MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/vijaya-devarakondac37ad812-35c6-4e86-8a20-6d9dbe3166c0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/vijaya-devarakondac37ad812-35c6-4e86-8a20-6d9dbe3166c0-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి చూపులు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమైయ్యాడు. వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకొని స్టార్ హీరోలో ఒక్కరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి‘తో ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు vijaya devarakonda;kumaar;shiva;koratala siva;sukumar;vijay;vijay deverakonda;hyderabad;tollywood;cinema;telugu;arjun reddy;marriage;director;lord siva;hero;joseph vijay;arjun 1;reddy;raccha;devarakondaడాన్ లాగా దర్జాగా సొంత చార్టెడ్ లో ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండడాన్ లాగా దర్జాగా సొంత చార్టెడ్ లో ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండvijaya devarakonda;kumaar;shiva;koratala siva;sukumar;vijay;vijay deverakonda;hyderabad;tollywood;cinema;telugu;arjun reddy;marriage;director;lord siva;hero;joseph vijay;arjun 1;reddy;raccha;devarakondaSun, 14 Feb 2021 17:00:00 GMTవిజయ్ దేవరకొండ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి చూపులు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమైయ్యాడు. వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకొని స్టార్ హీరోలో ఒక్కరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి‘తో ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ . కేవలం తెలుగుకే పరిమితం కాకుండా హిందీలోనూ విజయ్ తన పాపులారిటీని పెంచుకున్నాడు.ఇక దీంతో ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే క్రమంలోనే టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ విజయ్‌ని బాలీవుడ్‌కి పరిచయం చేస్తూ ‘లైగర్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే . ఈ సినిమా టైటిట్ లాంచ్ రోజునే విజయ్ అభిమానులు ఎంత రచ్చ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. బహుశా సినిమా టైటిల్ విడుదల రోజే ఇంత హంగామా చేయడం ఇదే తొలిసారి కావొచ్చు . ఇటీవల విజయ్ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ వచ్చాడు . అయితే తాజాగా తిరిగి షూటింగ్‌లో పాల్గొనేందుకు వెళ్లాడు. ఈ విషయాన్ని ‘లైగర్‘ నిర్మాతల్లో ఒకరైన నటి చార్మీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. స్పెషల్ ఫ్లైట్‌లో విజయ్ స్టైలిష్ లుక్‌లో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘లైగర్ స్టైల్‌గా ముంబై‌లో ల్యాండ్ అయ్యాడు. త్వరలోనే సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నాడు’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

ఇక ఈ ఫోటోలు చూసిన  విజయ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సినిమాలు మాత్రమే కాకుండా బిజినెస్‌లోనూ విజయ్ దేవరకొండ దూకుడు చూపిస్తున్నాడు. రౌడీ పేరుతో ఈయన లాంఛ్ చేసిన క్లోత్స్ రికార్డులు సృష్టించాయి. కెరీర్ పరంగా ప్రస్తుతం బిజీగా ఉన్నాడు విజయ్. పూరీ జగన్నాత్ లైగర్ సినిమా తర్వాత సుకుమార్, కొరటాల శివ లాంటి అగ్ర దర్శకులు ఈయన కోసం లైన్‌లో ఉన్నారు.


విజయశాంతి చికాకు పెట్టిస్తున్నారా...? అసలు ఏంటీ...?

జగడ్డ: కృష్ణా జిల్లాలో రగడ దేనికి సంకేతం...?

హీరోయిన్ కాబోతున్న తెలుగు టిక్ టాక్ స్టార్

సింగర్ సునీతను రామ్ రెండో పెళ్లికి ఎలా ఒప్పించాడో తెలుసా..??

హమ్మా..ఈ తెలుగు అందం మెల్లిగా సెటిల్ అయిపోతుందిగా.?

షాకింగ్ రోల్ లో శ్రియ...తట్టుకోగలరా..?

బాబు వైఖ‌రి ఇలా ఉంటే క‌ష్ట‌మే.. త‌ల ప‌ట్టుకుంటోన్న త‌మ్ముళ్లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>