PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/shivalinga09bbf7f4-4e6f-4439-b5ae-5944a4a89209-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/shivalinga09bbf7f4-4e6f-4439-b5ae-5944a4a89209-415x250-IndiaHerald.jpgమనకు తెలిసినంత వరకు దేవుడికి పూజలు చేసి, ఉపవాసాలు ఉంటాము. అయితే ఓ వ్యక్తి శివుడిని ఆరాధిస్తున్నాడు. ఆ ముక్కంటి తన మొర ఆలకిస్తాడని గాఢంగా నమ్మాడు. సుమారు పదిహేను సంవత్సరాలు ఆ గరళ కంఠుడికి పూజలు చేశాడు. తన బాధలు తీర్చమని ఆ ఆది దేవుడికి ప్రతిరోజూ ఆరాధించాడు. కానీ ముక్కంటి అతడి వ్యాధిని నయం చేయలేదు. shivalinga;rana;shiva;deva;maya;kakki;uttarakhand;adinarayanareddy;district;police;lord siva;aqua;kaliశివలింగాన్ని మాయం చేసిన భక్తుడు.. ఎందుకంటే..!?శివలింగాన్ని మాయం చేసిన భక్తుడు.. ఎందుకంటే..!?shivalinga;rana;shiva;deva;maya;kakki;uttarakhand;adinarayanareddy;district;police;lord siva;aqua;kaliSun, 14 Feb 2021 07:00:00 GMTఆది దేవుడికి ప్రతిరోజూ ఆరాధించాడు. కానీ ముక్కంటి అతడి వ్యాధిని నయం చేయలేదు. దీంతో సర్వేశ్వరుడు తనకు అన్యాయం చేశాడనే ఆగ్రహంతో ఆదిదేవుడి రూపాన్ని ధ్వంసం చేయాలనుకున్నాడు ఆ భక్తుడు. ఉత్తరాఖండ్ లో జరిగిన ఘటన కలకలం రేపుతోంది.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అల్మోరా జిల్లా చిటాలిగఢ్ గ్రామానికి చెందిన తారాసింగ్ రానా శివ భక్తుడు. అతడు చాలా కాలంగా తీవ్రమైన కాలి నొప్పితో బాధపడుతున్నాడు. అయితే అతడికి సమీపాన ఉండే ద్వారహత్ ఆలయంలో ఉన్న బైరవుడిని ఆరాధిస్తే తన నొప్పి తగ్గుతుందని చాలా మంది చెప్పారు. తాను 12వ తరగతిలో ఉండగా నొప్పి రాగా అప్పటి నుండి ఇప్పటిదాకా ఆ కైలాసాధిపతిని నిష్ఠగా పూజించాడు. ఎంతచేసినా తన కాలినొప్పి తగ్గకపోగా ఇంకా ఎక్కువైంది.

దీంతో రానాకు ఆ త్రినేత్రుడిపై ఆగ్రహం ఎక్కువైంది. గౌరీపతి తన మొర ఆలకించడంలేదనే ఆవేదనతో.. అక్కడ ఉన్న పురాతనమైన శివలింగాన్ని ధ్వంసం చేయాలనుకున్నాడు. దాంతో ఇటీవలే ఒకరోజు రాత్రి ఆ ఆలయానికి వెళ్లి అక్కడ ఉన్న శివలింగాన్ని దొంగిలించాడు. దానిని తీసుకెళ్లి ఒక పాడుబడ్డ పాఠశాలలో ఉన్న మురుగునీటి భావిలో పడేశాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టుగా ఉన్నాడు. అయితే పోలీసులు సీసీటీవీ ఫుటేజీలలో అసలు విషయం బయటపడింది. దీంతో రానా ను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు.. అతడితో అసలు నిజం కక్కించారు. పోలీసులు తమ స్టైల్ లో విచారించడంతో ఆ విగ్రహం ఎక్కడుందో రానా చెప్పేశాడు. పోలీసులు దానిని బయటకు తీయగా.. దానిలో కొన్ని భాగాలు విరిగిపోయి ఉన్నాయి. అల్మోరా ప్రాంతం పురాతన ఆలయాలకు, ముఖ్యంగా శివాలయాలకు ప్రతీతి.


క‌ర్నూలులో ఫ్యాన్ సీన్ రివ‌ర్స్‌... సైకిల్ టాప్ గేర్‌

జగడ్డ: నిమ్మగడ్డ జగన్ చేతికి అడ్డంగా దొరికిపోయారా..?

ఏపీలో మతమార్పిడిల జోరు తెలుసుకుని మోడీయే షాకయ్యారా..?

ఎన్టీఆర్ తో ఆ యంగ్ హీరో నటిస్తున్నాడా..?

రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>