MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kruthi-setty-infoe92a4669-9d42-4c11-986d-10f618d42104-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kruthi-setty-infoe92a4669-9d42-4c11-986d-10f618d42104-415x250-IndiaHerald.jpgతొలి సినిమాతోనే క్రేజీ రికార్డు సొంతం చేసుకున్నారు వైష్ణవ్ తేజ్ మరియు కృతి శెట్టి. ఉప్పెన చిత్రం బాక్సాఫీస్ వద్ద తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.10 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందంటే కథ, డైరెక్షన్ తో పాటు ఇందులో ప్రముఖ నటీనటులు ఏ రేంజ్ లో ప్రతిభను కనబరిచారో అర్థమవుతుంది. kruthi setty info;abinaya;sethu;tara;vijay;vijay sethupathi;tollywood;cinema;industry;husband;hero;heroine;joseph vijay;vaishnav tej;fidaa;chitramఈ విజయంతో ఉప్పెన హీరోయిన్ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మారనుందా...?ఈ విజయంతో ఉప్పెన హీరోయిన్ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మారనుందా...?kruthi setty info;abinaya;sethu;tara;vijay;vijay sethupathi;tollywood;cinema;industry;husband;hero;heroine;joseph vijay;vaishnav tej;fidaa;chitramSun, 14 Feb 2021 12:00:00 GMTతార కృతి శెట్టి శుక్రవారం ఉప్పెన సినిమాతో తొలిసారి వెండితెరపై మెరిసి ప్రేక్షకుల మనసుల్లో ఆనంద కెరటాలు ఎగిసి పడేలా చేశారు. ఈ చిత్రంలో  హీరో, హీరోయిన్, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి వారి పాత్రలకు ప్రాణం పోశారు. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హిట్ టాక్ తో తన సినిమాల ఖాతా తెరిచాడు. హీరోయిన్ కృతి శెట్టి కూడా అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే.... ఈ సినిమా చూసిన వారెవ్వరూ కృతి శెట్టి ని కొత్త హీరోయిన్ గా ఫీల్ అవరు... అలా, ఎంతో అనుభవం ఉన్న టాప్ హీరోయిన్ రేంజ్ లో నటనను పండించింది కృతి.

సినిమా రిలీజ్ కాకముందే ఈ ముద్దుగుమ్మ ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు అయితే ఆమె అందానికి, నటనకు ఫిదా అయిపోతున్నారు ప్రేక్షకులు. ఈమెకు అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతోంది. కేవలం ఒకే ఒక్క సినిమాతో ఇంతటి పేరు పొందడం అంటే అంత సులభమైన విషయం కాదు... అలాంటిది ఒక్క సినిమాతో టాప్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ దక్కించుకున్న ఈ భామకు... ఇక క్రేజీ ఆఫర్లు వెల్లువెత్తుతాయని అభిప్రాయపడుతున్నారు సినీ అభిమానులు మరియు ఇండస్ట్రీ పెద్దలు.

తొలి సినిమాతోనే క్రేజీ  రికార్డు సొంతం చేసుకున్నారు వైష్ణవ్ తేజ్ మరియు కృతి శెట్టి. ఉప్పెన చిత్రం బాక్సాఫీస్ వద్ద తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.10 కోట్లకు పైగా వసూళ్లు  సాధించిందంటే కథ, డైరెక్షన్ తో పాటు ఇందులో ప్రముఖ నటీనటులు ఏ రేంజ్ లో ప్రతిభను కనబరిచారో అర్థమవుతుంది. ఏదేమైనా సినీ రంగంలో కృతి భవిష్యత్తు మాత్రం మూడు పువ్వులు ఆరు కాయలు అంటూ జ్యోతిష్యం చెబుతున్నారు అభిమానులు. మరి ఇంతకు ముందు హీరోయిన్లలాగే ఒక సినిమాతో మెరిసి, మాయమైపోతుందేమో అని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.


చంద్రబాబు మాట కంటే ఆ మంత్రి మాటకే విలువ ఎక్కువా...? పాపం

కడుపుతో ఉన్నా కూడా తుపాకి పట్టింది..గుండెలు కదిలించే కథ

రేవంత్ రెడ్డి హఠాత్తుగా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు ?.. అసలు కారణం అదేనా..?

స్టార్ హీరోలను ఢీ కొట్టిన కమెడియన్...?

అప్పట్లో కన్నీళ్లు తెప్పించి, కాసుల వర్షం కురిపించిన సినిమా ఏంటో తెలుసా...!

నిహారిక పెళ్ళితో సాయి ధరమ్ తేజ్ కు ఒత్తిడి !

ఎడిటోరియల్: “కోవిడ్ వ్యాక్సీన్” కోసం భారత్ ను ఎందుకు సంప్రదించ లేదు? కెనడా మంత్రి అనితా ఆనంద్ ను ప్రశ్నించిన ఎంపి వార్నర్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>