప్రచురించారు. ఈ అద్భుతమైన విషయాన్ని పౌర్ణమి రోజు గమనించవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.


ఖగోళంలో జరిగే అద్భుతాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు ఆహరాహరం సహస్ర నయనాలను విప్పార్చి చూడటానికి సతతం నిరీక్షిస్తుంటారు. ఏ చిన్న మార్పు కనిపించినా భూమిపై ఎలాంటి ప్రభావం, పరిణామం ఉంటుందనే దానిపై పరిశోధనలు జరుపుతారు. చంద్రుడిపై శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో ఒక నవ్యాతి నవ్యమైన అంశం వారి దృష్టిలోకి వచ్చింది.


అదేమంటే: పౌర్ణమి నాడు చంద్రుడు సాధారణం కంటే 14 శాతం ఎక్కువ పరిమాణంలో పెద్దదిగా ఉంటుందని, రోజుటి కంటే 30 శాతం అధిక ప్రకాశవంతంగా ఉంటుందని వారు చెప్పారు. చంద్రుడు భూమికి మరింత దగ్గరకు వస్తున్నందు వలన ఈ నిండు చంద్రుడు దర్శనమిస్తాడని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. తద్వారా, పౌర్ణమినాడు చందమామ ముదురు నారింజ వర్ణంలోకి మారి చూపరులకు  కనివిందు చేస్తుందని పేర్కొంటున్నారు.


మనుషులు పౌర్ణమి ముందు రాత్రులతో పోలిస్తే పౌర్ణమి తర్వాత రాత్రుల్లో 50నిమిషాలు తక్కువ నిద్రపోయారని “సీటెల్‌” లోని “వాషింగ్టన్ విశ్వవిద్యాలయం” జీవ శాస్త్ర ప్రొఫెసర్ ‘కో-అథోర్ హోరాసియో డి లా ఇగ్లేసియా’ చెప్పారు. కాగా, అర్జెంటీనాలో నివసించే టోబా, కోమ్ తెగలకు చెందిన 98 మందిపై ఈ అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారి నిద్ర షెడ్యూల్‌ను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు వారి మణికట్టుపై స్లీప్ మానిటర్‌ను అమర్చారు. పౌర్ణమి రోజు వారి నిద్రస్థితిని పరిశీలించగా, వారు చాలా తక్కువ సమయం నిద్రపోయారని తేలింది.


దీనికి గల కారణాన్ని అన్వేషించగా వారికి ఆసక్తికర విషయం తెలిసింది. పౌర్ణమి రోజుల్లో సూర్యాస్తమయం తరువాత వచ్చే చంద్రుడు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడని, అందువల్లే ఈ సమయంలో మనుషులు తక్కువ సమయం నిద్రపోయారని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో పనిచేసే జీవశాస్త్ర నిపుణుడు స్టడీ కోథర్ లియాండ్రో కాసిరాఘి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ "పౌర్ణమి సమయంలో వెలుతురు ఎక్కువగా ఉంటుంది. రాత్రి సమయంలోనూ ఎక్కువ వెలుతురు ఉండటంతో మనుషులు ఆలస్యంగా నిద్రపోతారు. అంతేకాక, చాలా తక్కువ సమయం పడుకొని ఉదయాన్నే నిద్రకు ఉపక్రమిస్తారు.’’ అని అన్నారు.


ఈ అధ్యయనంలో పాల్గొన్న పట్టణ ప్రాంతాల వారు, గ్రామీణ ప్రాంతాల వారి కంటే తక్కువ సేపు నిద్రపోయారు. సహజంగా, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు మాత్రమే చంద్ర దశల ద్వారా ప్రభావితమవుతారని అందరూ భావిస్తుంటారు. కానీ దానికి భిన్నంగా పట్టణ ప్రాంతాల వారు దీనికి ఎక్కువ ప్రభావిత మవ్వడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని జీవశాస్త్ర నిపుణుడు కాసిరాఘి చెప్పారు.





బిజెపి వాళ్ళ నోరు కుట్టేసిందా...?

స్టార్ హీరో అయ్యాక అబ్బాస్ పెట్రోల్ బంక్ లో ఎందుకు పని చేయాల్సి వచ్చింది

మూడు వారాల గ్యాప్ లో ... మూడు సునామీలు ....బాక్సాఫీస్ రచ్చ రచ్చే .... ??

RC15 కి మ్యూజిక్ డైరెక్టర్ అతనేనా?

హమ్మా.. మళ్లీ మెగాస్టార్ సరసన ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందిగా..

జగడ్డ: కృష్ణా జిల్లాలో రగడ దేనికి సంకేతం...?

హీరోయిన్ కాబోతున్న తెలుగు టిక్ టాక్ స్టార్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Parisa Rama Krishna Rao]]>