MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/-dia-mirza-getting-ready-to-marry-again1078a3b2-67d3-4973-a1df-60f07cc24572-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/-dia-mirza-getting-ready-to-marry-again1078a3b2-67d3-4973-a1df-60f07cc24572-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత అందంగా ఉండే నటీమణుల్లో ఒకరైన దియామీర్జా ప్రస్తుతం తెలుగులో నాగార్జున హీరోగా నటిస్తున్న వైల్డ్ డాగ్ సినిమాలో ఒక ఎమోషనల్ రోల్ లో నటిస్తున్నారు. ఈ యాక్షన్ సినిమా ద్వారా ఆమె తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే దియా రెండవ వివాహం చేసుకోబోతున్నారనే వార్త హల్ చల్ చేస్తోందిdiya mirja;dia mirza;mirza;nagarjuna akkineni;ahmed;deepa;diya;mithra;hyderabad;germany;bollywood;2019;cinema;telugu;university;businessman;marriage;twitter;degree;february;husband;heroine;dilమరో పెళ్ళికి రెడీ అయినా నాగార్జున హీరోయిన్మరో పెళ్ళికి రెడీ అయినా నాగార్జున హీరోయిన్diya mirja;dia mirza;mirza;nagarjuna akkineni;ahmed;deepa;diya;mithra;hyderabad;germany;bollywood;2019;cinema;telugu;university;businessman;marriage;twitter;degree;february;husband;heroine;dilSun, 14 Feb 2021 13:00:00 GMTబాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత అందంగా ఉండే నటీమణుల్లో ఒకరైన దియామీర్జా ప్రస్తుతం తెలుగులో నాగార్జున హీరోగా నటిస్తున్న వైల్డ్ డాగ్ సినిమాలో ఒక ఎమోషనల్ రోల్ లో నటిస్తున్నారు. ఈ యాక్షన్ సినిమా ద్వారా ఆమె తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే దియా రెండవ వివాహం చేసుకోబోతున్నారనే వార్త హల్ చల్ చేస్తోంది. దియా మీర్జా.. ప్రముఖ బిజినెస్ మ్యాన్ వైభవ్ రాఖీ తో ఫిబ్రవరి 15వ తారీఖున ముంబయిలో బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రస్తుతం ఆమె రెండవ పెళ్లి చేసుకోబోయే వైభవ్ ముంబైకి చెందిన వ్యాపారవేత్త. కాగా, ఆయన పలి హిల్ ఏరియాలో నివాసముంటున్నారు.

2019 వ సంవత్సరం లో తన మొదటి భర్త సాహిల్ సంగా నుంచి విడాకులు తీసుకున్నట్టు దియామీర్జా ట్విట్టర్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. దియా మీర్జా, సాహిల్ సంగా కలసి బోర్న్ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించి 3 సినిమాలను నిర్మించారు. సాహిల్ సంగా కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. దియా, సాహిల్ చాలాకాలంపాటు ప్రేమించుకొని 2014 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. 5 సంవత్సరాల పాటు సంసారం చేశారు కానీ ఆ తర్వాత భిన్నాభిప్రాయాలు తలెత్తడంతో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.

ఇకపోతే 2000 సంవత్సరంలో 'మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్' అందాల పోటీల్లో టైటిల్ గెలుచుకున్న దియా "రెహ్నా హై టెర్రే దిల్ మెయిన్" సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు దక్కించుకున్న ఆమె ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించి బాగా పాపులారిటీ దక్కించుకున్నారు. కాగా, హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన దియా ఖైరతాబాద్ లో ప్రాధమిక విద్యను పూర్తి చేశారు. అంబేద్కర్ యూనివర్సిటీ లో డిగ్రీ పూర్తిచేసారు. దియా తల్లి దీప జర్మనీ కి చెందిన ఫ్రాంక్ హ్యాండ్రిచ్ ని మొదటగా పెళ్లి చేసుకున్నారు. దియా కి నాలుగున్నర ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత దీప హైదరాబాద్ కి చెందిన అహ్మద్ మిర్జా అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.


చంద్రబాబు మాట కంటే ఆ మంత్రి మాటకే విలువ ఎక్కువా...? పాపం

కడుపుతో ఉన్నా కూడా తుపాకి పట్టింది..గుండెలు కదిలించే కథ

రేవంత్ రెడ్డి హఠాత్తుగా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు ?.. అసలు కారణం అదేనా..?

స్టార్ హీరోలను ఢీ కొట్టిన కమెడియన్...?

అప్పట్లో కన్నీళ్లు తెప్పించి, కాసుల వర్షం కురిపించిన సినిమా ఏంటో తెలుసా...!

నిహారిక పెళ్ళితో సాయి ధరమ్ తేజ్ కు ఒత్తిడి !

ఎడిటోరియల్: “కోవిడ్ వ్యాక్సీన్” కోసం భారత్ ను ఎందుకు సంప్రదించ లేదు? కెనడా మంత్రి అనితా ఆనంద్ ను ప్రశ్నించిన ఎంపి వార్నర్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>