PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/lokeshb5bfc021-b884-4e8c-aebf-cf6728787d89-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/lokeshb5bfc021-b884-4e8c-aebf-cf6728787d89-415x250-IndiaHerald.jpgవైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ టీడీపీ నేత, గాజువాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆదివారం విశాఖ చేరుకుని, పల్లా శ్రీనివాస్‌కు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోలేని సీఎం.. ప్రత్యేక హోదా సాధిస్తారా అని లోకేశ్ ప్రశ్నించారుvizag steel;bharatiya janata party;jagan;nara lokesh;andhra pradesh;industries;steel plant;vishakapatnam;government;chief minister;mla;industry;letter;tdp;reddy;gajuwakaవిశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోలేని సీఎం.. ప్రత్యేక హోదా సాధిస్తారా - నారా లోకేశ్విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోలేని సీఎం.. ప్రత్యేక హోదా సాధిస్తారా - నారా లోకేశ్vizag steel;bharatiya janata party;jagan;nara lokesh;andhra pradesh;industries;steel plant;vishakapatnam;government;chief minister;mla;industry;letter;tdp;reddy;gajuwakaSun, 14 Feb 2021 21:45:00 GMTగత రెండు వారాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపుతున్న వార్త విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక్క పెద్ద ఇండస్ట్రీ అయిన ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బీజేపీ మినహా మిగిలిన అన్ని పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలో భాగంగానే టీడీపీ నేత, గాజువాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఇక ఆయన దీక్షకు అన్ని పార్టీల నేతలు కూడా సంఘీభావం తెలుపుతున్నారు. ఇక ఇప్పుడు తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆదివారం విశాఖ చేరుకుని, పల్లా శ్రీనివాస్‌కు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్‌సీపీ నేత విజయసాయి రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.



ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆంధ్రులకు అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదని లోకేశ్‌ స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోలేని సీఎం.. ప్రత్యేక హోదా సాధిస్తారా అని లోకేశ్ ప్రశ్నించారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు. టీడీపీ హయాంలో విశాఖకు అదాని డేటా సెంటర్‌ తీసుకువచ్చామని, అలాంటిది వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక్క ఐటీ పరిశ్రమ అయినా తీసుకువచ్చారా? అని నిలదీశారు. ఇక్కడ ఉన్న పరిశ్రమలను వెనక్కి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ‘151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉండి జగన్ ఏం సాధించారు.. గాడిదలు కాస్తున్నారా? జగన్ గన్ అన్నారు.. కాకపోతే అది బుల్లెట్ లేని గన్ అని.. నొక్కితే నీళ్లు బయటకు వస్తున్నాయి’ అని ఎద్దేవా చేశారు. ప్రైవేటీకరణపై కేంద్రానికి సీఎం లేఖ రాశారన్నారని, ఢిల్లీలో అడిగితే లేటర్ రాలేదని చెబుతున్నారని దుయ్యబట్టారు.



ప్రశాంతతకు మారుపేరైన విశాఖలో ప్రశాంతతే లేకుండా పోయిందని విమర్శించారు. ఆదివారం వస్తే ఏ ఇల్లు పగలగొడతారో, ఏ గోడ కూలదోస్తారనే భయంతో జనం బతుకుతున్నారని దుయ్యబట్టారు. జగన్ తల్లి విజయలక్ష్మీని లక్షా యాభైవేల ఓట్లతో ఓడించారు కాబట్టి విశాఖపై కక్ష తీర్చుకోవాలనే ఉక్కు ఫ్యాక్టరీని ప్రయివేటీకరణకు సహకరిస్తున్నారని అన్నారు. పార్లమెంట్‌లో ట్వీట్ రెడ్డిగారు ఓ ప్రశ్న అడగడంతో వారి రహస్య ఒప్పందం బయటపడిందని పరోక్షంగా విజయసాయిరెడ్డిపై విమర్శలు గుప్పించారు. విశాఖలో స్టీల్‌ ప్లాంట్‌ భూముల విలువ దాదాపు రూ.2లక్షల కోట్లు ఉంటుందని దొడ్డిదారిన వాటిని కొట్టేసేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు అండగా నిలబడతామని చెప్పేందుకు జగన్‌కు ధైర్యం లేదన్నారు. పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వంలో కదలిక రాలేదని, వైఎస్‌ఆర్సీపీ నేతలు మాయమాటలు చెబితే ప్రజలు నమ్మే స్థితిలో లేరు అని లోకేశ్‌ అన్నారు.




రామ్ ఆ కొలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడా?

స్టార్ హీరో అయ్యాక అబ్బాస్ పెట్రోల్ బంక్ లో ఎందుకు పని చేయాల్సి వచ్చింది

మూడు వారాల గ్యాప్ లో ... మూడు సునామీలు ....బాక్సాఫీస్ రచ్చ రచ్చే .... ??

RC15 కి మ్యూజిక్ డైరెక్టర్ అతనేనా?

హమ్మా.. మళ్లీ మెగాస్టార్ సరసన ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందిగా..

జగడ్డ: కృష్ణా జిల్లాలో రగడ దేనికి సంకేతం...?

హీరోయిన్ కాబోతున్న తెలుగు టిక్ టాక్ స్టార్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>