PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/somu-veerrajudd22f654-ba13-4f53-a632-d20ec98e5cbf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/somu-veerrajudd22f654-ba13-4f53-a632-d20ec98e5cbf-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం అమరావతి ఉద్యమాన్ని భుజాన వేసుకునే ప్రయత్నం చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని రెండు, మూడు రాజధానులు వద్దు అని పదే పదే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు రెండు జిల్లాల స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలలో మాత్రం తెలుగుదేశం పార్టీ ఘోరంగా విఫలమైంది. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. అమరావతి ప్రాంతంలో వైసీపీ నేతలు ఎక్కువగా ప్రచారం చేయడం అలాగే ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో somu;bharatiya janata party;telugu desam party;somu veerraju;amaravati;andhra pradesh;telugu;vishakapatnam;television;uttarandhra;local language;ycp;partyసోము వీర్రాజుకి షాక్ ఇచ్చిన వైసీపీసోము వీర్రాజుకి షాక్ ఇచ్చిన వైసీపీsomu;bharatiya janata party;telugu desam party;somu veerraju;amaravati;andhra pradesh;telugu;vishakapatnam;television;uttarandhra;local language;ycp;partySun, 14 Feb 2021 09:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం అమరావతి ఉద్యమాన్ని భుజాన వేసుకునే ప్రయత్నం చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని రెండు, మూడు రాజధానులు వద్దు అని పదే పదే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు రెండు జిల్లాల స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలలో మాత్రం తెలుగుదేశం పార్టీ ఘోరంగా విఫలమైంది. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. అమరావతి ప్రాంతంలో వైసీపీ నేతలు ఎక్కువగా ప్రచారం చేయడం అలాగే ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో రెండు జిల్లాల్లో కూడా ఇప్పుడు వైసిపి మంచి విజయాలను నమోదు చేసింది.

ఈ రెండు జిల్లాల్లో కూడా అధికార పార్టీని ప్రజలు ఆదరించడంతో ఇప్పుడు ప్రతిపక్షాలు అమరావతి ఉద్యమం విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇటీవల అమరావతి ఉద్యమం ఎత్తుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మరి భవిష్యత్తులో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు ఏంటి అనేది చూడాలి. బిజెపి రాష్ట్ర స్థాయి నేతలు కూడా కొంతమంది అమరావతి ఉద్యమానికి మద్దతు ఇస్తూ టీవీ సమావేశాల్లో పదేపదే మాట్లాడుతున్నారు. అమరావతి ఉద్యమానికి ప్రజల్లో అనుకున్న విధంగా మద్దతు లేదు అని కాబట్టి జాగ్రత్త పడకపోతే మాత్రం బీజేపీ కూడా నష్టపోయే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

అయితే విశాఖ జిల్లాలో మాత్రం తెలుగుదేశం పార్టీ సహా పలు విపక్షాలు ప్రభావం చూపించాయి. అధికార పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇబ్బందులు పడింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇక్కడ అంతగా ప్రభావం చూపించే అవకాశాలు ఉండకపోవచ్చు. కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మరి ఎంత వరకు ఇక్కడ అధికార పార్టీని కట్టడి చేసి ప్రజల్లోకి వెళ్తారు ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే అమరావతి ఉద్యమం మాత్రం నీరుగారిపోయింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.



జగడ్డ: చిత్తూరులో నిమ్మగడ్డ పర్యటన.. పోలీసుల అభ్యంతరం..?

ఏపీ పంచాయతీ ఎన్నికల్లోనే అది రికార్డు విజయం..

జగడ్డ : రెండో విడతలోనూ ఎవరి లెక్కలు వారివే..

చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రికి షాక్ ఇచ్చిన ఓట‌ర్లు.... అక్క‌డ సైకిల్ గ‌ల్లంతు

వైసీపీ కీల‌క‌నేత‌కు షాక్‌.. నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో టీడీపీ ఘ‌న‌విజ‌యం

తెలంగాణ టీడీపీపై చంద్ర‌బాబు మ‌ళ్లీ ఫోక‌స్‌... ఇదిగో సాక్ష్యం..

జగడ్డ: నిమ్మగడ్డ జగన్ చేతికి అడ్డంగా దొరికిపోయారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>