Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/paluf6438cca-b6d7-4d5b-b77c-c7d71f6f22d5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/paluf6438cca-b6d7-4d5b-b77c-c7d71f6f22d5-415x250-IndiaHerald.jpg పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఆవు పాలు చాలా మంచివి. పాలను పలు రకాలుగా ఉపయోగించుకుంటున్నాం. పాలు తాగిన, పాలతో తయారుచేసిన ఆహార పదార్థాలను తిన్న ఆరోగ్యానికి చాలా మంచిది.పాలలో దాగి ఉన్నా ఔషధ ఉపయోగాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం... palu;tara;aqua;pepper powder;shaktiపాలలో ఔషధ ఉపయోగాలు చాలా ఉన్నాయి... అవి ఏమిటంటే...?పాలలో ఔషధ ఉపయోగాలు చాలా ఉన్నాయి... అవి ఏమిటంటే...?palu;tara;aqua;pepper powder;shaktiSun, 14 Feb 2021 02:00:00 GMT
 బలహీనంగా ఉన్న వాళ్ళు బరువు పెరగాలంటే ఈ రోజు పాలు తీసుకోవడం వల్ల వారానికి మూడు నుంచి ఐదు పౌండ్లు బరువు పెరుగుతారు. నిదానముగా శరీర బరువు ఉండాల్సిన స్థితికి చేరుకుంటుంది.

 రోజు పాలు తాగడం వల్ల కళ్ళు తేటగా ప్రకాశవంతంగా అవుతాయి. అంతేకాకుండా ఆరోగ్యం మెరుగుపడుతుంది.శరీరంలోని అన్ని అవయవాలకు శక్తి అందుతుంది.

పాలు రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి ఉపయోగపడతాయి.పాలు తాగటం వల్ల కడుపు, ప్రేవుల్లో ని ద్రవాంశం వృద్ధి చెందుతుంది.దీనివల్ల రక్త ప్రసరణ సహజంగా మెరుగుపడుతుంది.రక్త ప్రసరణ సక్రమంగా జరగడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది.

 కడుపులో యాసిడ్ తయారవుతూ హైపర్ ఎసిడిటీ తో బాధపడుతున్న వాళ్లకి పాలు మంచి ఆహారం. పాలు జీర్ణం కావడానికి యాసిడ్ అధికంగా కావాల్సి వస్తుంది.పాలలో ఉండే ఆల్కలైన్ ని తయారుచేసే పదార్థాల వల్ల శరీరంలోని యాసిడ్ స్థితిని ప్రేరేపించే పరిస్థితులు చాలా త్వరగా సాధారణ స్థితికి వస్తాయి.

 నిద్రలేమితో బాధపడుతున్న వాళ్లు రోజు పడుకోబోయేముందు ఒక గ్లాసు పాలలో తేనె కలుపుకొని తాగడం వల్ల సుఖ నిద్ర పడుతుంది.

 జలుబు, గొంతు బొంగురు పోవడం,  ఉబ్బసం,టాన్సిలైటిస్,బ్రాంకైటిస్ వ్యాధులు ఉన్న వాళ్ళు ఒక గ్లాసు వేడి పాలలో చిటికెడు పసుపు,కొద్దిగా మిరియాల పొడి కలుపుకొని రోజు రాత్రి సమయంలో తాగడం వల్ల ఈ సమస్యలన్నీ తగ్గడమే కాకుండా,శ్వాస సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి.

 పాలమీద మీగడ లో కొద్దిగా వెనిగర్, చిటికెడు పసుపు కలిపి గాయాల పైన, పుండ్లు పైన, పూయడం వల్ల త్వరగా మానిపోతాయి.


రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...

వ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

కొడాలి ఇలాకాలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ... వింత గెలుపు

హీరోయిన్ కాంచన పద్మావతి అమ్మవారి కోసం చేసిన భువిరాళం..ఎన్ని కోట్ల విలువ తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>